కేశవ నామాలు గణిత భూమిక

3.231.167.166
కేశవ నామాలు గణిత భూమిక
 
విష్ణుమూర్తికి 24 పేర్లున్నాయి.  వాటిని కేశవనామాలంటారని మనకు తెలుసు.
 
ఇవి 24 మాత్రమే ఎందుకు ఉన్నాయి?  
 
వీటికి కాలచక్రానికి, గణితానికి ఏమైనా సంబంధం వున్నదా?
 
ఈ 24 కు గణిత పరమైన భూమిక ఏమిటి?
చూద్దాం.
 
విష్ణుమూర్తిని చతుర్భుజుడు అంటాం.అంటే నాలుగు చేతులు గలవాడని కదా?
ఈ నాలుగు చేతుల్లో శంఖం,చక్రం, గద,పద్మాలను ధరించి మనకు దర్శనమిస్తాడు.
 
నిశితంగా పరిశీలిస్తే, ఈ నాలుగు ఆయుధాల యొక్క అమరికలలో వచ్చే మార్పుల వల్ల ఖచ్చితంగా 24 వేరువేరు రూపాలు విష్ణువునకు ఏర్పడతాయి. 
ఈ 24 రూపాలనే కేశవనామాలంటారు.
 
1.కేశవ నామాలలో మొదటి నామం కేశవ.
 
కేశవ రూపంలో స్వామి కుడివైపు ఉన్న రెండు చేతులతో 
పద్మము, శంఖము
ధరించి ఎడమ వైపు ఉన్న రెండు చేతులతో 
గద,చక్రం
ధరించి ఉంటాడు.
 
 2.విష్ణువు యొక్క మరొక నామము మాధవ.
 
ఈ రూపంలో కుడి వైపు రెండు చేతులతో
గద,చక్రం ధరించి,ఎడమవైపు ఉన్న రెండు చేతులతో
పద్మము,శంఖము* ధరించి ఉంటాడు.
 
3.మధుసూధన రూపంలో
 
కుడివైపు చేతులతో  చక్రం, శంఖము
మరియు ఎడమవైపు చేతులతో
గద,పద్మము ధరించి ఉంటాడు.
 
ఈవిధంగా ప్రతి పదిహేను రోజులకు (పక్షానికొకసారి) 
 
పౌర్ణమికి, అమావాస్య కు తన ఆయుధాలను చేతులు మార్చుకుంటూ ఉంటాడు శ్రీ మహా విష్ణువు.
 
ఈ మార్పులు లేదా అమరికలను మనం గణిత శాస్త్ర పరిభాషలో  ప్రస్తారాలు (permutations)
అంటాం.
అనగా 4 వస్తువులను 4! 
(4 factorial) విధాలుగా అమర్చవచ్చు.
 
 4! = 4×3×2×1=24
 
శంఖాన్ని ' శ' తోను,
చక్రాన్ని    'చ' తోను,
గదను      'గ' తోను,
పద్మాన్ని  ' ప' తోను సూచిస్తే,
 
ఆ 24 అమరికలు క్రింది విధంగా వుంటాయి.
 
1) శచగప  2) శచపగ
3) శపచగ  4) శపగచ
5)శగచప  6)శగపచ
7)చపగశ  8)చపశగ
9)చగపశ  10)చగశప
11)చశగప 12)చశపగ
13)గపశచ 14)గపచశ
15)గచశప 16)గచపశ
17)గశపచ 18)గశచప
19)పచగశ 20)పతశగ
21)పశగచ 22)పశచగ
23)పగశచ 24)పగచశ.
 
[పైవన్నీ ఒక క్రమంలో ఉన్నట్లు పరిశీలించి ఉంటారు.]
 
ఈ 24 నామాలు పెద్దలందరికీ తెలిసినా‌...
 
మరోసారి క్రింద ఉదహరిస్తున్నాను.
      
కేశవ,     నారాయణ
మాధవ,  గోవింద
విష్ణు,       మధుసూధన
త్రివిక్రమ, వామన
శ్రీధర,       హృషీకేశ
పద్మనాభ, దామోదర
సంకర్షణ,   వాసుదేవ
అనిరుధ్ధ,   ప్రద్యుమ్న,
పురుషోత్తమ, అధోక్షజ
నారసింహ, అచ్యుత
జనార్ధన,    ఉపేంద్ర
హరి,          శ్రీకృష్ణ.
 
ఈ నాలుగు ఆయుధాలను అన్ని విధాలుగాను మార్చుకోవటానికి 
24 పక్షాలు అంటే
12 నెలలు
అనగా  ఒక సంవత్సరం పడుతుంది.
 
జై శ్రీమన్నారాయణ
 
- రంగినేని శ్రీధర్ 
 

Quote of the day

As mortals, we're ruled by conditions, not by ourselves.…

__________Bodhidharma