ఈ ఫోటో ఇంట్లో పెట్టి పూజించండి

3.235.105.97
సంతానం అనుగ్రహించే సోమస్కంద మూర్తులు
 
పూర్తిగా చదవండి
సంతానం కలగాలని కోరుకునే దంపతులు 
శ్రీ సోమస్కంద మూర్తి చిత్రపటం గానీ, విగ్రహం కానీ ఇంట్లో పెట్టుకుని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే, పార్వతీపరమేశ్వరుల అనుగ్రహం వలన, సుబ్రహ్మణ్యుని వంటి తేజోమూర్తి అయిన సుపుత్రుడు జన్మిస్తాడు అని శాస్త్ర వచనం. అంతే కాదు పిల్లలు ఉన్నవారైనా సరే, ఈ సోమస్కంద మూర్తిని ఆరాధిస్తే, పిల్లలు చక్కని తెలివితేటలు, బుద్ధి కుశలత, చురుకుదనం, తేజస్సు పొందుతారు. అందుకే తమిళనాట సోమస్కంద మూర్తి ఆరాధన విశేషంగా చేస్తుంటారు ...
 
తమిళనాడులో ఈ మూర్తి ప్రతి శివాలయమున ఉంటారు ...
 
మన ఆంధ్రరాష్ట్రమున కపిలతీర్థం మరియు శ్రీ కాళహస్తీ దేవాలయాల్లో మాత్రమే మనకు కనిపిస్తారు ...
 
ఒక్కసారి ఈ సోమస్కంద మూర్తిని గమనించండి ...
 
పార్వతి పరమేశ్వరుల మధ్యలో చిన్న బాలుడుగా ఆడుకుంటూ సుబ్రహ్మణ్య స్వామి వారు ...
 
సో- ఉమా- స్కంద మూర్తి ...
 
సోముడు అనగా శివుడు , 
ఉమా దేవి అనగా పార్వతి దేవి, 
స్కందుడు అనగా సుబ్రహ్మణ్యస్వామి వారు,
 
వీళ్ళ ముగ్గురూ కలసి ఉన్న మూర్తినే సోమస్కంద మూర్తి అంటారు,చాలా విశేషమైన మూర్తి ...
 
- జానకి తిప్పభట్ల 
 

Quote of the day

Democracy and socialism are means to an end, not the end itself.…

__________Jawaharlal Nehru