పాకిస్తాన్ లో శ్రీకృష్ణుడి దేవాలయానికి శంకుస్థాపన

3.235.238.217

పాకిస్తాన్ లో  శ్రీకృష్ణుడి దేవాలయానికి  శంకుస్థాపన

 

పాకిస్తాన్ లో  శ్రీకృష్ణుడి దేవాలయానికి శంకుస్థాపన పునాదిరాయి పడింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో రూ. 10 కోట్ల ఖర్చుతో శ్రీకృష్ణ మందిరాన్ని నిర్మించటానికి పాక్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. దీంట్లో భాగంగా..సయూద్‌పూర్ ప్రాంతంలో గతంలో ఉన్న హిందూ ఆలయం ఉన్నస్థలంలోనే బుధవారం (జూన్ 24,2020) పునాదిరాయి వేసి శంకుస్థాపన చేసింది. పాక్ మానవహక్కుల పార్లమెంటరీ కమిటీ కార్యదర్శి లాల్ చంద్ మల్హీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది.   "


పాకిస్తాన్ ఇన్నాళ్లకైనా మైనారిటీల మనోభావాలను పరిగణలోకి తీసుకుంటున్న క్రమంలో దేశంలో హిందూ, క్రైస్తవ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్‌-9 ప్రాంతంలో 20 వేల చదరపు గజాల స్థలంలో మందిరాన్ని నిర్మించనుంది. 

ఈ దేవాలయం పక్కనే హిందూ శ్మశాన వాటికను కూడా ఏర్పాటు చేయనుంది. ఇస్లామాబాద్‌లో 1947కు ముందు ఉన్న  హిందూ ఆలయాలను ప్రస్తుతం వినియోగించటంలేదనీ...కానీ వాటిని కూడా త్వరలోనే పునరుద్ధరిస్తామని పాక్ మానవహక్కుల పార్లమెంటరీ కటీ కార్యదర్శి లాల్ చంద్ మల్హీ  తెలిపారు. ఈ కృష్ణ మందిరానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని మత వ్యవహారాల మంత్రి పీర్ నూరుల్ హక్ ఖాద్రి చెప్పారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అనుమతితోనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. దేశవిభజన తర్వాత పాకిస్తాన్ లోని చాలా హిందూ ఆలయాలు కబ్జాకు గురయ్యారు. ప్రస్తుతం ఈ దేవాలయాల సంఖ్య చాలా వరకూ తగ్గిపోయింది. ఇస్లామిక్ తీవ్రవాదులకు భయపడి చాలా మందిరాలను హిందువులు వదులుకున్నారు

 

Quote of the day

Many good sayings are to be found in holy books, but merely reading them will not make one religious.…

__________Ramakrishna