Online Puja Services

నవ విధ శాంతులు

18.219.22.169
నవ విధ శాంతులు
 
కొన్ని నక్షత్ర శాంతులకై పరిహారాలు జరుపవలసిన తొమ్మిది రకాల శాంతులు.
 
1. తైలావలోకనం: కంచు లేదా మట్టిపాత్రలో తగినంత మంచి నూనె పోసి అందులో పగడం ముత్యం ఉంచాలి. ఒకచోట ఉప్పు గుట్టగా పోసి ఈ పాత్రని దానిపై ఉంచి పూజించాలి. ఆతర్వాత ఆ తైలం లో ఒకరి ముఖం ఒకరు చూసుకోవాలి.
 
2. రుద్రాభిషేకం: నక్షత్రం యొక్క దోషాన్ని బట్టి అవసరం. మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేసి తదుపరి బ్రహ్మణుడికి భోజన, తాంబూల, దక్షిణలచే సంతోషింపచేసి వారి ఆశీస్సుని పొందాలి.
 
3. సూర్య నమస్కారాలు: ఒంటికాలిపై నిలచి అరుణమంత్రాన్ని 108 పర్యాయాలు జపించుచు చేయు ప్రార్ధనలకు సూర్య నమస్కారాలు అని పేరు. ఇందుకై ఒకరు లేదా ముగ్గురు లేదా అయిదుగురు ఇలా చేస్తూ ఉంటారు సమయాన్ని బట్టి.
 
4: మృత్యుంజయ జపం: ఇదే అపమృత్యువుహరం. యధా శక్తి బ్రహ్మణులని పెట్టి లక్ష మృత్యుంజయ జపం చేయడం తద్వారా గండములు తొలగి దోషాలు తొలగిపోతాయి.
 
5. నక్షత్ర జపం: 27 మంది బ్రహ్మణులతో ఒక్కొక్క నక్షత్రానికి 108 నుండి 1008 పర్యాయాలు శాంతి మంత్రం జపించుట.
 
6. నవగ్రహ జపం: తొమ్మిది మంది విప్రులు ఆయా శాంతి మంత్రములని చేయుట. ఆపై అది, ప్రత్యధి దేవతలకు జప సంఖ్యలో దశమం జపం చేయుట, ఆపై తర్పణం చేయుట.
 
7. హోమం: అగ్నిపూర్వకంగా ఆయా సమీదలు, ద్రవ్యములు, ధాన్యాలతో హోమం చేయుట.
 
8. సువాసినీ పూజ: శక్తిని అనుసరించి 9 మంది ముత్తైదువులు వాయునాలని ఇచ్చి పూజించుట. ఆశీస్సులు పొందుట.
 
9. సమారాధనం: ఈ ఎనిమిది శాంతుల అనంతరం బ్రాహ్మణులకు సంతర్పణ చేయుట.
 
తొమ్మిది అంగములతో చేసేదే శాంతి యనబడును. తద్వారా అన్ని గ్రహ, అపమృత్యు, ఇతర దోషాలు తొలగును.
 
- రాజేంద్రప్రసాద్ తాళ్లూరి 

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha