మన జీవిత కాలం ఎంత? సాధన ఎంత?

3.235.105.97
ఇది వరకు మనుషుల కొన్ని వందల సంవత్సరాలు బతికే వారు.. 60 సం వరకు విద్యాబ్యాసంతో గడిపి అప్పుడు షష్ఠిపూర్తి చేసుకుని వివాహం చేసుకుని భార్య బిడ్డలతో 100 సం గడిపి తర్వాత కూడా భార్య అనుమతి ఇస్తే ఆశ్రమవాసం ,సన్యాసం లాంటివి తీసుకొనే వాళ్ళు.. తర్వాత తర్వాత ఆయువు తగ్గుతూ వచ్చింది..
 
గాయత్రి మంత్రాన్ని కనిపెట్టిన విశ్వామిత్రుడు ఒక క్షత్రియుడు 1000 సం తపస్సు చేసి అప్సరసతో విహరించి తపస్సు శక్తి అంతా స్వలాభం కి వాడుకుని శక్తి అంతా కోల్పోయి ఇంకో 1000 సం తపస్సు చేసి రాజర్షి ఐయ్యారు అప్పటిలో మంచి నీళ్ళు కందమూలాలు తింటూ ఎన్ని సంవత్సరాలు అయినా బతికే వాళ్ళు.. కనుక గురువు కోసం అన్వేషించి మంత్రం తీసుకుని లక్షలు జపం చేసి సిద్ది పొందే వరకు సాధన చేసే వారు..
 
అప్పటికి ఇప్పటికి కాలం మారింది మనిషి 60 సం బతకడం కూడా కష్టంగా ఉంది 30 దాటాక ఎక్కువ సేపు కూర్చుని జపం కూడా చేయలేని వాళ్ళు ఉన్నారు.. శ్రీ విద్య లాంటివి నేర్చుకునే దానికి దీక్ష ఇచ్చే వాళ్ళు ఉండాలి ఆ విద్య అంత నిగూఢమైన ది.. ఎగిరి ఎగిరి దంచిన అంతే కూలి ఎగరకుండా దంచిన అంతే కూలి అని శ్రీ విద్యలో అంతా చేసి పొందే అనుగ్రహ ము మీరు కేవలం లలితా సహాస్ర నామ పారాయణ జపం తో పొందవచ్చు కాకపోతే శ్రీ విద్యా ఉపాసకులకు మంత్ర సిద్ది లభించడం, ఆ తల్లి ని దర్శనం పొందటం ఇలాంటివి ఉంటుంది.. వాక్శుద్ధి ఉంటుంది.. భక్తిగా క్రమంగా ఏ సాధన చేసిన ధ్యానం చేయడం వల్ల మీకు అందరికి కూడా ఆ తల్లి ని దర్శించుకోవచ్చు.. అంతటా ఆ తల్లే ఉంది అనుకుంటే అంతా ఆమె రూపాలే కదా.. ఏవేవో నేర్చుకోవాలి ఏవేవో చేసేయాలి అని సమయం వృధా చేసుకోకండి మీకు అనువైన పద్దతిలో ఏది చేసినా క్రమం తప్పకుండా చేయండి చాలు.. ఈ భక్తి మార్గంలో ఒక క్రమశిక్షణ, శుభ్రత, పాపబీతి, ధర్మం, ఇటువంటి వి అలవాటు అవుతుంది దానివల్ల జీవితం ఉన్నతంగా సాగుతుంది.. ఉపదేశం తో చేసే మంత్రాలు యంత్రాలు తంత్రాలు సాధనలు ఈ బీబస్త్యం అంతా నేను మీకు ఇవ్వడం లేదు.. మీ సమస్యలు పరిస్కారం చేసుకోవడానికి శాస్త్రం లోని శక్తి సాబరం లాంటివి ఇస్తున్నాను అవి త్వరగా సిద్ధిస్తుంది మీకు మంచి జరుగుతుంది..అవి చేస్తే చాలు.
 
ఒక వాహనము 3 నెలలు నేర్చుకున్నారు అది మీకు వచ్చేసింది తర్వాత మానేశారు అంటే మర్చిపోతారు కదా అలాగే మంత్రం 40 రోజులు లేక ఒక 1 లక్ష జపం చేసి వదిలేయకూడదు ఆ బీజాన్ని మీ మస్తిస్కములు నాటారు నీరుపోయకపోతే ఎండిపోతుంది అలాగే మంత్రం కూడా జప సంఖ్య పూర్తి అయిన తర్వాత కూడా 108 సార్లు అయిన అంటే ఒక్క మాల అయినా జపం చేస్తూ ఉండాలి. ఆడివికి వెళ్లి తపస్సు చేసే రోజులు కాదు ఇవి నక్సలైట్ అని పట్టుకుపోతారు.. నిత్యo నామ స్మరణ అలవాటు చేసుకోండి. ఒక పేపర్ పైన మంత్రం రాసి శివుని ముందు ఉంచి జపం చేసుకోండి అలా అని అన్ని అలా చేయాకుడదు..అలా చేయవచ్చు అని చెప్పినవి మటుకే చేయాలి.. జీవిత కాలం తక్కువ కనుక దానం వల్ల, నామ స్మరణ వల్ల కలియుగంలో అధిక ఫలితాన్ని పొందవచ్చు..
 
ఉపాసనలో ఎప్పుడూ ఒకరిని కాపీ చేయాకుడదు ఉపాసకులు సూచన మటుకే పాటించాలి వారు పాటించే మార్గాలు సాధనకు తగట్టు ఉంటుంది అది అర్థం కాకుండా అనుసరించకూడదు. భక్తి తో ఏ మార్గం ఎంచుకున్న చివరికి చేరే సన్నిధి ఒక్కటే మనిషిలో ఉండవలసిన ది మానవత్వం, ధర్మ గుణం, ఇది ఉంటే దేవుడు మీతోనే ఉంటారు.. మంత్ర శక్తి ఉన్న వారుమోక్షానికి వెల్లచు వెళ్లక పోవచ్చు..కానీ మంచి తనం ఉన్నవాడు దైవంలోనే కలిసిపోయారు..
 
ఆసనమున అధమము(ఆసనాలతో సాధన), మానసంబున మద్యమం(ప్రాణాయామం తో సాధన), ఊరుకుండుట ఉత్తమ యోగం(ధ్యానం) అంటే (సహజ రాజ యోగం శ్రేష్టం.. ) కనుక మంత్రోపదేశం కోసం వెళ్లి ఎవరి కాళ్ళు పట్టుకోవద్దు. అంత గొప్పవాళ్ళు కలిస్తే గౌరవం గా ఆశీర్వాదం తీసుకోండి కానీ ఏవో ఉపదేశాలు తీసుకుని ఎదో సాదిద్దాము అనుకునే అంత ఆయుస్సు ఎవ్వరికీ లేదు . ఏ మంత్రం కూడా మీ అయుస్సు ని పెంచ లేదు జరిగిపోయిన కాలాన్ని వెనక్కి తేలేందు.. ఇది గుర్తు పెట్టుకుని ధర్మామార్గంలో నడుస్తూ మీ శక్తి కొద్దికే సాధన చేయండి చాలు.. లలితా పారాయణ సమయంలో మీలో ఎంతో మందికి ఎన్నో గొప్ప అనుభవాలు కలిగింది కదా అలా నే కొనసాగిస్తే చాలు. కొత్త ప్రయోగం ఎందుకు.. మీకు ఏ సాధన నేర్పిన మీకు ఉన్న తక్కువ కాలంలోనే మంచి ఫలితం పొందే విధంగా చెప్తున్నాను అవి చాలు. తెలియని వాటిని పుస్తకాలు చూసి ప్రయత్నం చేయకండి.
 
సనాతన ధర్మం యొక్క విలువ గొప్పదనం అందరికి తెలియాలి అని ఈ ప్రయత్నం చేస్తున్నాను.. కానీ కొందరు అడిగే సాధనాలు వింటే వాళ్ళు ఆలోచన విధానాల చూస్తే ఏమైపోతున్నారు అని పిస్తుంది సరైన అవగాహన లేక ఏడేదో అయిపోతున్నారు. అటువంటి వన్నీ మీకు అవసరం లేదు ప్రశాంతమైన జీవితం సంతోషంగా గడిపే ప్రయత్నం చేయండి చాలు అదే గొప్ప వరం
 
మీకు మంత్రం రాదు తంత్రం రాదు శివలింగం పైన కాసిన్ని నీళ్లు పోసి శివాయ నమః అనుకోవడమే తెలుసు అనుకోండి అదే పని జీవితకాలం ఆచరిస్తే అదే ఉపాసన అవుతుంది రోజు ఉదయం సూర్యుడు కి భక్తిగా ఒక నమస్కారం అది ప్రత్యక్ష నరాయణుడి అందుతుంది.. నిత్యం దీపం. పెట్టండి ఇంటికి శుభం కొన్ని సనాతన ధర్మంలో ఆచారాలు మన ఆరోగ్యం కోసం సూచించారు.. అవి పాటించాలి అంతే.. తెలియని వాటి కోసం మీ సమయాన్ని సంతోషాన్ని వదులుకోకండి
 
🌷శ్రీ మాత్రే నమః🌷
 
-భానుమతి అక్కిశెట్టి 
 

Quote of the day

Democracy and socialism are means to an end, not the end itself.…

__________Jawaharlal Nehru