Online Puja Services

ఆసియా ప్రాచీన లైట్ హౌస్

3.142.197.212

ఆసియా ప్రాచీన లైట్ హౌస్ 

ఇది మహాబలిపురం లోని ఓల్కనీశ్వర దేవాలయం. దీనిని పల్లవ రాజు అయిన మహేంద్రవర్మన్ 630CE లో నిర్మించారు. ఒక విధముగా ఇది శివాలయం మరియు ఇది మరోరకంగా కూడా ఉపయోగపడుతుంది.ఇది ఒక దీప స్తంబమ్ గా ఉపయోగిస్తున్నారు. ఈ ఆలయం ఒక దీప స్థంభం గా ఆ సముద్రం మీద వెళ్లే పడవలకు ఒక దిశ చూపించే దానిలా ఉపయోగపడుతుంది.

అక్కడ దీపం వెలిగించడానికి వారు నూనె ను ఒక పెద్ద కుండలో పోసి దీపము వెలిగించి పైన చతురాస్త్రా కారం గా నిర్మించిన ఒక దిమ్మ,గుహ ఆలయం పైన ఉండే నిర్మాణం పైన పెడతారు.మండుతున్న కుండ వలన ఎంతో ప్రకాశం విడుదల ఐ రాత్రి పూట చాలా దూరం వరకు కనిపిస్తుంది.నిజానికి ఇది ఆసియ మొత్తం లో చాలా పాత దీప స్థంభం.

1887 లో బ్రిటీష్ వాళ్ళు కూడా ఒక లైట్ హౌస్ ప్రాచీన దీప స్థంభం పక్కనే నిర్మించారు.ఒక్కోసారి బ్రిటీష్ వారు కూడా ఈ లైట్ హౌస్ ను వాడారు.రెండవ అతి ప్రాచీన దీప స్థంబమ్ పోర్చుగీస్ వారి ద్వారా 1864 లో నిర్మించబడింది.

మరిన్ని వివరాలకు ....
హిమాన్షు ప్రభ రే రాసిన The archaeology of Seafaring in ancient South Asia" బుక్ చదవగలరు.


- పరశురామ్ పరశురామ్

 

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore