షష్ట్య నమస్కారాలు

34.200.222.93
నమస్కారం అనేది ఇలా చేయాలంటోంది శాస్త్రం....
 
(1) తల్లి కి మరియు తల్లి తో సమానమైన వారికి... అలాగే అమ్మ వారులకు " ఉదరం పై రెండు చేతులు " జోడించి నమస్కారం పెట్టాలి....
 
(2) తండ్రికి, పాలకులకు అలాగే యోగులకు "హృదయం పై " రెండు చేతులు జోడించి నమస్కారం చేయవలెను......
 
(3) గురువులకు బ్రహ్మర్షులకు వేద పండిత ఘనాపాఠీలకు, పీఠాదిపతులకు " నోటి దగ్గర అంటే మాట బయటికి వచ్చే రెండు బ్రొటన వేళ్ళు కలిసి ఉండే విధంగా " రెండు చేతులు ఉంచి నమస్కారం చేయవలెను....
 
(4) ప్రణవ పఠనం,బ్రహ్మ దేవుడు బ్రహ్మర్షులు, నదులు సముద్రం దగ్గర.. భృకుటి పై రెండు చేతులు జోడించి నమస్కారం చేయవలెను..
 
(5) గణపతి తో పాటు దేవతలు, సూర్యాది నవగ్రహాలకు, ఇంద్రాది అష్ట దిక్పాలకుల కు " శిరస్సు పై రెండు చేతులు తగులుతున్నట్టుగా ఉంచి " శిరస్సు వంచి నమస్కరం చేయవలెను.....
 
(6) హరి హరులకు 12 అంగుళాల ఎత్తులో రెండు చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కరం చేయాలి......
 
ఇవి షష్ట్య నమస్కారాలు.... అని తెలియజేస్తుంది శాస్త్రం....

Quote of the day

What is Art? It is the response of man's creative soul to the call of the Real.…

__________Rabindranath Tagore