Online Puja Services

రామ్ మందిర్' గురించి అందరూ తెలుసుకోవాల్సిన 10 నిజాలు!

3.143.218.146
రామ్ మందిర్' గురించి అందరూ తెలుసుకోవాల్సిన 10 నిజాలు!
 
అయ్యోధ్య లోని 'రామ్ మందిర్' నిర్మాణానికి ఆగస్టు 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీద పునాది పడింది. దేశమంతటా ఈ రోజు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా విజయగర్వంతో కనిపించారు. దేశమంతటా 'రామ్ మందిర్' నిర్మాణ భూమి పూజను ఒక పండుగలా జరుపుకున్నారు. దేశమే కాక అమెరికా లాంటి దేశం కూడా దిని గురించి ప్రస్తావించింది అంటే, రామ్ మందిర్ గొప్పతనం ఏంటో అర్ధం చేసుకోవచ్చు. మరి అలాంటి గొప్ప చరిత్ర కలిగిన రామ్ మందిర్ గురించి అందరూ తెలుసుకోవాల్సిన 10 నిజాలు ఏంటో చూద్దాం!
 
1) అయోధ్యను 'సాకేత్' అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశపు పురాతన నగరం. ఇది గొప్ప పురాణం రామాయణంతో, రాముడి పుట్టుకతో మరియు అతని తండ్రి దశరథుడి పాలనతో ముడిపడి ఉంది. మనల్ని ముందుకు నడిపించిన రామాయణం ఇదే నగరంలో చోటుచేసుకుంది. మన దైవం రాముడు కూడా పుట్టింది ఇక్కడే. అందుకే, అయ్యోధ్య అయింది. 
 
2) అప్పట్లో, అయోధ్య కోసల రాజ్యానికి  రాజధాని. కోసల దేశ రాజధానిని ఇక్ష్వాకు, ప్రీతు, మంధాట, హరిశ్చంద్ర, సాగర్, భగీరథ, రఘు, దిలీప్, దశరధ మరియు రాముడు వంటి ప్రముఖ రాజులు పాలించారు. 5వ -6వ శతాబ్దంలో బుద్ధ కాలంలో, క్రీస్తుపూర్వం శ్రావస్తి రాజ్యానికి ప్రధాన నగరంగా మారింది.  కొంతమంది పండితుల అభిప్రాయం ప్రకారం, బుద్ధుడు కొంతకాలం నివసించిన ప్రదేశమైన సాకేత్ పట్టణం, అయోధ్య ఒకేలా ఉంటుంది.
 
3) 11  మరియు  12వ శతాబ్దాలలో, కనౌజ్ రాజ్యం అయోధ్యలో ఉద్భవించిన తరువాత  ఔధ్ లేదా అవధ్ అని పిలిచేవారు. తరువాత, ఈ ప్రాంతం ఢిల్లీ సుల్తాన్, జౌన్‌పూర్ రాజ్యంలో చేర్చబడింది. ఆ తరువాత 16వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యంలో చేర్చబడింది.
 
4) సిద్ధాంతాల ప్రకారం, 17వ శతాబ్దంలో రాముడు పుట్టిన ప్రదేశంలో ఉన్న రాముడి మందిరాన్ని మొఘలులు కూల్చివేసి, ఆ స్థానంలో ఒక మసీదును నిర్మించారు. దాని పేరే బాబ్రీ మసీదు. అప్పటి నుంచి అది రాముడు పుట్టిన స్థలమే అంటూ కొందరు కాదని మరికొందరు వాదించుకుంటూనే ఉన్నారు.
 
5) 1853 లో, నిర్మోహి అఖారాకు చెందిన హిందూ సన్యాసుల బృందం బాబ్రీ మసీదు స్థలాన్ని ఆక్రమించింది. తదనంతరం, సివిల్ అడ్మినిస్ట్రేషన్ అడుగుపెట్టి, 1855 లో, మసీదు ప్రాంగణాన్ని రెండు భాగాలుగా విభజించింది: ఒకటి హిందువులకు, మరొకటి ముస్లింలకు. 1883 లో, హిందువులు వాళ్లకు ఇచ్చిన ప్రాగణంలో ఆలయాన్ని నిర్మించే ప్రయత్నాన్ని ప్రారంభించారు.  దీనికి అడ్మినిస్ట్రేషన్ అనుమతి నిరాకరించడంతో, వారు ఈ విషయాన్ని కోర్టుకు తీసుకువెళ్లారు.
 
6) 1992 లో, హిందూ జాతీయవాదులు బాబ్రీ మసీదును కూల్చివేయడంతో  హిందూ-ముస్లిం హింసను  ప్రేరేపించింది.
 
7) ఎన్నో ఏళ్ల వాదనలు, గొడవలు, హింసలు, నిందల తరువాత హిందూ దేవాలయాన్ని నిర్మించడానికి భూమిని ట్రస్ట్‌కు అప్పగించాలని 2019 నవంబర్ 9న సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రత్యామ్నాయంగా మసీదు నిర్మించడానికి 5 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డుకు ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించింది.
 
8) 2020 ఫిబ్రవరి 5న శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్రం అని పిలువబడే ట్రస్ట్ ను భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 
 
9) మార్చ్ నెలలో నిర్మాణ స్థలం తవ్వినప్పుడు ఐదు అడుగుల శివాలింగం, దేవి-దేవతాల విరిగిన విగ్రహాలు కనుగొనబడ్డాయి.
 
10) భారతదేశం యొక్క హిందువులకు, బాబ్రీ మసీదు కూల్చివేత మరియు అదే ప్రదేశంలో రామ్ మందిరాన్ని నిర్మించడం, మొఘల్ మరియు ఇతర ముస్లిం పాలకులు  తమ పూర్వీకులకు చేసిన అన్యాయాలకు హిందువులు సరి ఐన న్యాయం చేయడమే. .
 
ఇవి ప్రతిష్టాత్మక రామ్ మందిర్ నిర్మాణానికి  సంబంధించిన 10 నిజాలు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి.
 
 

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya