Online Puja Services

రేపు అమావాస్య కు ఇలా చేయండి

18.189.180.76
మీ ఇంట సుఖ శాoతులు, సిరి సంపదలు వెల్లు విరియాలన్న....
 
మీ ఇంట సుఖ శాoతులు, సిరి సంపదలు వెల్లు విరియాలన్న, ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయక క్రింద తెలిపిన విధముగా చేయండి ఆనoదాలను, సుఖశాంతులు, ముఖ్యంగా ఆరోగ్యాన్ని పొందండి.
 
రేపు అమావాశ్య. ప్రశస్తమయిన పుణ్యకాలం. పూర్వీకులు, గతించిన పెద్దలు, పితృదేవతల ఆశీర్వాదం పొందుటయే గాక ఆ అష్ట లక్ష్మీ కటాక్షం పొందుటకు కూడా దివ్యమైన శుభదినం.
 
రేపటి దినం ఉదయమే నిద్రలేచి, ప్రతిదినము ఆచరించు కాలకృత్యాది కార్యక్రమాలు ముగించ వలెను. పిదప అయిదు వేప కాడలు తెచ్చి పసుపు దారంలో కట్టి ఇంటి గుమ్మానికి తోరణం లా కట్టండి.  స్నానం చేయుటకు ముందు ఆ నీళ్లలో వేపాకు, చిటికెడు పసుపు వేసి స్నానం చేయండి.
 
ఈ రోజు మనస్ఫూర్తిగా లక్ష్మీ ని ప్రార్థించి దీపారాధన చేయండి. మూడు వత్తులు దీపారాధన శ్రేష్టం. ఇత్తడి ప్రమిద పవిత్రం. నిమ్మరసంలో పంచదార వేసి లక్ష్మీ దేవికి సమర్పించండి. ధూప దీప నైవేద్యానంతరము ఇల్లంతా ధూపము వేయండి. పూజగది అంతా వేపాకుతో అలంకరించండి. ఆర్థిక స్థోమత కలవారు, లక్ష్మీదేవికి పులిహోర, పరమాన్నం నివేదన చేయండి. (పాలతో ఉడికించిన బియ్యం పరమాన్నం) కొద్దిగా ప్రసాదం వరకు చేయండి. అమ్మకు భక్తితో హారతి ఇవ్వండి. చాలును. ఆ తల్లి మీ ఇల్లు వదిలి వెళ్లదు.
 
మరుసటి రోజు పూజగది లో వుoచిన వేపాకు ను బాగా ఎండించి,  పొడి చేసి భద్ర పరచు కొనండి. ప్రతి రోజు ఉదయం ఈ పొడి, చిటికెడు,  ఒక గ్లాసు నీటితో కలిపి త్రాగండి. ఇప్పటి పరిస్థితులలో ఇది దివ్య సంజీవిని.
 
ఆరోగ్యము, సిరి సంపదలు, సుఖశాంతులు మీ ఇంట శాశ్వతముగా కొలువై యుండును.

ప్రవీణ్ 

Quote of the day

In a controversy the instant we feel anger we have already ceased striving for the truth, and have begun striving for ourselves.…

__________Gautam Buddha