Online Puja Services

శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం, కాంచిపురం

3.137.185.180

ఆలయం దర్శన సమయం ఉదయం 6:00 గంటల నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు తిరిగి సాయంత్రం 4:30 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు సప్త ముక్తి క్షేత్రాలలో ఒకటి కాంచీపురం. విశేష పౌరాణిక చారిత్రిక నగరం. కాంచీపురం పేరు చెప్పగానే గుర్తుకు వచ్చేది అక్కడ కల పురాతన దేవాలయాలు మరియు పట్టు వస్త్రాలు. ఇక్కడ కల దేవాలయాలలో కొన్ని వేయి సంవత్సరాల నాటివి కూడా కలవు. ఇంతటి పురాతన చరిత్ర కల ఈ పట్టణం ఆధ్యాత్మికులకే కాదు చారిత్రకులకు, షాపింగ్ ప్రియులకు కూడా దర్శించ తగినదే. నాలగవ శతాబ్దం నాటి పల్లవుల నుండి తొమ్మిదవ శతాబ్దం నాటి విజయనగర సామ్రాజ్యం పాలకుల వరకు, బ్రిటిష్ వారితో సహా అందరు పాలకులూ కాంచీపురం పట్ల ఎంతో శ్రద్ధ చూపి దానిని కళాత్మకంగా ఎంతో అభివృద్ధి చేశారు. ఇక్కడ కల స్థానికులు ఆ సంస్కృతి ని ఎప్పటికపుడు నిలుపు కుంటూ కన్చిపురానికి ఒక ప్రసిద్ధ నగరంగా కూడా పేరు తెచ్చారు. ఆధ్యాత్మికంగా, విశిష్ట అద్వైతం బోదించిన ప్రచారకులు కంచి పురం పట్టణం నుండి వచ్చిన వారే. ఎంతో పురాతన చారిత్రక విశిష్టత ల నుండి ఆధునిక కాల చరిత్రల వరకు ఈ పట్టణం విశిష్ట త కలిగి అక్కడ కల చిన్న, పెద్ద దేవాలయాలతో శోభిల్లు తోంది. అటువంటి ఆలయాల్లో శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం ఒకటి.

కంచి దర్శించిన తెలుగువారికి శ్రీ వరదరాజ పెరుమాళ్ దేవాలయం అనేదానికన్నా బంగారు వెండి బల్లులు ఉన్న ఆలయం అంటే త్వరగా గుర్తువస్తుంది. శ్రీ వైష్ణవులకు పరమ పవిత్రమైన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి శ్రీ వైష్ణవులకు పరమ పవిత్రమైన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి ఈ ఆలయం. అంతే కాదు శ్రీరంగం, తిరుమల, మేల్కేటే ల తరువాత కంచి శ్రీ వరద రాజ పెరుమాళ్ కోవెల వారికి అత్యంత పవిత్ర దర్శనీయ క్షేత్రం. మరో విశేషం ఏమిటంటే ఈ నూట ఎనిమిది దివ్య తిరుపతులలో పదునాలుగు కంచి లోనే ఉండటం. అందులో కొన్ని విష్ణు కంచిలో ఉండగా మరి కొన్ని శివ' కంచి ఉంటాయి. విష్ణు కంచి లో ఉండే శ్రీ వరద రాజ పెరుమాళ్ కోవెల ఎంతో విశేష పౌరాణిక మరియు చారిత్రక నేపథ్యం కలిగి ఉంటుంది.

వరదరాజ పెరుమాళ్ ఆలయం కూడా ప్రముఖంగా హస్తగిరి ఆలయం వరదరాజ పెరుమాళ్ ఆలయం కూడా ప్రముఖంగా హస్తగిరి ఆలయం లేదా అత్తియురాన్ అని అంటారు. విష్ణు భగవానుని గౌరవంగా నిర్మించిన ఈ ఆలయం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా ఉన్నది. ఈ దేవాలయం ఉన్న ప్రదేశాన్ని విష్ణుకంచి అని పిలుస్తారు. ఇక్కడ ఈ దేవాలయంలోనే హిందూ మతం పండితుడు అయిన రామానుజాచార్యులు నివసించారని చెబుతారు. ఎకంబరేశ్వర ఆలయం మరియు "ముముర్తివాసం" లేదా మూడు హౌస్ వంటి కామాక్షీ అమ్మవారి ఆలయం పాటు ఈ ఆలయంను చూడండి. ఈ ఆలయంను పెరుమాళ్ కోయిల్ గా సూచిస్తారు మరియు ప్రతి విష్ణు భక్తులు తప్పక సందర్శించాలని భావిస్తారు.

స్వామి ఇక్కడ స్వయంభూగా వెలయడం గురించిన కధ స్వామి ఇక్కడ స్వయంభూగా వెలయడం గురించిన కధ సత్యయుగం నాటిదిగా తెలుస్తోంది. సరస్వతీ దేవితో ఏర్పడిన వివాదంతో ఆగ్రహించి భూలోకానికి వచ్చిన సృష్టి కర్త శ్రీ మహా విష్ణు అనుగ్రహం కోసం అశ్వమేధ యాగం తలపెట్టారు. అందుకని శ్రీ గాయత్రీ దేవిని సరసన కూర్చోబెట్టుకొని యాగం కాకపోతే యజ్ఞ దీక్షలో సతీసమేతంగా కూర్చోవాలి. అందుకని శ్రీ గాయత్రీ దేవిని సరసన కూర్చోబెట్టుకొని యాగం ఆరంభించారు. ఈ పరిణామానికి ఆగ్రహించిన సరస్వతీ దేవి నదీ రూపంలో ఉదృతం వేగంతో ప్రవహిస్తూ యజ్ఞ వాటికను ముంచివేయబోగా శ్రీ హరి అడ్డుగా శయనించి ప్రవాహాన్ని పక్కకు మళ్లించారు. అలా శయనించిన ప్రదేశంలో మరో దివ్య దేశం ఉన్నది అదే " విన్నసైద పెరుమాళ్" కొలువైన "తిరువెక్క" ఈ ఆలయానికి దగ్గరలోనే ఉంటుంది.విధాత యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేసుకున్న తరువాత శ్రీ మన్నారాయణుడు దర్శనమిచ్చి ఆలుమగల మధ్య వివాదాలు సహజమని తెలిపి సృష్టి కర్తను చదువుల తల్లిని కలిపారు. అంతట పద్మాసనుడు, దేవతలు, మునులు స్వామిని ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచుకోమని ప్రార్ధించారు.అలా స్వామి ఇక్కడ కొలువుతీరారు.

తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం ఆలయాల నగరంగా ప్రసిద్ధి పొందింది. సుమారు 1000 కి పైగా ఆలయాలు కలిగి ఉన్నది. కంచిలో గల ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో శ్రీ వరదరాజ స్వామి దేవాలయం ఒకటి.108 దివ్యతిరుపతు ల లో ఒకటై ప్రధానమైన వైష్ణవ దివ్యక్షేత్రలలో ఒకటిగాను విరాజిల్లుతుంది. ఈ ఆలయ౦లోని శ్రీ అత్తి వరదరాజ స్వామి పూజలు అందుకుంటున్నారు. 

చోళుల కాలంలో నిర్మించిన ఈ ఆలయాన్ని కుళోత్తుంగ చోళ I, విక్రమ చోళుల కాలంలో విస్తరించారు. 14వ శతాబ్దంలో తరువాతి చోళరాజుల సమయంలో మరో గోడ, గోపుర నిర్మాణం జరిగాయి. విష్ణువు యొక్క 108 దివ్య దేశాల్లో ఈ ఆలయం కూడా ఒకటని చెబుతారు. ఇది చాలా పురాతనమైన ఆలయం. ఎక్కువ విష్ణాలయాలు కలిగిన కాంచీపుర ప్రాంతమైన విష్ణు కంచిలో ఉంది ఈ ఆలయం. విశ్వకర్మ నిర్మాణ తరహాలో ఉండే ఈ ఆలయ నిర్మాణం చాలా విశిష్టంగా ఉంటుంది. ఇరవై మూడు ఎకరాల్లో ఉన్న ఈ ఆలయంలో బంగారు బల్లి, వెండి బల్లీ ఉన్నాయి. వీటిని జీవితంలో ఒక్కసారి ముట్టుకుంటే ఇక బల్లి మీదపడటం వల్ల ఉండే ఏ దోషాలు ఉండవని హిందువుల నమ్మకం. ఈ బల్లి రూపాలు పైకప్పుపై తాపడం చేసి ఉంటాయి.

ఇక ఛతుర్ముఖ బ్రహ్మ యాగ సమయంలో దేవశిల్పి అయిన విశ్వకర్మచే అత్తి చెట్టు కాండంతొ శ్రీవరదరాజ స్వామి విగ్రహాన్ని చేయించి ప్రతిష్టించారు.ఈ మూర్తికి యుగాలుగా అర్చనాదులు జరుగుతూ వస్తున్న క్రమంలో తురుష్కులు కంచిపై దండెత్తి దేవాలయాలను కూల్చి సంపదలను దోపిడి చేస్తున్న సమయంలో శ్రీ వారి మూర్తికి హాని కలుగకుండా వుండేందుకై ఆలయంలోని ఆనంద పుష్కరిణి లో నీరాళి మంటపం పక్కగా చిన్న మండపం యొక్క అడుగు భాగంలో ఉంచారట. లోపలికి నీళ్లు చేరని విధంగా జాగ్రత్తలు తీసుకుని వెండి పెట్టెలో ఉంచి కోనేటి అడుగున భద్రపరచారట. తదనంతర కాలంలో పరిస్థితి అంతా సర్దుకున్నా కారణాంతరాల వల్ల గర్భాలయంలో వేరొక దివ్యమూర్తిని ప్రతిష్టించారు. అయితే పుష్కరిణి అడుగున పెట్టెలో భద్రపర్చబడిన శ్రీ అత్తి వరదరాజ స్వామి ని 40 సంవత్సరం లకు ఒకసారి బయటకు తీసి వసంత మండపంలో ఉంచి 48 రోజులు భక్తులకు దర్శనం కల్పిస్తారు. చివరిగా 1979 లో దర్శనం ఇచ్చిన శ్రీ అత్తి వరదరాజ స్వామి తిరిగి 2019 జులై 1 వ తేదీ నుండి ఆగస్ట్17 వ తేదీ వరకు తిరిగి దర్శనం ఇచ్చారు . మొదటి 30 రోజులు శయన(పడుకున్న) భంగిమ లోను చివరి 10 రోజులు స్థానక (నిలుచున్న) భంగిమ లో ను దర్శనం ఇచ్చారు. 

తమిళనాడులోని కాంచీపురం (కంచి)కి చేరేందుకు అన్ని ప్రధాన నగరాల నుండి రైలు,బస్ సౌకర్యాలు ఉన్నాయి.

సర్వేజనా సుఖినోభవంతు 

- రామ కృష్ణంరాజు గాదిరాజు 

Quote of the day

Facts are many, but the truth is one.…

__________Rabindranath Tagore