Online Puja Services

ఇంట్లో పాడైపోయిన దేవుడి విగ్రహాలు లేదా ఫోటోలు ఏం చేయాలి?

3.128.199.88
ఇంట్లో పాడైపోయిన విరిగిపోయిన లేదా జీర్ణమైన విగ్రహాలు, చిత్రపటాలు (photos) ఏంచేయాలి ఈ సమస్య మరియు ప్రశ్న అందరికీ ఉండేదే.. చాలా మంది తమ ఇంట్లో పాడైపోయిన విగ్రహాలు, పటాలు ఏ దేవాలయంలోనో లేదా రోడ్డుప్రక్కన చెట్టు క్రిందో వదిలేసి వెళ్లిపోతుంటారు. కానీ తెలిసి తెలియక అలా చేయడం మహాపాపం. క్షమించరాని నేరం.
 
ఇంట్లో వున్నంతకాలం పూజలు చేసి తరువాత అవసరం లేదని లేదా పాడైపోయాని వాటిని ఏ చెట్టు క్రిందో లేదా ఏ రోడ్డు పక్కన పడవేయకండి. అలా రోడ్డు పక్కన ఉన్న మన "హిందూ దేవుళ్ళ" ఫోటోలు చూసి ఇతర మతస్తులు మన మతం గురించి చాలా అవహేళన చేస్తున్నారు.
 
 వారికీ ఆ అవకాశం ఇవ్వకండి. ఇతర మతస్థుల దేవుళ్ళ ఫోటోలు అంత దయనీయంగా మనం ఎక్కడన్నా చూస్తామా మీరే ఆలోచించండి. దయచేసి మనకు అవసరం లేని పటాలను లేదా దేవుడి బొమ్మలను అగ్నికి ఆహుతి ఇవ్వడం మంచి పద్దతి. 
 
అదేంటి దేవుడి పటాలను అలా అగ్నిలో వేస్తారా ఎక్కడైనా ? అన్న సందేహం మీకు రావచ్చు. కానీ అగ్ని సర్వభక్షకుడు, అన్ని వేళలా పునీతుడు. కనుక పవిత్రాగ్నిలో దేవతా పటాలను సమర్పించడం ఎంతమాత్రం తప్పుకాదు లేదా ప్రవహిస్తున్న నది? లో గాని మన ఊరి చెరువుల్లో గాని "నిమజ్జనం" చేయండి.
 
అయితే అగ్నిలో వేయాలనుకున్న నదిలో వదలానుకున్నా ముందుగా ఆ విగ్రహానికి నమస్కరించి..
 
'' గచ్చ గచ్చ సుర శ్రేష్ఠ స్వస్థాన పరమేశ్వర ''
 
అని వదిలేయండి. ఇది కూడా నిమజ్జనం అని తెలుసుకోండి. దీనిని గురించి మీ మిత్రులకూ సమాచారం ఇవ్వండి. ఇది మన కర్త్యం. ధర్మ ఆచరణ చేయండి. ధర్మాన్ని కాపాడండి. "ధర్మో రక్షతి రక్షితః".
 
- శిరీష బాలాచారి విశ్వకర్మ 
 

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore