చైనా సైన్యాన్ని గడగడలాడించిన అమర జవాన్

3.236.15.142

చైనా సైన్యాన్ని గడగడలాడించిన అమర జవాన్

 

1947లో భారత్ కు స్వాతంత్రం వచ్చిన తరువాత దేశవిభజన అనే అతిప్రధానమైన సమస్యను ఎదురుకోవలసివచ్చింది. మరొక సమస్య ఏమిటంటే పొరుగుదేశాలతో సరిహద్దుల సమస్య. ఆంగ్లేయపాలన వున్నంత వరకు సరిహద్దుల వివాదాలకు రాని చైనా 1949లో మావో రావడంతో  చైనా భారతదేశసరిహద్దులపై ఒక కన్నేసింది.అప్పటి నుండి అది తవాంగ్ ప్రాంతానికి సైనికఅవసరాలకు పెద్దహైవేనే నిర్మించసాగింది.అది 1957లో పూర్తయింది. అంత జరుగుతున్నా భారత్ దానిని గమనించలేకపోయింది.పంచశీల,అలీనవిధానంలో చైనా భాగస్వామ్యదేశమని బ్రమపడింది.


ఈ లోపు చైనా అత్యంతఅధునాతన ఆయుధాలను సమకూర్చుకుంది.1959లో అకస్మాత్తుగా టిబెట్ ను ఆక్రమించడంతో అక్కడి బౌద్ధగురువు ఇండియాకు శరణార్ధిగా వచ్చారు. ఆయనకు ఆశ్రయం ఇవ్వడంతో భారత్ పై శతృత్వం పెంచుకుంది చైనా.

1962లో చైనా భారత్ భూభాగాలపై దాడిచేయడం ప్రారంభించినది. భారత్ దగ్గర సరైన ఆయుధసామగ్రిలేదు. నాసిరకం ఆయుధాలతో ,సరైన వ్యూహలు కరువైనందున చైనా సైనికులను భారతీయసైనికులు ఎదురుకోలేరని తవాంగ్ ప్రాంతం నుండి సైనికులను వెనుకకు తిరిగిరావలసిందిగా నెహ్రూగారూ,రక్షణశాఖామంత్రి కృష్ణమీనన్ గారు ఆజ్ఞాపించారు.అయితే నూర్ నాంగ్ (అరుణాచల్ ప్రదేశ్ )దగ్గర కాపలాకాస్తున్న గర్వాల్ రైపిల్ సంస్థలోని ముగ్గురు యువకులు శత్రువులకు వెన్నుచూపడం ఇష్టంలేక అక్కడే ఎత్తైనకనుములో దాక్కుకొని శత్రువులపై ఏదురుదాడికి దిగారు. కేవలం ముగ్గురు మూడువందలపైగా వున్న చైనాసైనికులను నిలువరించసాగారు.
1962 ,నవంబర్ -15 ..నూర్నాంగ్ ఫోష్టుపై చైనా జవాన్స్ కాల్పులు ప్రారంభించారు. మన ముగ్గురు జవాన్స్ ధైర్యంగా ఎదురుకున్నారు.అందులో 21 సంవత్సరాల యువకుడు చాలా చురుకుగా కదులుతున్నాడు.

అతని గురితప్పడంలేదు.ప్రత్యర్థులలో చాలామందికి రైపిల్ తూటాలు దిగాయి.ఒక అరగంట తరువాత వారి నుండి కాల్పులు ఆగిపోయాయి. అంతే ఇద్దరు యువజవాన్స్ మెరుపువేగంగా వారివైపు కదిలారు..భారతజవాన్ తూటాలకు బలైపోయిన చైనా జవాన్స్ దగ్గరనుండి ఆయుధాలను తీసుకొని మళ్ళీ తిరిగివచ్చేసారు. మళ్ళీ కొన్ని గంటల తరువాత మళ్ళీ చైనాజవాన్స్ నుండి కాల్పులు ప్రారంభమయినాయి. మళ్ళీ మనజవాన్ ఎదురుకాల్పులకు దిగారు. మళ్ళీ కొంతసేపటి తరువాత కాల్పులు ఆగిపోయాయి.  మళ్ళీ మన జవాన్స్ వారివద్దకు కదిలారు.. ఆయుధాలను తస్కరించి మళ్ళీ తిరిగి వస్తున్న మన జవాన్స్ ను గమనించి శత్రుసైనికులు కాల్పులు జరపడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.తన కళ్ళముందే తన సహచరులు నేలకూలడం చూస్తూ నిస్సహాయంగా చూస్తుండిపోయాడు 21యేండ్ల గర్వార్ రైఫిల్ మాన్ .
  1962 నవంబరు 16 ..నూరనాంగ్ కనుమ .భారతజవాన్ ఒక్కడే యుద్దానికి సిద్దమవుతున్నాడు. తన దగ్గర వున్న ఆయుధాలను కొన్ని అడుగులకు ఒకటి చొప్పున అమర్చుకుంటున్నాడు. అతని పోరాటం గమనిస్తున్న సెరా,నూరా అనే గిరిజన యువతులు అతనికి సహాయంగా వచ్చారు. వారికి రైఫిల్స్ ఎలా మందుగుండ్లు పెట్టాలో నేర్పించాడాయువకుడు. మళ్ళీ చైనా కాల్పులు ప్రారంభించినది. అంతే యువ జవాన్ మెరుపువేగంతో కదిలాడు. ఒక్కొక్క రైఫిల్ దగ్గరకు వెళ్ళడం కాల్పులు జరగడం,మళ్ళీ మరొక ఫోష్టుదగ్గరకు పరిగెత్తడం కాల్పులు జరపడం..మెరుపువేగంగా కదులుతూ అతను నలువైపుల నుండి జరిపే కాల్పులకు తికమకపడిపోయిన చైనాజవాన్స్ ,భారతసైనికులు చాలామంది వున్నట్లు భావించి మళ్ళీ వెనుదిరిగారు.
భారతసైనికుల వ్యూహం అర్థంకాలేదువారికి. అప్పటికే వందకు పైగా తమ సహచరులు మరణించారు. నూరనాంగ్ కనుమలో భారీగా భారతసైనికులున్నట్లు పైఅధికారులకు సందేశం పంపారు.
  1962 నవంబరు-17. మళ్ళీ చైనా జవాన్స్ పై అటాక్ మొదలుపెట్టాడా 21 యేండ్ల యువజవాన్ .సెరా,నూరా సహాయంతో శత్రుశిబిరంలోని జవాన్స్ ను ఒక్కొక్కరిగా నేలకూలుస్తున్నాడావీరుడు. అతని ధాటికి మళ్ళీ వెనుదిరిగారు చైనా జవాన్స్ .

చాలామంది ప్రాణాలొదిలారప్పటికే. ఇంతలో ఎవరో అపరిచితుడు ఏదో తీసుకొని కొండపైకి వెళుతుండటం గమనించారు. వెంటనే అతనిని చుట్టుముట్టి అదుపులో తీసుకొని చిత్రహింసలు పెట్టగా,తాను కొండపైన వున్న జవాన్ కు భోజనం తీసుకెళుతున్నట్లు చెప్పేసాడావ్యక్తి. అది విని హతాసులైపోయారు వాళ్ళు.కేవలం ఒక్కడు,ఒకే ఒక్కడు మూడురోజులనుండి వారిని ఎదురుకోవడం,వందమందిపైగా తమ జవానులప్రాణాలు తీయడం భరించలేకపోయారు.కోపంతో ఊగిపోతూ భారత జవాన్ ను చుట్టు ముట్టారు. అయినా జంకలేదా యువజవాన్ .చివరిదాకా పోరాడాడు.సాయంత్రం సూర్యడస్తమిస్తుండగా శత్రువుల తూటా గొంతులో దిగగా జైహింద్ అంటూ ప్రాణాలొదిలేసాడాయువకుడు. సెరా శత్రువులనుండి తప్పించుకొనేందుకు కొండపై నుండి లోయలోకి దూకి ఆత్మహత్యచేసుకుంది.నూరా ను చిత్రహింసలు చేసి చంపారు చైనీయులు. మన జవాన్ గొంతుగోసి తలను తీసుకెళ్ళారు. 

ఇంతకీ ఆ 21ఏళ్ళ యువ జవాన్ పేరేమిటో తెలుసా?? "జస్వంత్ సింగ్ రావత్ " కేవలం ఒక్కడే దాదాపు 72 గంటలు శత్రుసైన్యాన్ని అడుగుముందుకు వేయకుండా ఆపిన వీరుడు.150 మందికి పైగా చైనా జవానులను అంతమొందించిన వీరజవాన్ . శాంతిచర్చలలో భాగంగా అతని తలను భారత్ కు అప్పగించారు చైనా అధికారులు.అతని పోరాటానికి ఫిదా అయినట్లు చెప్పారు.

 జస్వంత్ సింగ్ రావత్ కు తవాంగ్ ప్రాంతంలో మందిరం కట్టి అతనిని దేవునిగా పూజిస్తున్నారిప్పటికీ అక్కడ ప్రజలు. సెరా,నూరాలకూ ఘాట్లు కట్టారు. ప్రతిరోజూ డ్యూటీలకు వెళ్ళే జవాన్స్ అతనికి దండం పెట్టుకొని వెళుతారు. జస్వంత్ సింగ్ ప్రత్యేకత ఏమిటంటే చనిపోయినా ఇప్పటికీ వివిధ అవార్డులు గెలుచుకోవడం. ఇంత గొప్ప స్థానం మరే సైనికుడికీ దక్కలేదు!!!!


రచయిత - రవీంద్ర గారు

Quote of the day

I slept and dreamt that life was joy. I awoke and saw that life was service. I acted and behold, service was joy.…

__________Rabindranath Tagore