Online Puja Services

శబరిమలై లో ఉన్న మూల విగ్రహం ధర్మశాస్త్రదా? స్వామి అయ్యప్ప స్వామిదా?

3.17.162.247
స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప
 
శబరిమలై లో ఉన్న మూల విగ్రహం ( ధర్మశాస్త్ర    దాస్వామి, అయ్యప్ప స్వామిదా) అంటే అది ముమ్మాటికీ "ధర్మశాస్తా ది అయ్యప్ప స్వామిది కాదు" .  
 
ధర్మశాస్త పేరు కన్నా అయ్యప్పస్వామి పేరుకే విశేష ప్రాచుర్యం కలిగింది. 
 
 ఇది ఎంతవరకు న్యాయం? 100% శాతం న్యాయం. భక్తులు ఇది గమనించగలరు.
 
ఈ భూలోకంలో* ధర్మశాస్తా కు*  అనేక ఆలయాలు ఉన్నాయి,  అనేక పేర్లతో" ధర్మశాస్త్రాన్ని" పిలవడం జరుగుతుంది. " ధర్మశాస్తా శివపార్వతుల" సంరక్షణలో పెరిగి కైలాస నివాస "సరస్వతిదేవి" వద్ద విద్యాభ్యాసం చేసిన ధర్మశాస్త  ఇతనికి శివుని వలే" విభూతి రేఖలు  జడలు, జటామండలం  10 చేతులు ఆయుధాలు సింహాసనము పూర్ణ పుష్కల భార్యలతో నిండు యవ్వనంతో వెలుగొందుతాడు".  ఈ భూలోకంలో (ధర్మశాస్తా కు అనేక మంత్రాలు బీజాక్షరాలు మంత్రాలు తంత్రాలు)  అనేకం  వాటితోపాటు" శివ పురాణం బ్రహ్మాండ పురాణం స్కాందపురాణం గణేశ పురాణం" వంటి మహా, పురాణాలలో వీరి గురించి ప్రస్తావన ఉన్నది." భూతప్రేతాల కు పంచభూతాలకు ఆదినాయకుడు", మన ధర్మశాస్త్ర  సంబంధించిన    దేవత మూర్తులు  అయినటువంటి ధర్మరక్షణ కోసం యుద్ధం చేసినప్పుడు ధర్మశాస్త  సహకారం తప్పకుండా ఉంటుంది. ఇతడు అన్ని యుగాలలో ఉన్నాడు." పంచభూతాలకు సూర్య చంద్రాది గ్రహాలకు ఇంద్రాది దేవతలకు" నిరంతరం తోడ్పడేవాడే. ఇవి అన్నియు  భూలోకంలో ధర్మశాస్త్ర కు సంబంధించినవి, 
 
    ఇవి అన్నియు  లోకంలో అయ్యప్పకు  సంబంధించినవి కావు.
 
ధర్మశాస్త భూలోకంలో అవతరించి మణికంఠుని గా పిలవబడ్డాడు అయ్యప్ప భూలోక వాసులకు పరిచయమయ్యాడు, మహిషిని సంహరించాక  ఇంతటి ఘన కార్యాన్ని సాధించాడు, కనుకనే అయ్యప్ప గా ప్రాచుర్యం కలగడమే ధర్మం అని ధర్మానికి నాయకుడైన ధర్మశాస్తా భావించిఉండాలి.  ఈ విషయాన్ని గూర్చి ఆదిశంకరులు లోకవీరం మహా పూజ్యం అనే నమస్కార శ్లోకాలలో" మణికంఠ మీతిక్యాతిo వందేహం శక్తి వందనం" అని స్పష్టంగా తెలియజేశారు. దీని అర్థం ఏమిటంటే?  మణికంఠుడు గా ప్రసిద్ధి పొందిన "శక్తిస్వరూపిణి" యొక్క పుత్రునకు నమస్కరిస్తున్నాను, అని "ఆదిశంకరాచార్యులు" తెలిపారు.
 
స్వామి శరణం భక్తులు మరి ఒక విషయం తెలుసుకో వలసిన ఏమిటనగా శబరిమలలో సంవత్సరకాలం పాటు ధర్మశాస్తా రూపంలో మూల విగ్రహం కనిపిస్తుంది  మకర సంక్రాంతి రోజు ఆభరణాలు వేసిన తర్వాత ధర్మశాస్త మణికంఠుడని రూపముగా దర్శనభాగ్యం ఇస్తాడు.    అప్పుడు ధర్మశాస్త ఎదురుగా ఉన్నా(మేరుపర్వతంకాంచనాద్రి ,కాంతగిరికొండపై) నుంచి "జ్యోతిరూపంలో ప్రకాశిస్తాడు" . మరుసటి రోజు నుంచే ధర్మశాస్తాగా దర్శన భాగ్యం ఇస్తాడు. ఇప్పుడు అయ్యప్ప రూపం కనిపించదు ధర్మశాస్త్ర రూపం అదే. 
 
 స్వామి శరణం.  స్వామి "జ్యోతి"  చూసిన తర్వాత "అయ్యప్ప స్వామి" దర్శన భాగ్యం చేసుకుంటే ఆ రూపం వారికి స్పష్టంగా కనిపిస్తుంది.  స్వామి శరణం. 
 
- L. రాజేశ్వర్       

Quote of the day

Anger and intolerance are the enemies of correct understanding.…

__________Mahatma Gandhi