Online Puja Services

జీవన బృందావనం

3.145.201.71

జీవనబృందావనం 

అణువణువున... 

సృష్టిలో ప్రతి విషయం గ్రహించడం చాలా సులభం. ప్రకృతిధర్మాలు అర్థం చేసుకునెందుకు మనకున్న మామూలు ఇంగితజ్ఞానం చాలు . నేను దేవుడిని చూడగలనా అనే ప్రశ్న వేదాంపరమైనది .‌ సంతృప్తికరమైన సమాధానం ఎన్నటికీ రాదు .. ఈ ప్రశ్న అడిగిన వారికి దైవం గురించి సరైన నిర్వచనం తెలియదనుకోవాలి ... వారి మనసులో దైవమంటే ఇది, అది అనే అభిప్రాయం ముందుగానే ఏర్పరచుకుని అడుగుతున్నారు . దైవాన్ని చూడగలమా అనేది ప్రశ్న !? దైవాన్ని తప్ప వేరేమి చూడగలం !? అని నా ప్రశ్న ! మీరు చూసేదంతా దైవమే .‌‌ మీ చుట్టూ ఉన్నదంతా దీనికి సాక్ష్యం . సృష్టిలో ఏ ఒకట్టీ సాదారణమైనది కాదు. మీ చుట్టూ ఉన్నదంతా ప్రతీదీ అద్భుతమే అద్బుతం కానిది ఒక్కటంటే ఒక్కటి చూపించండి ... అసాధ్యం ... అసాధ్యం... 

చిన్నరాయిని గానీ , కొంచెం దూదినైనా గానీ సృష్టించగలమా !? ప్రతి వస్తువూ దైవమే ... ప్రతీ వస్తువునూ దైవం సృష్టించలెదు.. ప్రతీ వస్తువుగా దైవం రూపాంతరం చెందాడు .. ప్రతి వస్తువూగా దైవం ఉన్నాడు .. అణువణువునా అవతరించాడు .. ఈ అనుభవం పొందడానికి ఏ పవిత్ర గ్రంథమూ చదవాల్సిన పనిలేదు .. ప్రకృతి మహాగ్రంథాన్ని సరాసరి ఫఠించు . నిత్యపారాయణ చెయ్యి . దైవాన్ని కనుగొనడం కష్టసాధ్యమైన పని అంటారు.. ఈ మాటకు అర్థం లేదు. నిజానికి ఇంతకంటే సులభమైన పనిలేదు.. ఇప్పుడు మనం తెలుసుకున్న పద్దతి కంటే తేలికైన పద్దతి కూడా లేదు.. ఒక పుస్తకం కొనాలంటే ఒక పద్దతి ఉంది . వీసా పొందాలంటే మరొక పద్ధతి ఉంది.. ప్రతి పనిలోనూ ఎంతో కొంత కష్టం ఉంది.. కానీ దైవాన్ని కనుగొనడం అన్నింటికంటే సులభం .. ఆయన నీ లోపల ఉన్నాడు .. నీ బయట ఉన్నాడు .. నీపైన ఉన్నాడు .. నీ చుట్టూ ఉన్నాడు .. ఇంతకంటే తేలికైన పని లేనేలేదు.. ఆయన బారి నుండి నువ్వు తప్పించుకోలేనంతగా నిన్ను చుట్టుముట్టి , గట్టిగా పట్టుకొని ఉన్నాడు .. 

ఒక బిడ్డ తన తల్లిని కనిపెట్టడం ఎంత తలిక ! అక్కను గుర్తించడం , అన్నను గుర్తించడం , పసికందుకు కష్టం ..మరి అమ్మ విషయం !? అమ్మను పసిపాప కెలా పరిచయం చేస్తాం !? అమ్మను గురించి ఏమని వర్ణించి వివరిస్తాం !? అమ్మకు నిర్వచనం పాపకు చెప్పగలమా !? అమ్మను చూసి చూడగానే పసికందు పెదవులపై నాట్యమాడే బొసినవ్వు కంటే సమాధానం మేముంది !? 

అమ్మలగన్నయమ్మ ఆ ప్రకృతి . ఆమె సంతతికి ఆమె గురించి పరిచయం చేయ్యాలా !? వర్ణించాలా !? నిర్వచించాలా !? అన్నింటా దైవమే ! అంతటా దైవమే !!!  దేవుడు నీతో ఉన్నాడు అనె మాట తప్పు . దేవుడు నీలో ఉన్నాడు . ఇది కూడా తప్పు . *నీవే దైవం ఇది నిజం* దేవుడు నిన్ను సృష్టించలేదు . దేవుడు నీ రూపు దాల్చాడు . ఈ సత్యం గ్రహించడానికి ఏ పరిజ్ఞానం అవసరం లేదు .. 

మనం శరీరం చేసే పనులు సామాన్యమైనవా !? తల్చుకుంటే ఒక్కసారి వళ్ళు ఝల్లుమంటుంది . ఒక ఇడ్లీ ముక్కను రక్తంగా మారుస్తుంది . ఒక దోసే చేతికివ్వండి , ఏ యోగి పుంగవులు , ఏ యోధానుయోధుడు రక్తంగా మారుస్తాడో చెప్పండి !? మనం మామూలు మనుషులమని మనల్ని మనం చులకన చేసుకుంటాం . *నేను మానవుణ్ణి* అన్న మాట కంటే పచ్చి అబద్ధం మరొకటి లేదు.. *నేను దేవుడిని* అనడం కంటే పరమసత్యం మరొకటి లేదు.. ఈ వాస్తవం తెలియడానికి తెలివిటేటలతో ఏ మాత్రం పనిలేదు .. జీవితం చాలా చిన్నది.. ఈ కొద్ది సమయాన్ని , నా మొదటి లక్ష్యం ఇది .. తర్వాత లక్ష్యం అది అని వృధా చెయ్యకు . ప్రతిదీ సహజదృష్టితో చూసి, సహజంగా జీవించు .. 

దేవుడికి ఆకారం ఉందా లేదా అని చాలా మంది అడుగుతారు . ఇటువంటి ప్రశ్నలు ఏళ్ల తరబడి వస్తూనే ఉన్నాయి. ఈ రకం ప్రశ్నలకు , వీటికి చెప్పబడే జవాబులకు మనం అలవాటు పడిపోయాం . దేవుడేలా ఉంటే ఏమిటి !? ఇప్పుడు నీటిని ఘనమా , ద్రవమా , వాయువా అంటే ఏం చెబుతాం !? మంచుగా ఉంటే ఘనం , నీరుగా ఉంటే ద్రవం , ఆవిరైతే వాయువు , సందర్భాన్ని బట్టి రూపం ఉంటుంది. 

దైవానికి ఆకారం ఉంది , ఆకారం లేదు . రెండూ నిజమే. మనకు ఎప్పుడు ఎలా కనిపించడం అవసరమో అప్పుడు ఆ దైవం అలా కనిపిస్తాడు . అసలు దేవుడే కనుక ఉంటే , ఆయన అంతటా ఉంటాడు . లేనట్లైతే ఎక్కడా ఉండడు . అన్నింటా పరమాత్మను చూడలేకపోతే , మరెక్కడా ఆయనను చూడలేవు . భగవంతుని ఉనికికి నీవే స్పష్టమైన సాక్ష్యం ..! ఇతరమైన అల్పమైన ఆధారాల కోసం వెదుకులాడకు . పరమేశ్వరునికై నీలోనే అన్వేషించు .‌ అద్దంలో నిన్ను చూసుకో .. ఆశ్చర్యచికితుడవుకా . నీ శరీరంలోని ప్రతీ అవయవాన్ని దైవమే నిర్మించాడు . మరెవ్వరూ కాదు . మరింత లోతుగా నీలో నిన్ను చూసుకో . నీ మనసులోని అద్భుతమైన ఆలోచనలు , నీ హృదయంలోని అపురూపమైన అనుభవాలు, భావోద్వేగాలు అన్ని ఆయన సృజన మాత్రమే .. నిన్ను చూసి గర్వించు .. నీ చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి గర్వించు .. నీ నుంచి , సృష్టి నుంచి ఆనందాన్ని ఆస్వాదించు .. ఈ జగత్తు - జగత్కారకుడు ఒక్కటిగా కలిసిపోయారు .. ఈ సృష్టి - సృష్టికర్త ఒక్కరై లీనమైయ్యారు . ఇప్పుడు దైవాన్ని కనిపెట్టడం కంటే విడిచి పెట్టడం నీకు అసాధ్యం . నీ జీవితం అనంతకాలం ఆనందతాండవం చేయునుగాక !! 

ఆలీస్టర్ క్రౌలీ

9542552784

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya