Online Puja Services

మహాభారతంలో మచ్చలేని పాత్ర ద్రౌపది

18.221.165.246
మహాభారతంలో ఒక ప్రత్యేకమైన పాత్ర.
 
ఈవిడ గురించి సద్విమర్శలు ఎన్ని ఉంటాయో దుర్విమర్శలు కూడా కొన్ని ఉంటాయి.
అది ఆవిడ పాత్ర వైశిష్ట్యం. మహాభారతం గురించి తెలిపే రచయితల రచనా కౌశలానికి పదునుపెట్టే ఒక ప్రత్యేక పాత్ర ఈమె సొంతం. ఆమె గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం.
 
నారదపురాణం ప్రకారం :-
 
యముని భార్య శ్యామల
వాయువు భార్య భారతి
ఇంద్రుని భార్య శచీదేవి
అశ్విని దేవతల భార్య ఉష
 
వారివారి కర్తవ్య నిర్వహణ లోపం వలన భూమి మీద జన్మించండని బ్రహ్మ శపించాడట. వీరు వారి అంశలన్నీ ఒకచోట నిక్షిప్తం చేసి ద్రౌపదిగా యజ్ఞకుండం లోనుండి ప్రభవించినది గా చెపుతారు.
 
అందుకే
శ్యామల లోని - ధర్మత, కారుణ్యం,క్రమశిక్షణ
భారతి లోని - తెగింపు
శచీదేవి లోని - వైభవం ఆక్రోశం
ఉష లోని - అందం,లాలిత్యం,కోమలత్వం
ఉన్నాయని చెపుతారు.
 
మరొక వివరణ ప్రకారం :-
〰〰〰〰〰〰〰
1️⃣.ఇంద్రాణి అయిన శచీదేవి కర్మఫల వశాన
2️⃣.ఇంద్రసేన అను మౌద్గల్యుని భార్యగా జన్మించి అనంతరం
3️⃣.కాశీరాజు పుత్రికగా జనించి
...పంచకృత్త్వ స్త్వయోక్తోహం పతిం దేహీతి వై పునః |
...తత్తథా భవితా భద్రే!వచస్తద్భద్ర మశ్నుతే ||
ఐదుసార్లు పతినిమ్మని కోరావు కనుక మరుజన్మలో ఐదుగురు భర్తలను పొందగలవు అని శివుని చే వరం పొంది 
4️⃣.ద్రౌపది గా తరువాత జన్మ లో ద్రుపదునికి అయోజనిగా యజ్ఞకుండం ♨️ నుండి జన్మిస్తుంది.
 
పాండవుల పూర్వ చరిత్ర :-
 
పూర్వం ఇంద్రుడు పురోహితుడైన విశ్వరూపుని అతని కుమారుడైన వృతాసురుని చంపడం వలన
అతనిలోని
ధర్మ గుణం యమునిలోనూ
బలగుణం వాయువు లోనూ
రూప లావణ్యాలు అశ్వనిదేవతలలోనూ
చేరతాయి
ఈ నాలుగు అంశాలతో ఐదవరూపం తో మనుష్యజన్మ ఎత్తమని శివుడు ఇంద్రుని శపిస్తాడు.
పాండవులలో పంచభూత ప్రాధాన్యత :-
➖➖➖➖➖➖➖➖➖
ఇంద్రుని యొక్క పాంభౌతిక తత్వాలు
☸️
ధర్మః పృథ్వ్యనిలో భీమః
జలం పార్థో నలం స్ప్మృతః |
నకులః రూపతశ్చాగ్నేః
సమదేవో నభస్ప్మ్తృతః ||
☸️
౼ మార్కండేయ పురాణం
పృథ్విభాగం - ధర్మరాజు 
వాయుతత్వం - భీముడు 
జలాంశం - అర్జునుడు 
అగ్నితత్వం - నకులుడు 
ఆకాశభాగం - సహదేవుడు 
గాను
జన్మించారని చెపుతారు.
 
మరొకవివరణ ప్రకారం :-
 
1️⃣.దేవలోక అధిపతి అయిన ఇంద్రుడు శాప వశాన
2️⃣.మౌద్గల్యుని గా జన్మించి ఇంద్రసేన ను వివాహమాడి అనంతరం
3️⃣.కాశీరాజ పుత్రికకు వరప్రభావంచే
4️⃣.పంచపాండవుల రూపం లో జనించి ద్రౌపది రూపం లో ఉన్న శచీదేవి ని వివాహమాడతాడు.
 
పంచభర్తృత్వం పై వ్యాసమహర్షి వివరణ:-
 
తనకూతురైన ద్రౌపదిని పంచపాండవుల కు ఇచ్చి ఎలా వివాహం చేయాలి ఇది ధర్మసమ్మతమేనా⁉️ అని ఆలోచిస్తున్న ద్రుపదునికి పాండవులు ఇంద్రుని అంశలే అను రహస్యం ను వ్యాస మహర్షి దివ్య దృష్టి ద్వారా ద్రుపదునికి తెలియచేస్తాడు.
⚛
ఇదం చాన్యత్ప్రీతి పూర్వం నరేన్ద్ర దదామితే దివ్య మత్యద్భుతం చ |
దివ్యం చక్షుః కుంతీసుతాంస్త్వం పుణ్యైర్దివ్యైః పూర్వరూపై రుపేతాన్ ||
⚛
అంతేకాక ఐదుగురు భర్తలు ఉన్ననూ కన్యాత్వ భంగం కలుగకుండా పతిశుశ్రూష సిధ్ధిని సౌభాగ్యం ను శివునిచే వరంగా పొందింది అని తెలియచేస్తాడు.
.....పంచభిః ప్రాప్య కౌమారం మహాభాగా భవిష్యసి ||
ఇటువంటి ద్రౌపది చేతనే పరమాత్మ పెద్దల పట్ల అతిథుల పట్ల ఏవిధంగా మెలగాలో పాతివ్రత్య ధర్మాలను తెలియచేశాడు.
అరణ్యవాసం చేస్తున్న కాలంలో ఒకనాడు సత్యభామ శ్రీకృష్ణుని తోకలసి వారిని చూడడానికి వచ్చినపుడు ద్రౌపది తో ఈవిధంగా తన సందేహం వెలిబుచ్చుతుంది.
అతిపరాక్రమవంతులైన నీ భర్తలు నీ ఎడల సమానమైన ప్రేమ గౌరవాన్ని ఎలా చూపగలుగుతున్నారు? వారిమధ్య ఆ సయోధ్య ఉండడానికి నీవు ఏ ఏ ఉపాయాలు చేస్తావో తనకు తెలుపమని అడుగుతుంది.
అపుడు
భర్తలపట్లే కాక అతిథి అభ్యాగతుల పట్ల పెద్దవారి పట్ల ఎలా మెలగాలో తెల్పుతుంది.
☯️
స్నాన భోజన శయనాది సంప్రయోగ
మర్థి బతుకులకు మున్నెందు నాచరింప
బతులు వచ్చిన నాసన పాద్య విధుల
భక్తితో నేన కావింతు బనుప నొరుల
☯️
➡️ వారికి స్నాన భోజనాలను నేనే స్వయంగా దగ్గరుండి చూసుకొంటాను.
➡️ గురు బ్రహ్మణ దైవ అతిథులకు స్వయంగా నేనే పూజలు నిర్వహిస్తాను.
➡️ అత్తగారికి  సేవ చేస్తూ సంతోషం కలిగిస్తాను.
➡️ అసాధ్వులతో పరిహాసాలు స్నేహం కలహం కాని చేయను.
➡️ ధర్మరాజు సహపంక్తి లో నిత్యం భొంజనం చేసే వేలాది అతిథులకు వస్త్రభూషణాది బహుమానాలను నేనే విచారించి అందచేస్తాను.
➡️ నమ్మకులైన పరిచారకులను స్వయంగా విచారించి నియమిస్తాను.
➡️ భాండాగారం  లో ఉండే ధన దినసరి ఆదాయ వ్యయాలు అన్నీ క్షుణ్ణంగా నాకు తెలుసు.
ఈవిధంగా నా భర్తలకు ప్రియం చేకూర్చుతాను.
 
అంతేకాక భర్తమనసు ను ఆకర్షించడానికి ఉపాయాలు కూడా చెపుతుంది.
✡️
పతిగడవంగ దైవతము భామలకెందునులేదు
ప్రీతుడై సతీ గరుడించెనేని గల భాషిణీ
భాసుర భూషణాంబురా న్విత ధనధాన్య గౌరవము
విశ్రుత సంతతియున్ యశంబు సద్గతియును గల్గు
నొండు మెయిగల్గునే యిన్ని తెరంగు లారయన్
✡️
▶️ నిత్యము భర్త మనసెరిగి మంచి భావన తో ప్రియమైన పనులు చేస్తుండు.
▶️ ఇంటికి రాగానే ఎదురెళ్ళి ఆప్యాయంగా పలకరించి అవసరమైన పనులు పనివాళ్ళకు అప్పచెప్పకుండా నీవే దగ్గరుండి చేయి.
▶️ అతడు నీతో ఇష్టంగా చెప్పిన సంగతులు ఎవరికీ చెప్పవద్దు.
▶️ భర్తకు ముఖ్యులైన వారి పట్ల భక్తితో సపరిచర్యలు చేయి.
▶️ ఆయనకు ఇష్టం లేనివారు నీకు ఎంత కావలసిన వారు అయినా దగ్గరకు రానీయకు.
▶️ కులవతులు సతులు నిర్మలవంతులైన మగువలతోనే స్నేహం చేయాలి.
▶️ దురభిమానాన్ని వదలి పెట్టాలి.
ఈవిధంగా చేస్తే ఏ భర్త అయినా ఆ భార్యను తప్ప పరకాంత వైపు కన్నెత్తైనా చూడడు.
అని పతిసేవ అతిథి అభ్యాగతుల సేవను గురించి ద్రౌపది ద్వారా మనకు వివరిస్తాడు.
 
....ఈవిధంగా పంచభౌతిక అంశాత్మక ఇంద్రుడు పాండవులరూపం తో ద్రౌపదిరూపంలోని శచీదేవిని వివాహం చేసుకొంటాడు....
ఇది అర్థం చేసుకోలేని కొందరు వితండవాదం  మరియు దుర్విమర్శలు చేస్తుంటారు.
 
అంతేకాక
దుష్టశిక్షణ చేయవలసిన పాండవులు శాంతికాములై ఉన్నారు.
వారు దుష్టశిక్షణ చేయాలంటే విపరీతమైన సంఘటన ద్వారా కొపోద్రిక్తులు  కావాలి.
పాండవులు కోపోద్రిక్తులగుటకు తద్వార దుష్టశిక్షణ జరిగి భూభారం తగ్గిచడంలో ఆ జగన్నాటక సుత్రధారి ఆడించిన ఒక నాటకమే ద్రౌపది వస్త్రాపహరణం.
తద్వార పాండవులు శపథాలు చేసి భూభారం తగ్గించారు. అదేవిధంగా తన భక్తురాలైన ద్రౌపదిని శ్రీకృష్ణరూపంలో శీలభంగం కాకుండా కాపాడగలిగాడు.
ఏదిఏమైనా
ఏకోణం నుండి చూసినా మచ్చలేని  పాత్ర ద్రౌపది.
ఆమెలో మచ్చ కనపడే వారిలో అర్థ రాహిత్యం తప్ప మరోటికాదు.
ఆమె అభిజాత్యానికి ఆలవాలం
సౌందర్య సౌశీల్యాల పుట్టిల్లు
వివేక విజ్ఞాన విద్యా సంపదల సమాహారం.
రాజకీయాలు కరతలామలకం
పాతివ్రత్యానికి పట్టుకొమ్మ
నిఖిల సద్గుణాలకు సారూప్యం.
ద్రౌపది పాత్రను వేదవ్యాసుడు అత్యధ్బుతంగా తెలియచేశాడు.
దానికి మన కవిత్రయం (ముఖ్యంగా తిక్కన) మరింత మెరుగులు దిద్దారు.
అంత సాధ్వీమణి కనుకే
 
.....అహల్యా ద్రౌపదీ సీతా తారా మండోదరీ తథా।
.....పంచకన్యా స్మరేన్నిత్యం మహాపాతక నాశనమ్‌।।
 
అంటే, అహల్యా, ద్రౌపదీ, సీతా, తారా, మండోదరీ ఈ అయిదుగురు పుణ్యమూర్తులనూ ప్రతిరోజూ స్మరించినంతనే పాపాలు నాశనమవుతాయని పంచ మహాపతివ్రతలలో ఒకరిగా ద్రౌపది ని చెప్తారు. భావం.
.
.నేను ఇంతకు ముందు ద్రౌపది పంచభర్తృత్వం అని ఒక సంకలనం రాశాను. కానీ అందులో ఎందుకో  కొంత అసంతృప్తి ఉంది. 
ఆ తర్వాత యార్లగడ్డ లక్షీ ప్రసాద్ గారి చే రచించబడిన ద్రౌపది పుస్తకం  కొన్ని సందేహాలను తీర్చింది.
కానీ ఆ పుస్తకం ఎలానో పోగొట్టుకున్నాను.  ఆతర్వాత కొన్నాళ్లు కు ఈ పుస్తకం  దొరికి మరికొన్ని సందేహాలను తీర్చింది
 
- అశోక్ రెడ్డి కడప 
 
 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore