Online Puja Services

నర దిష్టికి నాపరాయి అయినా పగులుతుంది

3.141.199.243

నర దిష్టికి నాపరాయి అయినా పగులుతుంది అని మన పెద్దలు అంటుండేవారు. అవును నిజమే అనిపిస్తుంది ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో అవునా కదా నేను అన్నమాట. 

అలాంటి నరదృష్టి తొలగిపోవాలంటే 
వారానికోసారి ఇలా చేయండి.

నరదృష్టి తొలగిపోవాలంటే.. వారానికి ఓసారి రాళ్ల ఉప్పును స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే నరదృష్టి అంటే కంటిదృష్టి దూరమవుతుంది. శారీరక అలసట వుండదు. సోమరితనం పరారవుతుంది. ముఖ్యంగా పుట్టిన రోజుల్లో లేకుంటే మంగళవారం చేస్తే కంటిదృష్టి తొలగిపోతుంది.

అనారోగ్య సమస్యలు తలెత్తవు. అలాగే వ్యాపారాలు చేసే చోట కంటి దృష్టి తొలగిపోవాలంటే.. నిమ్మపండును సగానికి కోసి మధ్యలో కుంకుమ అద్ది వాకిటికి ఇరువైపులా వుంచితే.. అదీ మంగళవారం పూట ఇలా చేస్తే కంటి దృష్టి లోపాలుండవు. 

అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి వంటి తిథుల్లో ఉదయం, సాయంత్రం పూట సాంబ్రాణీ వేయడం మంచిది. పచ్చకర్పూరం, కస్తూరి పసుపు, అత్తరును గోమూత్రంలో కలిపి ఇంటా, వ్యాపారం చేసే చోట చల్లితే కంటి దృష్టి తొలగి.. ఆదాయం లభిస్తుంది. రుణబాధలుంటే.. వినాయక స్వామి ఆలయంలో అర్చన చేయడం మంచిది. కులదైవ పూజ చేయాలి. వినాయకుడికి అర్చన చేసిన కొబ్బరి కాయలోని నీటిని తొలగించి అందులో నెయ్యి లేదా నువ్వుల నూనెను పోసి దీపమెలిగిస్తే మంచి ఫలితాలుంటాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. 

శుక్లపక్షంలో వచ్చే శని, ఆదివారాల్లో వీలైన వాళ్ళు సముద్రతీరానికి వెళ్లి ఆ నీటిలో వాటర్ బాటిల్‌లో తెచ్చుకుని అందులో పసుపు పొడిని కలిపి.. ఇంట్లో, కార్యాలయంలో చల్లినట్లైతే కంటి దృష్టి తొలగిపోతుంది. ఇంకా సముద్రపు నీటిలో స్నానం చేయడం ద్వారా శరీరంలోని ఏడు చక్రాలకు బలం చేకూరుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. 

సముద్రపు స్నానం చెయ్యటానికి వీలు లేని వాళ్ళు కాశి గంగ ఉంటే అందులో పసుపు కలిపి పైన చెప్పిన విధముగా చల్లినట్లయితే ఫలితముంటుంది 

అమ్మ అందరిని చల్లగా చూడమ్మా

బి. సునీత 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha