Online Puja Services

గాయత్రీ జప ఫలితం

3.145.186.6

ఎంత జపం చేయాలి 

ఒక భక్తుడు గాయత్రి దేవిని దర్శించాలి అనే పట్టుదలతో ఏకాంతంగా వుండే ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అతను నిర్మించుకున్న పర్ణశాల అవి చూసి దారినపోయే ఓ గొల్లవాడు రోజు వచ్చి ఓ చెంబెడు పాలు ఇచ్చి వెళుతుండే వాడు. అతను రోజూ వచ్చి చెంబుతో పాలు గుమ్మం బయట
పెట్టి అయ్యా అని అరిస్తే ధ్యానంలో వుండే స్వామి వచ్చి ఆ చెంబు తీసుకుని లోనికి వెళ్ళి నిన్న తెచ్చిన
చెంబుని బయట ఇచ్చే వాడు. రోజూ ఇలా జరుగుతుండేది. స్వామి 24 లక్షల పునశ్చరణ చేసాడు. అయినా అమ్మ దర్శనం కాలా విసుగెత్తిపోయాడు. ఇంత చేసినా
దర్శనం కాని దేవత ఎందుకూ అని ఆమెనే భస్మం చేస్తానని నిర్ణయించుకుని సమిధల సమీకరణ కోసం
పక్కన వున్న అడవికి వెళ్ళాడు.
ఇంతలో గొల్లవాడు వచ్చి పాలచెంబు అక్కడపెట్టి అయ్యా అని అరిచాడు.
అక్కడ జరిగిన విచిత్రం చూసి స్వామి మీద కోపం తెచ్చుకున్నాడు.
ఇంతలో స్వామి అక్కడికి వచ్చాడు. అయన్ని చూసి అడిగాడు గొల్లవాడు
ఏం స్వామి మీరు వివాహం చేసుకున్నారు అమ్మ వుందని నాకు చెప్పలా?
ఆశ్చర్యపోయిన స్వామి నేను వివాహం చేసుకోవడం ఏమిటి ఏం మాట్లాడుతున్నావు?

అందుకు గొల్ల వాడు మీరు అబద్దం చెపుతున్నారు ఇప్పుడు నేను పాల చెంబు ఇక్కడ
పెట్టి కేకేశా అమ్మ వచ్చి చెంబు తీసుకెళ్ళింది అన్నాడు
అదిరిపోయిన స్వామి నువ్వు అమ్మను చూశావా? అని అడిగాడు
అందుకు గొల్ల వాడు అమ్మ బయటకు రాలా కానీ చేతితో తీసుకుంది నా
ఖాళీ చెంబు ఇక్కడ పెట్టింది. అన్నాడు
ఆ చేతి ని వర్ణించ మన్నాడు స్వామి
గొల్ల వాడు చేసిన వర్ణన ఆ జగన్మాత ధ్యాన శ్లోకానికి దగ్గరగా వుంది.
వళ్ళు పులకరించిన స్వామి లోనికి పరుగెత్తేడు గొల్లవాణ్ణి లోనికి రమ్మన్నాడు
లోపల పాలు కాచి నివేదనకు సిద్ధం
చూసావా స్వామి మీరు అబద్దం చెపుతున్నారని బయటికి వెళ్ళాడు గొల్ల వాడు. ఏడ్చాడు స్వామి.

ఇంత దయలేదా నామీద మాతా అని,
అప్పుడు జగన్మాత మాటలు వినిపించి నువు చేసిన పాప ప్రక్షాళనకే ఇన్నేళ్ళు పట్టింది. అది తీరిపోయింది

ఇక నీకు దర్శనమౌతుంది. మరలా చెయ్యి అని అంది అమ్మ.

బయట వున్న గొల్ల వాడు ఏ ఇంట్లో అయినా ఇదే గొడవ అనుకుంటూ వెళ్ళి పోయాడు.

*జపతో నాస్తి పాతకం*

ఓం శ్రీ గాయత్రీ దేవియే నమః
 

సేకరణ 
కే.వి.ఎస్.సన్యాసి రావు 

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore