కబీర్ భక్తి

3.236.15.142
బీర్ భక్తి  
 
తాము జీవించడమే కాకుండా తోటివారిని కూడా కబీర్ దాస్ సన్మార్గంలో నడిపించే వాడు భగవన్నామునందు, అతని విశ్వాసం మేరుపర్వతం వంటిది. సంపూర్ణ శరణాగతి మార్గంలో జీవితం గడిపేవాడు. భగవన్నామ ప్రభావం ఎరిగిన భక్తులంటే కబీర్ కు ప్రాణం అవసరమైతే వారి కొరకు ప్రాణాన్ని సైతం త్యజించే త్యాగ జీవి.
 
కబీర్ శ్రీరాముని భక్తుడు. కబీరుదాసు గురువు "రామానందుడు". అతని ద్వారా జ్ఞానోపదేశం పొంది జీవితాన్ని పావనం చేసుకున్నాడు కబీర్ ఒకనాడు జ్ఞాన దేవుల వారు, నామ దేవుల వారు భక్తులతో కూడి తీర్థయాత్రలు చేస్తూ కాశీ నగరానికి వచ్చి కబీర్దాస్ గృహానికి అతిథులుగా వస్తారు. కబీర్ సంతోషంతో పొంగిపోయాడు. వారికి వసతి సదుపాయాలను చూస్తాడు. భక్తులు విశ్రమిసిస్తారు.
 
కబీర్ దాస్ భార్య లోయీ భర్తను సమీపించి మరునాడు భక్తులకు ఆతిథ్యం ఇవ్వడానికి ఇంటిలో సరుకులు లేవని చెబుతోంది.
 
కబీరు ఆలోచిస్తాడు ,మార్గం గోచరించుటలేదు అప్పుడు అర్థరాత్రి అయింది.ఏ కొట్టునుండైనా సరుకులు దొంగలిస్తే ఎలా ఉంటుంది ?!అని ఆలోచించాడు. దొంగతనం పాపం అని తెలుసు. తాను దొంగతనం అనే చిన్న తప్పును చేసి, పవిత్రాత్ములకు ఆతిథ్యం ఇవ్వడం అనే బృహత్కార్యాన్ని నిర్వహిస్తూ వచ్చు అనుకున్నాడు. తన కుమారుడైన కమాల్ ను వెంటబెట్టుకుని, దొంగతనానికి అవసరమైన గుణపము ,కత్తి తీసుకొని బయల్దేరుతాడు కబీర్.
 
మహాత్ముడైన కబీర్ దొంగతనానికి వెళ్లడమా?!. దీనదయాళ్ అయిన రాముడు ఈ సంఘటన ద్వారా కబీర్ దాస్ యొక్క కీర్తి ని లోకానికి తెలియపరచాలని భావించాడేమో మరి!.
 
తండ్రి కొడుకులు ఇద్దరూ ఒక కొట్టు వద్దకు చేరారు.చుట్టు ప్రక్కల అందరూ నిద్రిస్తున్నారు ఒక ఇంటికి కన్నం వేశారు. కమాల్ ను పిలచి "నాయనా నీవు లోపలికి వెళ్లి సంత్ పురుషులకు ఆతిథ్యమివ్వడానికి అవసరమైనన్ని సరుకులను మాత్రమే తీసుకుని రా"అని చెప్పాడు.
 
కమాల్ కన్ను గుండా లోపలికి వెళ్ళాడు అవసరమైన ఆహార పదార్థాలను మూటలు కట్టాడు.కన్నం ద్వారా వాటిని తండ్రికి అందించాడు.ఇక తాను కన్నం ద్వారా బయటికి నిష్క్రమించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈలోగా అతనికి ఒక అనుమానం కలిగింది. ఇక్కడ ధనము బంగారు ఆభరణాలు ఉన్నాయి. తాము వెళ్ళిన తర్వాత ఎవ్వడైనా లోపలికి ప్రవేశించి వాటిని అపహరిస్తాడు ఏమో అని సందేహం కలిగింది. వెంటనే ఈ పిల్లవాడు కాస్త దూరంలో నిద్రిస్తున్న యజమాని దగ్గరికి వెళ్ళాడు, కమాల్ అతనిని తట్టి లేపాడు." ఏమండీ మేము దొంగలం కాదు, అవసర నిమిత్తం ఒక సత్కార్యం చేయి ఉద్దేశ్యంతో కొన్ని పదార్థాలు తీసుకొని వెళ్తున్నాము. మేము వేసిన కన్నం అలాగే ఉన్నది, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎవరైనా దొంగలు వస్తే ప్రమాదం అని చెప్పి త్వరత్వరగా కన్నులలో దూరి బయటకి రావడానికి ప్రాకుతూ ఉన్నాడు. వ్యాపారి పరిగెత్తుకొని వచ్చి నడుము వరకు కన్నం లో దూరిన కమాల్ ను సమీపించి, అతని కాళ్ళు గట్టిగా పట్టి ఉంచాడు. దొంగా దొంగా అని కేకలు వేస్తున్నాడు. 
 
పరిస్థితి తారుమారు అయింది కమల్ ఆలోచించి తండ్రితో చెబుతాడు "నాన్న ఇక లాభం లేదు అతను నా కాళ్ళను గట్టిగా పట్టుకున్నాడు ఇక కొద్దిసేపట్లో జనం ప్రోగౌతారు. మన చోరత్వం తెలిసిపోతుంది. అదియునుగాక మనం దొంగతనం చేశానని తెలిస్తే పుణ్యాత్ములైన జ్ఞానదేవుడు నామదేవుడు ఒక్క క్షణమైనా మన గృహంలో నిలువరు. మన ఆతిథ్యం స్వీకరించరు. నేను నా జీవితమును త్యాగం చేసే పవిత్ర సమయం ఆసన్నమైనది. నీవు నా శిరమును కోసి సరుకుల తోపాటుగా తీసుకొని వెళ్ళు" అని చెప్పగానే, కుమారుని ఔదార్యానికి త్యాగశీలతకు, సంతోషించి కబీరు తన దగ్గర ఉన్న కత్తితో కుమారుని తలనుకోసి, తలను మరియు సరుకులను తీసుకుని వెళ్ళాడు.
 
కబీర్ ఇంటికి వెళ్లి సరుకులు భార్యకు అప్పగించాడు. కుమారుడు ఎక్కడ అని అడుగుతుంది లోయీ. కబీర్ కమల్ శిరమును ఆమె చేతిలో పెడతాడు, జరిగిన వృత్తాంతమంతా చెబుతాడు. లోయీ ఆనందభాష్పాలు వదులుతుంది. కమల్ చేసిన త్యాగానికి సంతోషిస్తుంది. ఇలాంటి పుత్రరత్నం కలగడం తమ భాగ్యమని మురిసిపోతుంది. ఆహా ఎంతటి మహత్తర అవగాహన ఆథిత్య మివ్వడానికి,తన ఏకైక పుత్రుడిని త్యాగం చేసిన ఉదాసీనత ఎటువంటిది ?
!.
కబీర్దాస్ తన రచనలలో ప్రేమని అనుక్షణం ప్రతిపాదిస్తాడు. ఈనాడు తన కుటుంబం అంతా ప్రేమకే జీవితాలను ఆహుతి చేయడానికి సిద్ధపడ్డారు. ఆహుతి చేశారు కూడా.
 
ప్రేమ. బిక్ నూత్ మైం సునా
ముదే. సాట్ హాట్
బూఝల్ విలంబన కీబియే
తత్ భిన దీజై కాట్
 
తలకు బదులుగా ప్రేమను సంతలో విక్రయిస్తున్నట్లు నీవు విన్నచో, ఆలస్యం చేయవద్దు శిరమును పోగొట్టుకొని ప్రేమను సంపాదించు అని రాశాడు కబీర్ దాస్
 
ఎంతటి ఉదాత్తమైన భావన కేవలం చెప్పడమే కాదు చెప్పిన దానిని తమ జీవనంలో ఆచరించి చూపాడు. కుమారుని శిరస్సును దాచి ఉంచింది లోయీ. ఉదయముననే షడ్రసోపేతమైన భోజనం తయారు చేసింది జ్ఞాన దేవుల వారు సందేశాన్ని అందించారు సంతృప్తి పరిచారు 
 
నామదేవులవారు సంకీర్తనలను ఆలపించి పరవశింప జేస్తారు. అందరూ ఆతిథ్యం స్వీకరించారు సాయంత్రం వెళ్లడానికి బయలుదేరారు సంకీర్తన చేసుకుంటూ నడుస్తున్నారు.
 
కబీర్దాస్ గడచిన రాత్రి శిరమును తీసుకొని రాగా, మొండెము అక్కడే ఉండిపోయింది. ఆ వ్యాపారి గ్రామస్తులంతా ఒకచోట చేర్చి జరిగిన విషయమంతా వివరించాడు. ఆ మొండెం ఎవరిదో గ్రామస్తులు కూడా గుర్తించలేకపోయారు. వీధిలో ఒక స్తంభం పాతారు. దానికి మొన్డాన్ని కట్టారు. తల్లిదండ్రులు తప్పక వస్తారని వారంతా అభిప్రాయంతో ఉన్నారు.
 
జ్ఞాన దేవుల వారు నామ దేవుల వారు భక్తులతో కోడి ఇ సంకీర్తన చేయుచు మొండెం ను వ్రేలాడ తీసిన దారిలోనే వెళ్ళవలసి వచ్చింది. వారు సమీపమునకు రాగానే మృతదేహం రెండు చేతులు జోడించి మహాత్ములకు నమస్కరించింది. వారు గాణము చేయుచున్న సంకీర్తన కు అనుగుణంగా తాళం వేయసాగింది.
 
జ్ఞాన దేవుల వారు ఈ దృశ్యాన్ని చూసి స్తంభించిపోయారు. నామదేవుల వారు నిశ్చేష్టులై నిలబడ్డారు. భక్తులంతా దిగ్భ్రాంతి చెందారు .జ్ఞాన దేవుల వారు కబీర్ ను పిలిచి" ఏమిటి ఈ అద్భుతం, మృత కళేబరం నమస్కరించుచున్నది, సంకీర్తనకు అనుగుణంగా తాళం వేయుచున్నది. ఈ రహస్యం ఏమిటో నీకే తెలియాలి" అని చెబుతాడు.
 
మిశ్రమ భావాలతో కబీర్ హృదయం కలత చెంది ఉన్నది. మేఘము నీటిని వర్షించు నట్లు తన నేత్రములు కన్నీరును వదలడానికి సిద్ధంగా ఉన్నాయి. కబీర్దాస్ జ్ఞాన దేవుళ్ళ వారికి చేతులెత్తి నమస్కరిస్తూ "మహాత్మ ఇతడు ఎవరో విష్ణుభక్తుడై ఉండాలి. మీ దర్శనానికి మీ సంకీర్తన గానాన్ని ఆలకించడానికి ఇంకా తన ప్రాణాలను నిలబెట్టుకుని ఉన్నాడు" అంటూ వుండగానే తాను గొంతు మూగబోయింది.
 
జ్ఞాన దేవుల వారు దివ్యదృష్టితో జరిగిన విషయమంతా తెలుసుకుని నాడు. కమాల్ భక్త ప్రహ్లాదుని వంటి మహా భక్తుడు అని కొనియాడారు. కబీర్దాస్ ధర్మపత్ని పిలిచి కమల్ శిరస్సును తీసుకొని రమ్మన్నారు. ఆ మొండెమును క్రిందికి దింపించాడు.
 
నామ దేవుడు పాండురంగా దివ్య గానం చేశాడు. కమల్ శిరమును మొండెముపై ఉంచారు. కమల్ సజీవుడై అయ్యాడు భక్త  కమాల్ వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి జ్ఞాన దేవుల వారికి నామ దేవుల వారికి మరియు భక్తమండలి కి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించాడు.
 
- సుబ్బరాజు భట్టు
 

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore