Online Puja Services

ఎన్ని బాధలబెట్టి యేచెదవు - అన్నమయ్య కీర్తన

13.58.39.23

ప : ఎన్ని బాధలబెట్టి యేచెదవు నీవింక యెంతకాలముదాక కర్మమా
మన్నించుమనుచు నీమరుగు జొచ్చితిమి మామాటాలకించవో కర్మమా


చ : ప్రతిలేని దురితముల పాలుసేయకనన్ను పాలించవైతివో కర్మమా
తతితోడ నాత్మపరితాపంబు తోడుతను తగులేల చేసితివో కర్మమా
జితకాములకుగాని చేతికిని లోనయి చిక్కవేకాలంబు కర్మమా
మతిహీనులైనట్టి మాకునొక పరిపాటి మార్గంబు చూపవో కర్మమా


చ: అసలనియెడి తాళ్ళ నంటగట్టుకవిధికి నప్పగించితివిగదె కర్మమా
వాసి విడిచితిమి నీవారమైతిమి మమ్ము వన్నె చెడనీకువో కర్మమా
కాసుకును గొరగాని గతిలేని పనికిగా కాలూదనీవేల కర్మమా
ఓసరించొక మారు వొయ్యనే వొకరీతి నొల్లనని తలగుమీ కర్మమా


చ: తిరువేంకటాచలాధిపుని మాయలచేత దెసల దిరిగినయట్టి కర్మమా
హరిదాసులగువారి నాదరింతువుగాక అంత నొప్పింతువా కర్మమా
వరుస నేనుగుమీదివానిసున్నంబడుగ వచ్చునా నీకిట్ల కర్మమా
పరమపురుషోత్తముని భ్రమతబడి నీవిట్ల బట్టబయలైతిగా కర్మమా

Quote of the day

In the sky, there is no distinction of east and west; people create distinctions out of their own minds and then believe them to be true.…

__________Gautam Buddha