Online Puja Services

ధర్మం పాటించిన "గంటలు"

3.144.96.159
వెన్న తిన్న కృష్ణయ్యని ఊర్లోవాళ్లు అందరు వెన్న దొంగ,వెన్న దొంగ అంటూ కృష్ణుడిని దొంగను చేసారు. యశోదమ్మ! కి ఫిర్యాదులు కూడా అందాయిట.
 
కృష్ణయ్య ఆగడాలకు హద్దులేకుండా పోయిందని అంటూవుంటే యశోదమ్మ బాధపడేదిట ఊళ్ళో వాళ్ళ మాటలకు ! కృష్ణయ్య మా ఇళ్లలో పడి వెన్న దొంగిలించి తిన్నాడమ్మా అని చెప్పేవారు. కానీ కృష్ణుడు మాత్రం నేనేఁతినలేదు వాళ్లే నామూతికి పూసి అలా అంటున్నారని అనేవాడుట.
 
అయితే కృష్ణుణ్ణి ఎలాగైనా పట్టుకోవాలని ఊర్లో వాళ్లు అందరు నిర్ణయించుకొని, వాళ్ళ ఇళ్లకు ద్వారం, గడప , కిటికీ, ఉట్టి దగ్గర అన్ని చోట్లా గంటలు కట్టారుట. 
 
అయితే, రోజూ లాగానే కృష్ణుడు తన స్నేహితులను వెంటేసుకుని వెళ్ళాడు. అందరూ ద్వారం దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ ద్వారానికి గంటలు కట్టి ఉన్నాయి. మరిప్పుడేలా ని అందరూ ఆలోచనలోపడ్డారు.
 
అప్పుడు కృష్ణుడు! ఏమీ కాదు హరే కృష్ణ అనుకుంటూ లోనికి వెల్లండి! అన్నాడుట.
ఆవిధంగా, అందరూ ద్వారం తెరచి లోనికి వెళ్లారు గంటలు మ్రోగలేదు, గడపనుంచి కిటికీ నుంచి లోనికి వెళ్లారు ఐనా సరే గంటలు మ్రోగలేదుట, ఉట్టి మీద ఉన్న వెన్న కుండలు తీశారు చక్కగా అందరూ వెన్నతింటూ ఆనందంగా ఉన్నారు. 
 
అందులో ఒకరు కృష్ణా! నువ్వు కూడా తినూ అని కొంచం వెన్న తీసి కృష్ణునికి నోటిలో పెట్టారు. ఇంతలో ఒక్కసారిగా అన్నీ గంటలు' ఘణ ఘణ ఘణ ఘణ మని మ్రోగడం మొదలు పెట్టాయిట.
 
అప్పుడు కృష్ణుడు గంటలతో ఇలా అన్నాడు అయ్యయ్యో....చప్పుడు చేయకుండగా ఉండమని చెప్పాను కదా మీకు.....
 
అప్పుడు! గంటలు ఇలా అన్నాయిట..
 
- మీకు నైవేద్యం పెట్టే సమయంలో మ్రోగడం మా ధర్మం కదా స్వామి...అన్నాయట...
 
కృష్ణం వందే జగద్గురుమ్

Quote of the day

A coward is incapable of exhibiting love; it is the prerogative of the brave.…

__________Mahatma Gandhi