Online Puja Services

గరుత్మంతుడి విగ్రహం కళ్ళ నుంచి నీరు వస్తుంది ఇక్కడ...

3.135.190.101

దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ శ్రీకృష్ణ, శ్రీ రామ ఆలయాలు ఒకే దగ్గర ఉండి విడివిడిగా ధ్వజస్తంభాలు, బలిపీఠాలు ఉండటం విశేషం. ఇంకా ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న గరుత్మంతుని విగ్రహం కన్నుల నుండి నీరు బొట్లు బొట్లు గా పడుతూ ఉంటాయి. ఇలా గరుత్మంతుని విగ్రహం కన్నుల నుండి నీరు బొట్లు బొట్లు గా పడటానికి హనుమంతుడే కారణం అని చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? హనుమంతుడు గరుత్మంతుడి గర్వాన్ని ఎలా అణిచివేశాడనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట మండలం మన్నార్ పోలూరు అనే గ్రామంలో అళగుమల్లరి కృష్ణస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయంలో జాంబవతి, సత్యభామ సమేత శ్రీ కృష్ణపరమాత్మ కొలువై ఉన్నారు. ఈ ఆలయం ఎంతో మనోహరంగా ఉండటం వలన ఇక్కడ కొలువై ఉన్న స్వామిని అళగుమన్నారు అని పిలిచారు. తమిళంలో అళగు అంటే అందం అని అర్ధం. ఇలాంటి విశేషంగల దేవాలయం ఇక్కడ తప్ప దేశంలో మరెక్కడా కనబడదు.

ఈ ఆలయంలో విశేషం ఏంటంటే, గరుత్మంతుని విగ్రహం కన్నుల నుండి ఎప్పుడు నీరు కారుతూ ఉంటుంది. దీని వెనుక ఒక పురాణం ఉంది, శ్రీకృష్ణుడు ఈ క్షేత్రంలో జాంబవంతుడికి శ్రీరామచంద్రుడుగా దర్శనమిచ్చాడు. అప్పుడు హనుమంతుడుని కూడా పిలుచుకు రమ్మని స్వామి గరుత్మంతుడిని పంపించాడు. తనంతటి బలశాలి లేడనే గర్వంతో గరుడుడు, హనుమంతుడి ధ్యానానికి భంగం కలిగించాడట.

రామనామ స్మరణకి భంగం కలిగించిన గరుడినిపై హనుమ కోపంతో చేయి చేసుకుంటాడు. హనుమంతుడు కొట్టిన ఆ దెబ్బకి ఆయన ముందు తాను ఎంత బలహీనుడననేది గరుడినికి అర్థమైంది. ఆ తరువాత విషయం తెలుసుకున్న హనుమ ఆయనని అనుసరించి ఇక్కడికి వచ్చాడు. అందుకే ఈ క్షేత్రంలో ఒక చెంప వాచినట్టుగా ఉండి కంటి నుండి నీరు వస్తుంది అని స్థల పురాణం చెబుతుంది.

ఇక ఈ ఆలయంలో 9 అడుగుల ఎత్తు గరుత్మంతుని విగ్రహం, తొమ్మిదిన్నర అడుగుల ఎత్తు జాంబవంతుడు, సుగ్రీవ జటాయువుల విగ్రహాలు ఉన్నాయి. శ్రీకృష్ణ – జాంబవంతుల మధ్య మల్లయుద్ధం జరిగింది ఈ ప్రాంతంలోనే అని పురాణ ఇతిహాసం. ఈ ఆలయం 10 వ శతాబ్దంలో చోళరాజుల కాలంలో నిర్మించినట్లు తెలియుచున్నది.

ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయంలో నిత్యపూజలతో పాటు కృష్టాష్టమి మరియు పర్వదినాలలో ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

శరత్ కుమార్

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha