దీపం ప్రత్యక్ష దైవం

34.201.3.10
హిందూధర్మం లోని ఎన్ని గొప్ప విషయాలు ఇప్పుడు ఆచరణ లో లేక మరుగున పడిపోతున్నాయి... మార్గ నిర్దేశం చేస్తున్న సద్గురువులు ధర్మ ప్రచారం చేస్తున్న మహానుభావుల వలన ఇంకా ఇలాంటి పోస్ట్లు చదివే వారు మిగిలి ఉన్నారు...మహా సంద్రం లాంటి ఈ సనాతన ధర్మాన్ని ఎవరూ అవపొసన పట్టి పూర్తిగా తెలుసుకోలేరు... జీవిత కాలం మనము విద్యార్థులము సాధకులమే ,భక్తులము... అంతే..
 
అయితే ఇప్పుడు మనము తెలుసుకుంటున్న విషయం ఒక సామాన్య వ్యక్తి.. మంత్రతంత్ర సాధనాలు , గురువు ఉపదేశాలు, గొప్పగా హోమాలు, యజ్ఞయాగాలు, గో దానాలు భూదానాలు... మంత్రమహోదరి సాధనాలు ,లాంటివి చేసుకోలేని వారు 90% ఉన్నారు ...కొందరు అన్ని సక్రమంగా చేస్తున్న లోపం ఎక్కడ ఉందో ఆటంకం ఎందుకు కలుగుతుందో ఏమీ చేయించాలి తెలియకుండా ఎవరు ఏది చెప్తే అది చేయిస్తూ చివరికి దేవుడికి మహిమే లేదు అని నిందించే వారు ఉన్నారు....
 
అన్ని అరహతలు ఉన్నా మంచి ఉద్యోగం లేకపోవడం పెళ్లి కాకపోవడం, లోపం లేకపోయినా పిల్లలు కలగక పోవడం ,కారణం లేకుండా గొడవలో ఎరుక్కుపోవడం, ఇంట్లో ఎప్పుడు ఎందుకు గొడవలు జరుగుతుంది తెలియక మనశాంతి లేకపోవడంతో పాటూ ఎప్పుడు ఎదో ఒక అనారోగ్యం తో మానసిక రుగ్మతలు, ఎంత సంపాదించిన నిలవక పోవడం... ఇంట్లో ఏదైనా దోషం ఉన్నా తెలియక పోవడం, అకాల మృత్యు భయం,.. దిష్టి దోషాలు ,శాపనార్థాలు... కోర్ట్ గిడవలకు ,వ్యాపార అభివృద్ధికి విటాన్నిటికి ఒక మంచి పరిస్కరం మార్గం ఇప్పుడు చెప్తున్నాను..
 
ఈ పద్ధతి ఇప్పుడు ఉన్నది కాదు నేను కనిపెట్టినది అంతకన్నా కాదు.. ఎంతో పురాతనమైన శాస్త్ర సమ్మతమైన విధానం దీపారాధన, దీపంతో ఉపాసనా విధానం ఇంకా కొన్ని దేవాలయాలలో ఇప్పటికీ జరుగుతున్న దీపంతో ఉపాసన.. మహా శక్తి వంత మైన ఆరాధన...
 
రాజా రవివర్మ గారు దేవుడు బొమ్మలు గిసాక దేవుడి రూపం ఇలా ఉంటుంది అని మనకు చిత్ర పటాలు వచ్చాయి అంతకు ముందు మహా శిల్పులు , శిల్ప తంత్రాన్ని ఆధారంగా చేసుకొని సాముద్రిక లోపం లేకుండా చేసిన విగ్రహాలు గుడిలో చూడటమే తప్పా ఇంట్లో ఎవరికీ దేవుడి పటాలు ఉండేవి కాదు... అప్పుడు ఇంటి మధ్యభాగాన్ని కనపడేలా సపారు లో దీపం గూడు అని ఉండేది అక్కడ గోడకు తమలపాకులు గాని తులసి ఆకులు కాని రాశి దేవత నామాలను అందులో కుంకుమతో పెట్టి ఆ దీపం లోనే దేవతలను ఆరాధించే వారు మీ ఇంట్లో బాగా పెద్ద వారు ఉంటే అడిగి చూడండి ,ఆ రోజుల్లో కర్రెంట్ కూడా లేనందు వల్ల సాయంత్రం కూడా ఖచ్చితంగా దీపారాధన చేసే వారు... అప్పుడు పంటలు, ప్రజలు రోగాలు రాకుండా హాయిగా నే ఉండేవి....
 
మరి ఇప్పుడు సాధారణ కుటుంబాలు ఇలాంటి సమస్యల నుండి విముక్తి కోసం ఈ దీపంతో ఆరాధన ఎలా చేయాలి తెలుసు కుందాము...
అదేంటి ప్రత్యక్షంగా దేవతను ఆరాధించే విధానం చెప్తాను అన్నారు కదా అని అడుగుతారు కదా.. అవును దీపానికి ఒక్కో అర్ధ గడియకు ఒక్కో దేవత అధిపతిగా ఉంటారు.. ఉదయం 5 గ సమయానికి దీపానికి అది పతి వినాయకుడు...5.30 ని నుండి 6 గ వరకు దీపానికి అధిపతి లక్ష్మీ దేవి.. ఆ సమయంలో ఎక్కడ దీపం వెలుగుతుంది ఆ దీపంలో లక్ష్మి కూర్చుని నరాయణుడికి ఆరాధిస్తుంది అంతటి తల్లి పిలుపు విన్న నారాయణుడు దృష్టి ఆ ఇంటి పైన పడుతుంది.. అలా ప్రతి గడియకు దీపానికి అధిపతులుగా దేవతలు ఆ జోతిలో కొలువై ఉంటారు...
దోష నివారణకు ,జోతి స్వరూపము అయిన దైవాన్ని అనుగ్రహం కోసం ఎలా పూజించాలి ఇప్పుడు తెలుసుకుందాము.. కుల గురువులు సద్గురువులు మార్గ నిర్దేశంతో ఎందరో ఇది చేశారు చేస్తున్నారు.. మీలో ఎవరికైనా ఉపయోగ పడితే నాకు సంతోషం..
 
దీపంతో ఆరాధన విధానం..
ముందుగా ఒక పళ్ళెం తీసుకొని అందులో నీరు పోసు పసుపు వేయాలి, ఆ నీరు ఉన్న పళ్లెం లో కామాక్షి, కానీ అష్ట లక్ష్మీ ఉన్న దీపం గాని తీసుకొని పసుపు కుముకుమ పెట్టి ఇష్ట దైవాన్ని సంకల్పించుకుని.. మీ సమస్యా చెప్పుకొని సమస్య లేకపోతే దైవ అనుగ్రహం కోసం అని ఇష్టదైవాన్ని ,ఇలవెలుపుని తలుచుకొని, వినాయకుడిని తలుచుకొని.. దీపం వెలిగించి.. మీరు చేసే నిత్య పూజ చేసుకోవాలి.. దీపం కచ్చితంగా 41 రోజులు కొండ ఎక్కకుండా జాగర్త పడాలి...
 
ఒత్తి చిన్నది అయితే ఇంకో కొత్త ఒత్తి ని చేర్చి ఆ జోతి ని ఈ ఒత్తికి మార్చాక పాత ఒత్తిని తీయాలి కానీ దీపం కొండ ఎక్క కూడదు... దీపం కింద ఉన్న పళ్లెం లో నీరు ఆవిరి ఐపోతు ఉంటుంది మీరు నీరు పోస్తూ పసుపు వేస్తూ ఉండాలి.....41 రోజు పూర్తి అయ్యే సరికి మీ సమస్యలు చాలా వరకు పరిస్కరం లభిస్తుంది... లలితా పారాయణం, విష్ణు సహస్ర నామం , శివుని శ్లోకాలతో, శ్రీ సూక్తం, లక్ష్మీ అష్టకం లో,మీ ఇష్ట దైవం కావచ్చు ఆ శ్లోకాలతో ఈ దీపం జోతిని ఆరాధించి నివేదన చేసి హారతి ఇవ్వాలి...ఇది గృహంలో చేసే అఖండ  దీపా రాధన..
 
ఈ విధానంలో నియమాలు:
1.ప్రత్యేకంగా గది ఉన్న వారు చేయాలి...
2.వ్యాపార స్థలం లో అందరి ఎదురు కాకుండా పూజ చేసుకునే చోటు వేరుగా ఉంటే పెట్టచ్చు 
3.ఈ 41 days కొండ ఎక్కితే మళ్ళీ మొదటి నుండి చేయాలి.. కానీ దోషం ఏమీ లేదు..
4.మైలు ఉన్న వారు అటుగా రాకూడదు... వారిని తాకి దీపంలో నూనె పోయాకుడదు
5.అకండ దీపారాధన అంటే జోతి స్వరువురంలో భగవంతుడిని ప్రత్యక్షంగా ఆరాధించడం కాబట్టి నివేదన పూజ కచ్చితంగా చేయాలి..
6. ఈ 41 రోజు అకండ దీపారాధనలో మట్టి దీపము పెట్టకూడదు ఎందుకంటే దీపాన్ని నీటి పళ్లెం లో ఉంచాలి ఆ నీరు ఎంతగా ఆవిరి అవుతుంది మీ ఇంట కరువు అంతగా తీరుతుంటుంది...
7. 41 రోజు పూజ అయ్యాక మీకు మాములుగా అందులో దీపం పెట్టుకోవచ్చు లేదా కంటిన్యూ చేయచ్చు... ఆ పళ్లెం మటుకు అప్పుడప్పుడు తొమి పెట్టలు..
8. ఈ విధానం నేను చాలా మందికి చెప్పాను కొందరు ఒక డౌట్ అడిగారు వాళ్ళు ఎప్పుడో ఉదయం వెళ్లి రాత్రికి వస్తాము ఈ లోపు దీపంలో నూనె అయిపోయిన ఒత్తి అయిపోయిన చూసుకునే వారు లేరు అని చెప్పారు అలా సౌకర్యం లేని వారు.. ఉదయం కచ్చితంగా 5.30 కి ఇంట్లో దీపారాధన చేసి పూజ చేసుకోవాలి పూజ సంకల్పంతో యదా విధి గా 41 రోజు చేసుకోవాలి..ఆర్ధిక ఇబ్బందులు ఉండవు..
9.ప్రస్తుతం ఇక్కడ ఉంచిన దీపం ఇమేజ్ మీకు ఒక ఐడియా రావడం కోసం, మీరు పెట్టాలి అనుకుంటే మాత్రం కామాక్షి కానీ అష్ట లక్ష్మీ దీపం గాని తెచ్చుకోండి...
10. ఈ అఖండ  దీపం 41 రోజు సమయంలో పాలు, పెరుగు, బెల్లం నివేదనలో ఉండేలా చూసుకోండి compulsory కాదు... వేరే దీక్షా నియమాలు ఏమీ లేదు.. దీపం 41 రోజు కొండ ఎక్క కూడదు అదే ముఖ్యమైన  నియమం...
 
(కేవలం ఈ దీపం ఎలా పెట్టాలో చెప్పిన సరిపోతుంది కానీ అర్థం ఇలా  వివరించడం వల్ల మీకు ఈ పూజ విలువ తెలుసుకుని ఇంక కొందరికి తెలియ చేస్తారు వివరంగా చెప్పడం కుడా నా బాధ్యత) 
 
శ్రీ మాత్రే నమః
 
- భానుమతి అక్కిశెట్టి 

Quote of the day

The greatness of a nation can be judged by the way its animals are treated.…

__________Mahatma Gandhi