కూర్మావతారం నుండి హరిని వేరు చేసిన శాస్తా

3.235.137.159
హరిహర పుత్రుడు  శ్రీధర్మశాస్తా కథలు. సీరియల్.నం. 12
 
 
ఈ దినము కూర్మావతారం నుండి హరిని వేరు చేసిన శాస్తా  
 
ఆరి సరోరుహ శoఖ గదాధరం పరిక ముత్కర బాణ ధనుర్ధరo!
 
చురిక దోమర శక్తి లసత్కరం హరి హారాత్మజ మీశ్వర మాశ్రాయే!!. 
 
కమలము, శంఖం, గదా రొకలిబండ, కేటాయము, విల్లు, అంబు చేరిక, ఈట, వేల్ మున్నగు ఆయుధములు తమ కరకమలములందు ధరించియుండు శ్రీహరి హారాత్ముజుని  శరణము వేడెదము.
 
**********
 
దేవతలు, రాక్షసులు అమృతమునకై పాల కడలిని చిలుకునపుడు, తొలి దైవం అయిన విఘ్న రాజైన  వినాయకుడిని ప్రార్థించ మరచి కార్యమును ప్రారంభించారు. అందులకై వారి పనికి విఘ్నములు  ప్రారంభమై, మెల మెల్లగా మందరిగిరి పర్వతము అంచెలంచెలుగా సముద్రములోనికి కృంగి పోసాగెను. అపుడు దేవతలు తమ తప్పను తెలుసుకొని వినాయకుడిని ప్రార్థించారు. పిదప కార్య సాధనకై స్థితికారకుడైన హరిని ప్రార్థించిరి. 
 
   అపుడు వారిని ఆదుకొనుటకై శ్రీహరి ప్రత్యక్షమై తనలో నఘోడమై ఉన్న శక్తిని బయటకు రప్పించి, దానిని కూర్మముగా అవతరింపచేసి, ఆగిరిని తన మూపుపై ధరించు మనెను. బ్రహ్మాoడ రూపమున  ఆ తాబేలు ఆ పర్వతాన్ని తన మూపున దాల్చి సముద్రము పైకి   కొని తెచ్చెను. వారు చిలుకటకు  ప్రయత్నించగా ఆ  గిరి కదలలేదు. అపుడు తిరిగి వారు కూర్మమును ప్రార్థింప, కూర్మావతారుడు తన శరీరములో నుండి పది వేల కరములను మొలిపింప చేసి,  ఆ పర్వతమును కదలనీయక పట్టుకోవడంతో క్షీర సాగర మథనం సఫలీకృతమై అమృతం వచ్చినది. అది వారు తీసుకెళ్లి పోయారు. హరి మోహిని అవతారము దాల్చి ఆ కార్యము చేయ తొడoగెను. 
 
        వారు మరలిన పిదప కూర్మ రూపునికి, భృగు శాప కారణాన మరపు ప్రాప్తించి,   కించిత్తు గర్వం పొడచూపినది. తన వల్లనే అమృతం లభించిందని, దేవాసురులకన్న తానే గొప్ప ని, తన వేల కరములతో సముద్రమును అల్లకల్లోలం చేసి, సప్త సముద్రాలను  త్రాగి వేసెను. సముద్ర జీవములన్నియు మరణించెను. దాని భీభత్సవం భరింప జాలక దేవతలు పరమ శివుని శరణు జొచ్చిరి.
 
       అంత ఆ కూర్మమును అణచివేయుటకు తన పుత్రులు సమర్థులని, శాస్తావారిని, స్కందుని పంపారు. హుoకారముతో అట్ట హాసము  చేయు కూర్మమును గాంచిన సుబ్రహ్మణ్యుడు, తన అమూల్య శక్తిచే మూర్ఛిల్ల చేసెను.  
 
       దాని బలమంతా ఆ చిప్పలో నున్నది గ్రహించిన శాస్తా ఆ కూర్మమును ఒడ్డుకు లాక్కొనివచ్చి వెల్లకిలా వేసెను.  పిదప ఒక పెద్ద రోకలి బండతో సహోదరులిద్దరు దానిని చితక బాది, చిప్పను వేరు చేసిరి. నిజ శక్తిని తెలిసుకొన్న ఆ నారాయణ స్వరూపము,  తన కూర్మావతారం ముగించి వైకుంఠం చేరెను.
 
    పై విధముగా వేరు చేసిన ఆ చిప్పను పుత్రులు  ఇవ్వగా గ్రహించి పరమశివుడు తన వక్షస్తలమున ధరించెను.
 
ఇట్లు
మీ అభిమాని
L. రాజేశ్వర్ 
 

Quote of the day

All the suffering and joy we experience depend on conditions.…

__________Bodhidharma