Online Puja Services

చమ్రవట్టం శాస్తా

3.19.56.45
హరి హర పుత్రుడు ధర్మశాస్తా కథలు. సీరియల్.నం.8
  
 
 ఈ దినం చమ్రవట్టం శాస్తా 
 
ఈ క్షేత్రం పరశురాముడిచే ప్రతిష్టించిన స్యయంబు అగు శిలా విగ్రహముతో చమ్రవట్టం శాస్త అను పేరిట ప్రసిద్ధి గాంచింది. ఈ క్షేత్రం మలపురం జిల్లా లోని తిరూర్ నుండి బి.పి.అంగాడి, ఆలత్తి మార్గాన 11 కి.మీ దూరమున ఈ ఆలయము చేరవచ్చును.
 
       స్వామి పూర్ణ పుష్కలా సమేతుడై అలరారు చున్నాడు. గర్భాలయము నేల మట్టమునకన్నా  దిగువ భాగమున నుండును. ఇచట ఉపదేవతలైన గణపతి, దుర్గ, భద్రకాళి, శివుడు, సుబ్రహ్మణ్యుడు, విష్ణువు  మొదలగు దేవతలు కూడా కొలువైయున్నారు. 
 
       ఈ ఆలయము వర్షము పడుటకును, అతివృష్టి అయిన దానిని నిలుపుటకు ఇచట ప్రత్యేక ఆరాధనలు చేస్తారు. 
 
    భారతపుళ అనబడు జీవనది యొక్క మధ్య భాగమున ఈ ఆలయము నిర్మింప బడి ఉన్నది. నదిలో బాగా నీరు ప్రవహించే సమయాన ఈ క్షేత్రం ఒక దీవిలా అగుపించును. ఎంతటి నీరు వచ్చినను నది నీరు ఆలయం లోనికి ప్రవేశించదు. వరదలు సంభవించినను ఈ ఆలయములోని నీరు ప్రవేశించి నాశనము చేయదు. 
 
       ఈ ఆలయములోని శాస్తా వారు శని దోష నివారకుడిగా ఖ్యాతి నొoది యున్నారు. అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, పాదశని, గoడ శని మున్నగు దోషములు కలవారు ఈ క్షేత్రమునకు వచ్చి శ్రీశాస్తా వారికి ఆరాధనలు జరిపినచో స్వామి కృప వలన శనిదోషం పరిహారం అగునని ఇచ్చటి ఇతిహాసం.
 
      నదిలో జలము ఉప్పొంగి ప్రవహించి తొలి మెట్టు వరకు నీరు ప్రవహించిన, ఆ దినం శాస్తస్వామికి ఆరాట్టు ఉత్సవం జరిపించుతారు. వర్షా కాలమున ఈ క్షేత్రమునకు తెప్పలపై మాత్రమే వెళ్ల వీలగును. 
 
    సమీపములో సంబర మహర్షి యొక్క ఆశ్రమం ఉన్నందున ఈ ప్రాంతమునకు ఛoబర  వట్టం అను పేరు ఏర్పడి కాలక్రమంలో అది చమ్ర 
వట్టంగా మారిపోయినది. ఇచట ధనుర్మాసమున 11 రోజులు చుట్రు విళక్కు పూజ విశేష ఆరాధన.
 
    ఇక్కడి ఆచారం కొబ్బరి కాయలు కొట్టుట. 11, 21, 51, 101, 1001 కొబ్బరికాయలు కొట్టెదమని మొక్కులు మొక్కి, ఇచట కొబ్బరి కాయలు కొట్టుట ఆచారం. 
***********
 శ్రీధర్మశాస్తా వే శరణం     
  శరణం శరణం ప్రబద్దే!
 
ఎల్.రాజేశ్వర్

Quote of the day

In a controversy the instant we feel anger we have already ceased striving for the truth, and have begun striving for ourselves.…

__________Gautam Buddha