Online Puja Services

పాతాళ వినాయకుడిని దర్శించుకుంటే అన్నీవిజయాలే!

3.144.113.197
పాతాళ వినాయకుడిని  దర్శించుకుంటే సర్వం శుభకరం..అన్నీవిజయాలే!
 
దక్షిణ భారత దేశంలో ఆ పరమేశ్వరుడు కొలువై ఉండే పుణ్య క్షేత్రాల్లో శ్రీకాళహస్తి అత్యంత ప్రసిద్ది చెందిన క్షేత్రం. రాహు కేతు పూజల జరిగే ఈ క్షేత్రంలో చాలా మందికి తెలయని మరో రహస్యం పాతాళ గణపతి ఆలయం గురించి.
 
ఏ పండగైనా, ఏ శుభకార్యమైన తొలిపూజలు అందుకునే వినాయకుడు స్వయంభువుగా అనేక పుణ్య క్షేత్రాల్లో ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాల్లో ఒకటి శ్రీకాళహస్తి.  శివుడి పంచభూత క్షేత్రాల్లో ఒకటైన శ్రీకాళహస్తిలో ',పాతాళ వినాయకుడు' కూడా దర్శనమిస్తుంటాడు. ఈ పాతళ వినాయకుడి గురించి శ్రీ కాళహస్తి మహాత్యంలో ధూర్జటి, హరవిలాసంలో శ్రీనాథుడు పేర్కొన్నారు.
 
భారత దేశంలో కెల్లా అతి ప్రాచీనమైన పుణ్య క్షేత్రంగా విరాజిళ్లుతుంది.  శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయం ఉత్తర గోపురానికి దగ్గరలో ఉన్న ఈ ఆలయంలో వినాయకుడు పాతాళంలో కొలువుదీరి ఉంటారు. పాతాళ వినాయక స్వామి వారు కొలువై ఉండటం వెనుక ఒక కథనం ఉంది.
 
పూర్వకాలంలో అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలోని జీవనదిలో ప్రవేశించాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తుంటాడు. ఆ ప్రార్థనతో స్వర్ణముఖి నది పాయ ఏర్పడింది కానీ అందులో నీళ్లు ఉండవు. ఈ కార్యం మొదలు పెట్టే ముందు గణపతిని పూజించకుండా ఈ కార్యం తలపెట్టుటే అందుకు కారణమని గ్రహించిన అగస్త్యుడు గణపతిని ఆరాధించాడు. పాతాళ మార్గం గుండా అక్కడికి చేరుకున్న గణపతి అగస్త్య మహర్షి కోరికను నెరవేర్చాడు.
 
అగస్త్యమహర్షి కోరిక మేరకు గణపతి దర్శనం ఇచ్చిన చోటునే వెలిశాడు. అందువలన ఈ శ్రీ కాళహస్తిలో వినాయుని పూజించడం వల్ల ఆటంకాలు, ఆందోళనలు తొలగిపోయి విజయాలు చేకూరతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. అంతే కాదు, అక్కడికి దర్శించే భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.
 
శ్రీ కాళహస్తీశ్వరస్వామి వారిని దర్శించుకునే భక్తులంతా ఈ పాతాళ వినాయకున్నిసేవించుకోవడం పరిపాటి.  పాతాళ వినాయకుడి దర్శనం సర్వశుభకరంగా భక్తులు భావిస్తారు...
 
- శ్రీనివాస్ గుప్త వనమా 

Quote of the day

In the sky, there is no distinction of east and west; people create distinctions out of their own minds and then believe them to be true.…

__________Gautam Buddha