Online Puja Services

కాలడి – కార్బన్ డేటింగ్

3.15.225.173
ఒకసారి కాంచీపురం శ్రీమఠానికి ఒక భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాడు. అతని కుటుంబం బాగోగుల గురించి విచారించిన తరువాత మహాస్వామి వారు అతణ్ణి ఒక పని చేయమని చెప్పారు. ఒక గజఈతగాడితో కాలడిలోని పూర్ణానది(పెరియర్ నది) నుండి రెండు చోట్ల నది అడుగునుండి ఇసుక తీయమని చెప్పారు. ఒకటి ఆ నది కేరళలో కాలడిలోకి ప్రవేశించే ముందు మరియు ఇంకొకటి కాలడిలో. తరువాత స్వామివారు అలా తీసిన ఇసుకని కార్బన్ డేటింగ్ ద్వారా ఆ ఇసుక యొక్క వయస్సు కనుగొనమని చెప్పారు. మహాస్వామి వారి ఆజ్ఞ మేరకు ఆ శాస్త్రజ్ఞుడు ఆ రెండుచోట్ల ఇసుకని తీయించి దాని వయస్సు నిర్ధారణ చేసారు. మొదట స్థలంలో తీసిన ఇసుక షుమారు లక్ష ఏళ్ళకు పూర్వం ఏర్పడినదని, రెండవ చోట తీసిన ఇసుక దాదాపు 2500 సంవత్సరాలకు పూర్వం ఏర్పడినదని తేలింది.

మనకు లభించే చరిత్ర ప్రకారం ఆది శంకరాచార్యుల తల్లి గారైన ఆర్యాంబ రోజూ స్నానానికి పూర్ణా నదికి వెళ్ళడానికి కష్టంగా ఉంటే శంకరులు పూర్ణా నదిని తమ పాదములను అనుసరించి(కాల్ + అడి = కాలడి) వచ్చి, తమ పూర్వీకులు నివసించిన ఇంటి ముందు నుండి ప్రవహించు లాగున చేశారు.

కాబట్టి కాలడిలోని ఆ నది ఇసుక వయస్సును బట్టి ఆది శంకరాచార్యుల వారు 2500 సంవత్సరాలకు ముందు దాదాపు క్రీ.పూ. 509లో పుట్టారని స్పష్టమగుచున్నది. కింద ఉన్న చిత్రం కాలడిలో మనకు దర్శనమిచ్చే పూర్ణా నదీమతల్లి. 
 
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।। 
 
- శ్రీనివాస మూర్తి చిట్టమూరి 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha