Online Puja Services

జపమాల ఎలా ఉపయోగించాలి?

3.133.131.168
జపము - జపమాల గురించి సంపూర్ణ వివరణ  - 
 
ఒక మంత్రాన్ని జపించుటకు జపమాల ముఖ్యము . జపమాల ఉపయోగించటం వలన మనం చేయు జపసంఖ్య తెలియును . జపసంఖ్య తెలియకుండా చేయు జపము వ్యర్ధము . దాని ఫలితము రాక్షసులకు పోవును . జపమాలను హృదయమాల అని అంటారు. జపమాల రక్షణకు , సిద్ధికి ముఖ్యము . జపమాల లేకుండా ఎన్నికోట్ల సార్లు జపం చేసినను వ్యర్థము . 108 లెక్కకు వచ్చు మాల పూర్ణమాల , 54 లెక్కకు వచ్చునది అర్ధమాల , 27 లెక్కకు వచ్చునది అధమ మాల . 

జపమాల  చేయు విధానం గురించి ఇప్పుడు మీకు వివరిస్తాను . మధ్యన ముల్లులేని దారంతో మూడు మడతలతో పేని యజ్ఞోపవీతమునకు పురివేసినట్లు మూడు పేటలలో వేసిన ధారమునకే పూసలు గుచ్చవలెను . దీనిని ముత్తైదువులు చేసి ఇచ్చిన మంచిది లేదా స్వయంగా చేసుకొనవచ్చును. మాలకు మణులను గుచ్చునప్పుడు తాను యే మంత్రము జపించవలెను అనుకొనుచున్నాడో దానినే పలుకుతూ ఆ మణులను బంధించవలెను . మేరువుకు సరిగ్గా రెండుకోనలను దూర్చి మద్యన గ్రుచ్చవలెను . దీనిని శ్రీచక్రం పైనగాని లేక గాయత్రి వద్ద ఉంచిగాని , ప్రాణప్రతిష్ట 108 సార్లు చేసి గురువుగారికి ఇచ్చి 108 సార్లు వారు జపం చేసి ఇచ్చిన తరువాత తాను వాడవలెను . దీనివలన సర్వసిద్ధి కలుగును. జపమాలను దేహము నందు ధరించక , క్రింద ఉంచక దేవత వద్దనే ఉంచవలెను . దీనిని జపము చేయునపుడు " గోముఖము " వంటి సంచిలో ఉంచుకుని చేతికి తగిలించుకొని హృదయమునకు ఆనించుకుని మాల లోపలికి చుట్టి వచ్చునట్లుగా జపించవలెను . జపించు సమయము నందు మాలను చూచువారికి జపఫలితము దక్కును. కనుక జపము చేయి సందర్భము నందు మాలపైన గోముఖము లేదా వస్త్రమును గాని కప్పవలెను . జపమల లొపల తిరిగినచో జపఫలితము తనకే వచ్చును. బయట తిరిగినచో ఆ మాలను చూసినవారికి ఫలితము దక్కును. 
 
                 ఇప్పుడు మీకు ఏ వస్తువులు కల మాలలతో జపము చేసిన ఎటువంటి ఫలితాన్ని ఇచ్చునో మీకు తెలియచేస్తాను . రుద్రాక్షమాల ధర్మార్ధ , కామ , మోక్షములను ఇచ్చును. పద్మమాలిక సర్వబీష్ట సిద్ది , పగడమాల విద్య , వశీకరణము . పద్మరాగ మాల సమ్మోహనము , పుత్రజీవి మాలతో ( దీనికి ఎరుపు దారం ఉండాలి ) సంతానం , ఉశిరిక గింజల మాల జ్వరశాంతి , పసుపుకొమ్ముల మాలతో " బగళా మంత్రము , నవదుర్గ " ఇత్యాది జపించిన స్తంభన అగును. ఔదుంబర మూలికామాల సర్వసిద్ది , తాని మాలతో దారిద్ర్యనివారణ శత్రువులు పారిపోవుటకు 10 వేలు జపం చేయవలెను . హృదయమాల శీఘ్ర మంత్రసిద్ది , మణులతో చేసిన మాల సామ్రాజ్యము , స్పటికమాల సర్వకోరికలు నెరవేరుట , పద్మబీజములు మాల లక్ష్మీకరం , కీర్తికరం , రక్తచందన మాలతో వశీకరణం , భోగము కలిగించును. 
 
                 జపము చేయనప్పుడు ఏ వ్రేళ్లకు ఏమి ఫలమో ఆ విధముగా చేయవలెను . ఉంగరపు వ్రేలు బొటనవ్రేలితో కలిపి మాలను పుచ్చుకొని జపించవలెను . మరి ఇతరవ్రేళ్ళకు సంబంధం ఉండరాదు. ఉత్తమకర్మ సిద్ది అగును. బ్రొటనవేలు , మధ్యవేలు మంత్రసిద్ది . చూపుడువేలు ఉచ్చారణ కొరకు , కనిష్ఠఅంగుష్ఠములు మరణము , చూపుడు వ్రేలు శత్రునాశనము , మధ్యవ్రేలు రోగహరి , ఉంగరపు వ్రేలు పుష్టి , కనిష్టము రక్షణ , అంగుష్ఠము మోక్షమును ఇచ్చును. 
 
       జపము చేయుటకు సూర్యోదయము నుంచి తిరిగి సూర్యోదయము అగు ఆహోరాత్రమును 6 భాగములు చేయవలెను . 24 గంటల సమయము నందు ఒక భాగము 4 గంటలు అగును. వీటిని ఋతువులు అందురు. ఏ కర్మ చేయాలనుకున్నచో ఆ కర్మకి సంబంధించిన ఋతువు నందే జపము చేయవలెను . మంచి విషయములకు సదా జపము చేయవచ్చును

 
 

Quote of the day

God is to be worshipped as the one beloved, dearer than everything in this and next life.…

__________Swamy Vivekananda