Online Puja Services

రజత భస్మం ఉపయోగాలు తెలుసుకోండి..

3.137.185.180
భస్మముల ఉపయోగాలు - 
 
 రజత భస్మము - 
 
 *  రజత భస్మము సమస్త పిత్తరోగములను తగ్గించును . 
 
 *  నెయ్యి , తేనెతో కలిపి తీసుకొనుచున్న నేత్రరోగములను పోగొట్టును . 
 
 *  క్షయరోగమును తగ్గించును . 
 
 *  మూలశంఖ సమస్య నివారణ అగును. 
 
 * ఉదర సంబంధ దోషములను నివారణ చేయును . 
 
 *  పాండురోగ నివారణ అగును. 
 
 *  దగ్గుని నివారించును.
 
 *  నోటికి రుచి తెలియని సమస్యని నివారణ చేయును . 
 
 *  మధుమేహమునందు మంచి ఫలితాన్ని ఇచ్చును. 
 
 *  స్త్రీలకు వచ్చు శ్వేత ప్రదర సమస్య అనగా వైట్  డిశ్చార్జ్ సమస్య నివారణ చేయును . 
 
 *  శుక్రవృద్ధి కలిగించును. 
 
 *  ముసలితనం త్వరగా రానివ్వదు. 
 
           రజతభస్మాన్ని స్వర్ణభస్మంతో తగు పాళ్ళలో కలిపి నేను ఇవ్వడం జరిగింది. వీటితో పాటు వజ్రభస్మాన్ని కలిపి ఇవ్వడం వలన అద్భుతమైన ఫలితాలు వచ్చాయి. వజ్రభస్మం కేన్సర్ నివారణకు చాలా బాగుగా పనిచేయును . 
 
   తామ్ర భస్మం  - 
 
 *  తామ్రభస్మం కఫరోగములను నివారణ చేయడంలో సాటిలేనిది. 
 
 *  జ్వరాన్ని నివారణ చేయును . 
 
 *  శరీరంలో ఏర్పడే ఐదు రకాల గుల్మాలను పోగుట్టు శక్తి కలిగినది . 
 
 *  క్షయ రోగ నివారణ చేయును . 
 
 *  దగ్గు , ఆయాసాన్ని తగ్గించును . 
 
 *  అజీర్ణరోగాన్ని నివరించును . 
 
 *  కఫరోగమును పోగొట్టును . 
 
 *  పాండురోగ నివారణ చేయును . 
 
 *  పరిణామ శూలలు అనగా ఆహారం జీర్ణం అయ్యే సమయంలో కడుపులో వచ్చునొప్పిని నివారణ చేయును . 
 
 * యకృత్ ( Spleen ) , ప్లీహ రోగములు పోగొట్టును . 
 
 *  శరీరపు లావును తగ్గించును . 
 
 *  జీర్ణాశయ , ఆమాశయ సమస్యలను నివారణ చేయును . 
 
 *  పెట్టుడు మందు విషాన్ని విరిచేయును . 
 
 *  రక్తమును శుద్ది చేయును . 
 
 *  కుష్ఠురోగములను పోగొట్టును . 
 
 *  శరీరం బక్కచిక్కిన వారికి ఇచ్చిన కండపట్టి పుష్టిగా తయారగును . 
 
            పైన చెప్పిన భస్మములు సరైన పాళ్లలో తీసుకుని స్వర్ణభస్మముతో కలిపి ఇచ్చిన మంచి ఫలితాలు పొందవచ్చు. ఇక్కడ ముఖ్యముగా మనం తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉన్నది. ఈ భస్మాలు సరైన వైద్యుని పర్యవేక్షణలో , సరైన మోతాదులో కలిపి మాత్రమే వాడుకొనవలెను . మూలికల కంటే భస్మాలు వేగవంతమైన ఫలితాలు ఇచ్చును. 
 
            తరవాతి పోస్టులో మరికొన్ని భస్మాల  గురించి వివరిస్తాను. 
 
  
  గమనిక  -
 
           నాచే రచించబడిన "ఆయుర్వేద మూలికా రహస్యాలు " , " ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు "  అను ఈ రెండు గ్రంథముల యందు అత్యంత రహస్యమైన సులభముగా ఇంటి యందు , చుట్టుపక్కల దొరికే మూలికలతోనే పెద్దపెద్ద రోగాలను నయం చేసుకొనే విధముగా అనేక వైద్య యోగాలను ఇచ్చాను. ఈ గ్రంథాలలో ఇచ్చినటువంటి యోగాలు అన్నియు గత 250 సంవత్సరాల నుంచి వంశపారంపర్యముగా మాకు వస్తున్న రహస్యయోగాలు పరోపకారార్థం దాచుకోకుండా ప్రచురించాను.
 
           మన చుట్టుపక్కల ఉండే మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల బొమ్మలతో మొక్కల చిత్రపటాలు ఇవ్వడం జరిగింది.
 
            రైతులకు ఉపయోగపడేవిధముగా చెట్లను , భూమిని బట్టి , రాళ్లని బట్టి భూమి యందు జలమును కనుగొను విధానం , ముహూర్తాలను అనుసరించి ఏయే సమయాలలో పంటలు వేయాలి . ఆయుర్వేద మూలికల సహాయముతో పురుగు మందులు వాడకుండా అత్యంత ఎక్కువ దిగుబడులు సాధించే రహస్య వృక్షయుర్వేద యోగాలు , పశువులకు సంబంధించిన వైద్య యోగాలు కూడా ఇవ్వడం జరిగింది . ఈ గ్రంథాలలో ఇచ్చిన యోగాలు ఉపయోగించటం వలన ఎటువంటి వ్యతిరేక ఫలితాలు రావు.
 
      ప్రాచీన ఆయుర్వేద రహస్యాలు గ్రంథం 288 పేజీలు ఉంటుంది . విలువ 350 రూపాయలు మాత్రమే . ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథం 384 పేజీలు ఉంటుంది . విలువ 450 రూపాయలు . కొరియర్ చార్జి 50 రూపాయలు అదనం .పుస్తకములు ఎక్కువ కాలం మన్నిక కొరకు కుట్టించి ఇవ్వడం మరియు అత్యంత నాణ్యమైన తెల్లటి 80GSM పేపరుతో ఉంటాయి.
 
            ఈ రెండు గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా 9885030034 నెంబర్ కి ఫోన్ చేయగలరు. కామెంట్లు , మెస్సేజెస్ సమాధానము ఇవ్వబడదు. కాల్ చేయగలరు .
 
                  కాళహస్తి వేంకటేశ్వరరావు 
 
                         9885030034 
 
               అనువంశిక ఆయుర్వేద వైద్యులు
 

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore