శ్రీ భూతనాథుడు అంటే ఎవరు?

100.26.179.251
శ్రీ భూతనాథుడు అంటే ఎవరు *

సృష్టిలోని జీవ రాశులకు "భూతములు" అని పేరు.

నాధుడు అంటే? ఏలేడివాడు అని అర్థం.

భూతనాథుడు అంటే సృష్టిలోని జీవ రాశి లన్నింటిని ఏ లేనివాడు అని అర్థం. అంతేగాక ఆకాశము, గాలి, అగ్ని, నీరు, భూమి, అనే పంచభూతాలకు  "నాధుడు" గా వ్యవహరించుటచే  ధర్మశాస్త్ర కు  'భూతనాథుడు' అనే పేరు కలిగినది.

శబరి గిరి దేవుడు భూతనాథుడు కనుకనే మనం  కీర్తించే హరివరాసనంలో ..... అరుణ భాసరం స్వామి భూత నాయకం... కానీ శబరీష్ వరుణ్ ని భూతనాథుడు గా  ప్రస్తుతస్తున్నాము.

" శ్రీ ఆది శంకరాచార్యులు  శబరిమలై శాస్త" భూతనాథుడు గా భావించి* భూతనాధ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహా బాహొ "శాస్తే" తుభ్యం నమో నమః *అని ఈశ్వరునకు నమస్కరించారు. 

శివుని అష్టోత్తర శత  (108)మూర్తులలో భూతనాథ్ ఒకడు  వేదవ్యాసుడు శివపురాణంలో ధర్మ ఖండంలో తెలియజేశాడు. శివుడే 'శాస్త్రగా' అవతరిస్తాడు అని అంశాన్ని  గూర్చి తెలుసుకుందాం 
శబరిగిరీశవారునాకు  చెందిన శ్రీ భూతనాధ గాయత్రి మంత్రాన్ని పరిశీలిస్తే శాస్త్ర శివుడే అని శాస్త్ర మహాదేవుడు అని అర్థమవుతుంది.

* శ్రీ భూతనాథ గాయత్రి మంత్రం*
*  శ్రీ  భూతాది పాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో :శాస్తా ప్రచోదయాత్.*ఈ   మంత్రము యొక్క అర్థాన్ని తెలుసుకుందాం.భూతాదిపాయ  :సర్వ భూతములకు అధిపతిగా విద్మహే  :తీసుకుంటున్నాము మహాదేవాయ  :మహాదేవునిగా, శివునిగా  దిమహి : హృదయమునందు నిలుపు కొను చున్నారు.  తన:శాస్తా :అట్టి 'శాస్త' మమ్మల్ని ప్రచోదయాత్  :ప్రేర్ఏ  పెంచు గాక  (హృదయమునందు ఉండుగాక )

తాత్పర్యం  :సర్వ ప్రాణులకు  అధిపతిగా శివునిగా శాస్త్ర ను హృదయమునందు నిలుపుకొని చున్నాము అట్టి శాస్త్ర మమ్ములను ప్రేరేపించి జ్ఞాన మార్గము నడిపించు గాక. ఈ తాత్పర్యం ద్వారా' శాస్త్ర 'ఈశ్వరుడే అని అర్థమవుతుంది. శాస్తా  రుద్రుడే అని  ఏకాదశ రుద్రులు లలో శాస్త ఒకడని  శివ మహాపురాణం లో శత రుద్ర సంహిత లో వేదవ్యాసుడు వివరించియున్నాడు.

శాస్తా శివుడే అని విశ్వసించుట కు  మరో అద్భుతమైన ఆధారం ఉన్నది. అదేమిటంటే ఆదిశంకరుల చే రచింపబడిన 'శాస్త్ర పంచాక్షరీ స్తోత్రం' స్తోత్రంలో ప్రతి వరుసలో యుండే మొదటి అక్షరాలతో  'ఓం నమ:శ్శివాయ అనే శివ పంచాక్షరి మంత్రం ఏర్పడుతుంది.

శాస్త్ర పంచాక్షరి  స్తోత్రంలో శబరి గిరి దేవుడు ఈశ్వరుడు గా వర్ణించబడి నాడు. స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప....

Quote of the day

Even if a snake is not poisonous, it should pretend to be venomous…

__________Chanakya