Online Puja Services

పంచ పాత్ర అంటే?

3.17.150.89
పంచ పాత్ర అంటే ఒక పాత్ర కాదు. ఆరాధనకు అయిదు పాత్రల్లో శుద్ధోదకం ఉండాలి. మనం ఒక పాత్రలోనే అన్నీ ఉంచి మమ అనేస్తున్నాము.
 
మొదటిది అర్ఘ్య పాత్ర: భగవంతుని చేతులు కడిగేందుకు సమర్పించే శుద్ధ జలాలతో  కూడిన పాత్ర
 
రెండవది పాద్య పాత్ర: ఇది భగవంతునికి పాదాలను శుభ్రపరిచేందుకు సమర్పించేందుకు శుద్ధ జలాలతో కూడిన పాత్ర
 
మూడవది ఆచమనీయ పాత్ర: ఇది భగవంతుని కి పుల్లించడానికి సమర్పించే శుద్ధోదకం నింపిన పాత్ర. 
 
నాలుగవది స్నాన పాత్ర: ఇది భగవంతుని కి స్నానము చేయించడానికి కావలసిన శుద్ధోదకం నింపుకున్న  పాత్ర
 
ఐదవది శుద్ధోదక పాత్ర- ఇందులో భగవంతుని కి సమర్పించే జలాలు నింపుకున్న పాత్ర
 
ఇవి పంచ పాత్రలు..ఇవి గాక ప్రతిగ్రాహక పాత్ర ఉపచారాలు చేశాక తీసిన నిర్మాల్యపు జలాలు నింపుకునే పాత్ర,మరొక శుద్ధ జలం అవసరం అయితే కావాల్సిన జలాన్ని నింపుకున్న పాత్ర, ఇంక ఆచార్య పూజ కూడా ఉండే వాళ్లకు ఆచార్యునికి అర్ఘ్య సమర్పణకు ఒక పాత్ర ఉండాలి.
 
ఇంకా సర్వార్థ జల పాత్ర- ఇది మన చేతులు మరియు,ప్రతీ ఉపచారానికి మధ్య మధ్యలో ఉద్ధరిణ శుభ్రం చేసి తిరిగి మరొక ఉపచారము చేసేప్పుడు వాడే దానికి శుద్ధ జలము నింపిన పాత్ర
 
- L. Rajeshwar
 

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore