Online Puja Services

ధారుణిపతికిని తలబాలో - అన్నమయ్య కీర్తన

3.141.201.14
ధారుణిపతికిని తలబాలో
అన్నమయ్య కీర్తన 
 
ధారుణిపతికిని తలబాలో బహు
దారారతునకు తలబాలో
 
 
హేమవర్ణునకు ఇందిరాపతికి
దామోదరునకు తలబాలో
సామజభయరక్షకునకు తులసీ
ధామునకు హరికి తలబాలో
 
 
కలికి రుక్మిణికి కడుతమకించే
తలదైవమునకు తలబాలో
మలసి సత్యభామకు పతి పంకజ
దళనేత్రునకును తలబాలో
 
 
తిరువేంకటమున దినపెండ్లిగల
తరుణులపతికిని తలబాలో
ఇరవుగ బాయక ఇందిరనురమున
ధరియించు హరికి తలబాలో
 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha