సిద్ది గణపతి పూజ వలన కలిగే ప్రయోజనాలు.!

3.235.101.141

సిద్ది గణపతి పూజ వలన కలిగే ప్రయోజనాలు.!🌼🌿

ఐశ్వర్య సిద్ధికి అద్భుతమైన మార్గం సిద్ది గణపతి ధ్యానం. సిద్ది గణపతి ధ్యానం అష్ట ఐశ్వర్యాలను, అష్టసిద్ధులనూ ప్రసాదిస్తుంది.

సిద్ది గణపతి ఎవరు. అయన రూపం ఎలా ఉంటుంది.
వినాయకుని 32 రూపాలలో సిద్ధిగణపతి రూపం ఒకటి. ఈయననే పింగళ గణపతి అంటారు.

ఈయన పూర్ణత్వానికి సంకేతం.
సిద్ది గణపతి బంగారు వర్ణంలో శోభాయమానంగా ఉంటాడు. కుడిచేతిలో మామిడిపండు, పరశువు ఎడమ చేతిలో పూలగుత్తి చెరకు గడలు ధరించి తొండంతో నువ్వుల కుడుమును పట్టుకొని దర్శనమిస్తాడు సిద్ది గణపతి.

సిద్ది గణపతి ఆరాధన వలన కలిగే శుభాలు.
సిద్ది గణపతి అష్టసిద్ధులనూ ప్రసాదిస్తాడు. సిద్ది గణపతి ఆరాధనతో కార్యాలను నిర్విఘ్నంగా పూర్తి చేయగల శక్తి లభిస్తుంది.

ప్రతి రోజు సిద్ది గణపతిని ధ్యానించడం వలన మీ ఆలోచనలకు అనుకూలంగా పరిస్థితులలో మార్పు రావడం , ఇక నెరవేరవు అని మీరు నిరాశగా వదిలేసిన అనేక కార్యాలు నెరవేరడము గమనిస్తారు. ఐశ్వర్యము సైతం సిద్ధిస్తుంది.

సిద్ది గణపతి ధ్యానం..
"పక్వ చూత మంజరీచేక్షుదండ తిలమోదకైస్సహ
ఉద్వహన్ పరశుమస్తుదే నమః శ్రీ సమృద్ధియత హేమ పింగళ!

శ్రీ లలిత 

Quote of the day

Without peace, all other dreams vanish and are reduced to ashes.…

__________Jawaharlal Nehru