Online Puja Services

నీతి.....

3.145.186.6

రావణుడు జటాయువు రెండు రెక్కలను తెంచినప్పుడు. అప్పుడు మృత్యువు వచ్చింది. మృత్యువుకు సవాలు విసిరాడు జటాయువు."జాగ్రత్త ! ఓ మృత్యువా ! ముందుకు రావడానికి సాహసం చేయద్దు. నేను ఎప్పటివరుకు మరణాన్ని అంగీకరించనో, అప్పటి వరకు నువ్వు నన్ను తాకవద్దు. నేను సీత మాత యొక్క సమాచారం ప్రభు" శ్రీరాముడి"కి చెప్పనంత వరకు నా వద్దకు రావద్దు అన్నాడు! మరణం జటాయువు తాకలేకపోతోంది, అది నిలబడి వణుకుతూనే ఉంది.

మరణం అప్పటి వరకు కదలకుండా నిల్చునే వుంది, వణుకుతూనే ఉంది. ఇది కోరుకోగానే చనిపోయే వరం జటాయువుకి వచ్చింది.కానీ మహాభారతానికి చెందిన భీష్మ పితామహుడు ఆరు నెలలు బాణాల అంపశయ్య మీద పడుకుని మరణం కోసం ఎదురు చూశాడు. అతని కళ్ళలో కన్నీళ్ళు. ఏడుస్తూవున్నాడు. కానీ భగవంతుడు మనస్సులో తనకి తాను చిరు నవ్వుతున్నారు.

ఈ దృశ్యం చాలా అలౌకికమైనది. రామాయణంలో, జటాయువు శ్రీరాముడి ఒడిలో పడుకున్నాడు. ప్రభు "శ్రీరామ్" ఏడుస్తున్నాడు మరియు జటాయువు చిరునవ్వు నవ్వుతున్నాడు. అక్కడ మహాభారతంలో, భీష్మ పితామహుడు ఏడుస్తున్నాడు మరియు "శ్రీ కృష్ణుడు" చిరునవ్వు నవ్వుతున్నాడు. తేడా ఉందా లేదా.. అదే సమయంలో, జటాయువుకు ప్రభువు "శ్రీరాముడి" ఒడి పాన్పుగా అయింది. కాని భీష్మపితామహుడు చనిపోయేటప్పుడు బాణం పాన్పుగా అయింది. జటాయువు తన కర్మ బలం ద్వారా ప్రభు "శ్రీరాముడి" యొక్క ఒడి లో ప్రాణ త్యాగం చేసాడు.

జటాయువు ప్రభు శ్రీరాముడి శరణులోకి చేరాడు. మరియు బాణాలపై భీష్మపితామహుడు ఏడుస్తున్నాడు. ఇంత తేడా ఎందుకు.. ఇంతటి తేడా ఏమిటంటే, ద్రౌపది ప్రతిష్టను నిండు సభలో పరువు తీస్తున్నా భీష్మ పితామహుడు చూశాడు... అడ్డుకోలేకపోయాడు.. దుర్యోధనుడి కి అవకాశం ఇచ్చాడు కాని ద్రౌపది ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ, అరుస్తూ వున్నా సరే భీష్మ పితామహుడు తల వంచుకునే వున్నాడు. ద్రౌపదిని రక్షించలేదు. దీని ఫలితం ఏమిటంటే, మరణం కోరుకున్నప్పుడే వరం వచ్చిన తరువాత కూడా, బాణాల అంపశయ్య దొరికింది.

జటాయువు స్త్రీని సన్మానించాడు. తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, కాబట్టి చనిపోతున్నప్పుడు, అతనికి ప్రభు “శ్రీరాముడి” ఒడి అనే పాన్పు లభించింది. ఇతరులుకు తప్పు జరిగిందని చూసి కూడా ఎవరైతె కళ్ళు తిప్పు కుంటారో, వారి గతి భీష్ముడిలా అవుతుంది. ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ, ఇతరుల కోసం పోరాడుతారో వారు, మహాత్మ జటాయువులా కీర్తి సంపాదిస్తారు..

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha