హనుమ ఏనాడు తనకోసం తాను బతుకలేదు

3.235.137.159

స్వామి హనుమ జీవితం మనం చూస్తే, ఆయన ఏనాడూ కూడా తన కోసం తాను బ్రతకలేదు. ఈ విషయం మనకి రామాయణం చూస్తే అర్థం అవుతుంది. 

సముద్రం దాటి, లంకను చేరి, యుద్ధం చేసి, సీతను రాముడి చెంతకు చేర్చాడు. ఒక్కసారి కూడా తన శక్తులను తనకోసం ఉపయోగించుకోలేదు. పరోపకారమే జీవితపరమార్ధంగా నడిచాడు. చివరికి పెళ్లి కూడా తన కోసం తాను చేసుకోలేదు. అంతటి సౌశీల్యుడు.

గుణంలో రాముడికి ఏమాత్రం తీసిపోని సౌశీల్యం హనుమది. ఇక అతని సౌశీల్యం గురించి చెప్పాలంటే... ఒక విద్యార్థి ఎలా ఉండాలి, ఒక ఉద్యోగి తన యజమాని ఇచ్చిన పనిని ఎంత అంకితభావంతో చేయాలి, 

కార్యసాధనలో కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి... ఇలాంటి విషయాలు అన్ని హనుమని చూసి మనం నేర్చుకోవచ్చు. హనుమని ఆరాధిస్తే బుద్ది కుశలత, నేర్పుగా మాట్లాడటం వస్తుంది. అందుకే చిన్నపిల్లల్ని హనుమని ఆరాధించమని చెప్తారు. ఇక ఆయన బలపరాక్రమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను. 

రామాయణం మొత్తంలో సుందరకాండ చాలా రమ్యంగా ఉంటుంది. రామాయణం మొత్తంలో రాముడు కనిపించినా, సుందరకండలో రాముడు కనపడడు. అయినాకాని అంత రమ్యంగా ఉండటానికి కారణం హనుమ యొక్క గుణగణాలే. సుందరకాండలో స్వామి హనుమ తన గుణశీలపరాక్రమాలు అంతలా ప్రకటణం చేశారు. అందుకే సుందరకాండ చదివితే ఎవరైనా కష్టాలలో ఉన్నప్పుడు తిరిగి ఊంచుకొని నిలబడగలిగే శక్తి వస్తుంది అంటారు పెద్దలు. 

ఏ పరిస్థితుల్లో అయినా, ఏ సంధర్భంలో అయినా, ఎలాంటి భయంకర సమయంలో అయినా స్వామి హనుమని తలుచుకుని మధ్య వేలితో నేలమీద హనుమ అని రాసి శరణు కోరితే ఆయన ఖచ్చితంగా అక్కడకు వచ్చి నిలబడి భయం పోయేవరకు మిమ్మల్ని రక్షించి తీరుతారు. ఇది చాలా సందర్భాల్లో నిరూపితమైన సత్యం. 


జై శ్రీరామ్ 

 
- దత్తు రాక్ స్టార్ 

Quote of the day

All the suffering and joy we experience depend on conditions.…

__________Bodhidharma