బాలశాస్తా:

3.236.222.124

హరి హర పుత్రుడు ధర్మశాస్తా కథలు. సీరియల్.నం.4 

 
పరశురాముడిచే కేరళ దేశమున 108 శ్రీ ధర్మ శాస్తా ఆలయాలు నిర్మింప బడ్డాయి. కొన్నింటి గురించి నేను విషయ సేకరణ చేసినాను.  అవి అయ్యప్ప భక్తులకై వ్రాస్తున్నాను. 

నిన్నటి సీరియల్ నం.3 లో బాలశాస్తా గురించి వివరింప బడ్డది. 

 బాలశాస్తా:--  కోమల తనూర్ మరకతో ఫలనికాచో 
 ధూక్త చక్షకo కర తలేచా నివహన్ వై 
 మందహాస సుందర ముఖో మమ శివస్య 
 ప్రాదురా భవత్ సకలలోక గుణశాస్తా! 
తా!! మరకథమణి లాగా ప్రకాశించు తనువు కలవాడు, క్షీరకలశమును కరమునందు ధరించినవాడు, శివపుత్రుడు, ముల్లోక రక్షకుడు గా బాలల యందు మణి యై దైవమై, ఘానా షాస్తా వెలుగిందు చున్నాడు. 

ఈ రూపున నున్న శాస్తాను తులసి దలము, నువ్వులనూనె దీపము శ్రేఅష్టము. చేతి యందు పాలపాత్ర ధరించిన శ్రీ శాస్తాను, బాల శాస్తాగా, కెరళీయులు రామక్షేత్రమున "త్రుపయాత్" అను పేరిట సుప్రసిద్ధముగా కొలుచు వైనము మనము చూడగలము. 
 
ఈ రోజు జ్ఞాణశాస్తా 
 
 ఆకాశ భైరవ కల్ప మందు ఈ విధముగా జ్ఞానశాస్తా ప్రస్తుతించ బడ్డారు.
 
 శాంతం శారదా చంద్రకాంతి ధవళo చంద్రాభిరా మానసం 
 
 చంద్రారగోపామ కాంత కుండల ధరమ్ చంద్రావతాతాంశుకం 
 
 వీణo పుస్తకం అక్ష సూత్ర వలయం వ్యాఖ్యాన ముద్రాo కర్తె: 
 
 భిబ్రాణం  కలయే సదా హృదిమహాశాస్తారం హి వాక్ సిద్ధయే!! 
 
 తా!! శాంత స్వరూపుడై, శరదృతు  శశాoకుని కాంతి కల్గిన వాడు, చంద్రాభిoభం వంటి మేను కలవాడు, సూర్యచంద్రుల కిరణాలతో పోటీ పడకలుగు కర్ణ కుండలముల దరిoచినవాడు ఈ శాస్తా. శ్వేత వర్ణ ధవళ వస్త్ర దారి,  నాలుగు కరముల యందు, వీణ, పుస్తకము, రుద్రాక్ష మాల, చిన్ముద్రతో నున్న ఈ శాస్తాను వాక్సుద్ధి కై ప్రార్థించెదను. 
 
     శాస్తా యొక్క ఈ అవతారము సత్వ గుణము ను ప్రతిభింపిoచును. ఈ జ్ఞాన శాస్తా ను ప్రార్థించిన జ్ఞాన సిద్ధి పొందగలమని కేరళీయులు నమ్మకము.
 
 
 
 శ్రీధర్మశాస్తా వే, జ్ఞాణ శాస్తా వే స్శరణం     
  శరణం శరణం ప్రబద్దే!
 
సేకరణ
ఎల్.రాజేశ్వర్

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore