అయ్యప్ప మాల విసర్జన గూర్చి తెలుసుకుందాం

18.204.55.168
స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప
 
ఈ రోజు అయ్యప్ప మాల విసర్జన గూర్చి తెలుసుకుందాం  అనగా మాల తీసివేయడం. మెడలోని మాలను ఎవరు విసర్జన చేయాలి?
 
 మాల వేసిన గురుస్వామియా?, లేక జన్మనిచ్చిన తల్లిదండ్రులా ? , లేక ఆలయంలోని పూజారియా?
 
 దీనికి సరి అయిన సమాధానము గురువు. 
 
  అయ్యప్ప దీక్షలో గురువుకి సర్వ హక్కులు ఉంటాయి. మాల వేయడం నుంచి మాల విసర్జన చేయడం వరకు అన్ని గురువే చేయాలి. 
 
 వ్రతము నుండి మనల్ని విడుదల చేయవలసిందిగా ఎవరిని ప్రార్థిస్తున్నాం? దానికి సంబంధించిన ప్రార్థన మంత్రం ఏమిటి? దానికి గల అర్థం ఏమిటో తెలుసుకుందాం.
 
  మన వ్రతము పూర్తయిన తర్వాత వ్రతము నుండి విడుదల చేయవలసిందిగా మహాదేవుడిని అనగా (ఈశ్వరుని) ప్రార్థిస్తున్నాం. 
 
                     మాల విసర్జన మంత్రం
"  అపూర్వ  ఆచాలా  రోహద్దు దివ్ దర్శన కారణ " శాస్త్ర  ముద్ర   మహాదేవా  దేహిమే వ్రత మోచనం". 
 
   దీని అర్థం ఏమిటంటే ?
" ఓ మహాదేవా"!  శాస్త్ర యొక్క ముద్రమాల ద్వారా అపూర్వమైన శబరీష్రుడిని దర్శించాను. వ్రతము నుండి నాకు విడుదలను ప్రసాదించు, అని ప్రారంభించిన తరువాత దీక్ష నుండి విడివడుటకు  మాల విసర్జన చేయవలెను. 
 
 ఈ మంత్రంలోని శాస్తాను మహాదేవ అని సంబోధించి యున్నారు గనుక మహదేవా అనే పదంలోని అర్థాలను తెలుసుకుందాం.
 
" మహా" అంటే? గొప్పవాడైనా
"  దేవ్"  అంటే? దివ్యమో, దీపము, జ్యోతి, తేజస్సు, అనే అర్ధాలు ఉన్నవి.
" మహాదేవ అంటే? దేవతల అందరిలోనూ గొప్పవాడైన దేవుడు" అని దివ్యమైన తేజస్సు కలిగిన
" జ్యోతి స్వరూపుడు" అని" శివుడు" అని అర్థములు. మరియు 
 
"మాhuncha  అసౌదేవా  మహాదేవ:"  అనే ఉత్పత్తి అర్థాన్ని బట్టి దేవతలందరి కంటే గొప్ప దేవుడు మహాదేవుడు అని అర్థం.  ఈ విధంగా గురువు చేత మాల విసర్జన చేయించుకోవలెను. 
 
స్వామి శరణం .... 
 
- L. రాజేశ్వర్       
 

Quote of the day

Intolerance is itself a form of violence and an obstacle to the growth of a true democratic spirit.…

__________Mahatma Gandhi