Online Puja Services

దశమహవిద్యలు

3.133.160.156

దశమహవిద్యలు* 

*భగళాముఖి విశేషాలు* 

 

పురాణాల్లోని అస్త్రాలు కానీ, ఆధునిక శస్త్రాలు కానీ ఏమీ అక్కర్లేదు . ఆమెకున్న పవర్ అలాంటిది ... ఆమె మీపక్కన నిలుచుంటే చాలు మీపై ఈగ కూడా వాలలేదు .. శత్రువు అన్నిరకాలుగా చేష్టులుడిగి పోతాడు .. ఎనిమీ ఫోర్సెస్ ని ఎదుర్కొనే రెసిస్టెన్స్ పవర్ అనూహ్యంగా పెరిగిపోతుంది.. ఆమె మీకు అండగా ఉంటే చాలు మిమ్మల్ని ఏ రకంగా డ్యామేజి చేసెందుకు కానీ , ఇబ్బంది పెట్టేందుకు కానీ సింగిల్ ఎఫర్ట్ కూడా చేయడానికి ఎవరూ సాహసించలేరు .. 

 

ఆమే అనుకుంటే చాలు మాట స్థింభించిపోతుంది .. ఆమే అనుకుంటే కాలు కూడా కదల్చలేరు .. ఆమె అనుకుంటే చాలు మెదడు పనిచేయడమే మానేస్థుంది .. ఆమె ఎదురుగా ఎవరూ వాదించలేరు . మంట చల్లారిపోతుంది .. ఎవరి కుట్రా ఫలించదు ... ఎంతటీ వేగమైనా కంట్రోల్ అవుతుంది... శత్రువు ఎంత సమర్థుడైనా సరే అతణ్ణి తన కంట్రోల్ లోకి తెచ్చుకొని , అన్ని విధాలుగా అణిచివేస్థుంది ... ఆమెను కంట్రోల్ చేయడం ఎవరి తరం కాదు ... ఎట్ట్సర్నల్ నెగిటివ్ ఫోర్సెస్ కి అడ్డుకట్ట వేయడంలో ఈమె ఎదుట నిలబడటం ఎవరి వల్లా కాదు... 

 

దశమహవిద్యల్లో ఏడుగురు విద్యాధిదేవతలు భయంకరంగా , భీభత్సంగా రకరకాల రూపాల్లో కనిపిస్తే ఈ దేవతారూపం మాత్రం కొత్తగా కనిపిస్తుంది.. చేతిలో గద పట్టుకుని ఉంటుంది .. రాక్షసుడి నాలుక బయటకు లాగి పట్టుకుని ... గదథో కొడుతుంది ... ఈమె పేరు భగళాముఖి , పేరే విచిత్రం . ఆ పైన ఆమె వేషధారణ మరీ విచిత్రం. ఆ పేరు ఏ రకంగా వచ్చిందో స్పస్టత లేదు 

 

... భగళ అన్న పదానికి డిక్షనరీ అర్థమైతే కనిపించలేదు .. వేదిక్ గాడెస్ కి సంబంధించిన కొన్ని డిస్ర్కిప్షన్స్ లో మాత్రం వగళముఖి అన్నారు.. వల్గ అంటే కళ్లేం అని అర్థం ... దీని నుంచి వగళ పుట్టి ఉండవచ్చు .. బెంగాల్ లాంటి ప్రాంతాల్లో వ , బ లకు భేదం ఉండదు .. అందుకే వగళ కాస్త భగళ అయి ఉండవచ్చు... అంటే ఎలాంటి కదిలే శక్థులకైనా కళ్లెం వేసేది అని అర్థం ... 

 

దశమహవిద్యల్లో ఏడో విద్య అయిన ధూమావతి కదలని , మెదలని శక్తి . ఆమె ఇన్నర్ నెగిటివ్ ఫోర్సెస్ ని కంట్రోల్ చేస్తుంది .. వాటి నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది .. భగళాముఖి ఎనిమిదో విధ్య . ఈమె అవుటర్ ఫోర్సెస్ ని అదుపు చేస్తుంది . ఇంత వరకు బాగానే ఉంది.. కానీ ఈ పసుపు వర్ణం ఏమిటీ !? ఆమె శరీరం , ధరించిన వస్త్రాలు , వేసుకున్న ఆభరణాలు , కూర్చునే ఆసనం , తలలో పూలు అన్నీ కూడా పసుపు రంగే . ఏమిటీ పసుపు సిగ్నిఫికెన్స్ !? మొత్తం పసుపునే రూపంగా చేసుకుని ఈ దేవి దర్శనం ఎందుకు ఇస్తోంది ! ఈ పసుపుకు , ఆ రూపానికి , ఆమె లక్షణానికి ఉన్న అనుబంధం ఏమిటి ! ఆమె ఎనిమీ ఫోర్సెస్ ని కంట్రోల్ చేస్తుంది అని చెప్పుకున్నాం . ఈ పసుపు రంగుకు దీనికి మధ్య ఇలాంటి లింక్ ఏముంది ! ఆలోచించండి .. పసుపు వర్ణం మాత్రమే కాదు , మనం రోజూ వాడే పసుపునకు కూడా ఈ రూపం వెనుక మర్మం దాగి ఉంది. మన లైఫ్ లో పసుపు ఒక అవిభాజ్య వస్తువు . ఆధ్యాత్మిక కార్యక్రమాల దగ్గర నుంచి ఆయుర్వేద మందుల దాకా అన్నింటిలోనూ పసుపుకు ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు . గుమ్మానికి పసుపు రాస్తారు . క్రిములను ఇంటిలోకి రాకుండా నిలువరించడానికి ... రక్తం కారుతుంటే దాని ప్రవాహానికి అడ్డు కట్ట వేయడానికి పసుపు రాస్తారు. మిగతా రంగులను అణిచివేయడానికి పసుపు వాడతాం .. మన దేశంలో దాదాపు ఆరువేల సంవత్సరాల నుంచి పసుపును జీవితంలో ఒక నిత్యావసరంగా వాడుతున్నాం .. బౌద్ధ భిక్షువులు రెండు వేల సంవత్సరాల క్రితమే పసుపుతో అద్దకం వేసిన వస్ర్తాలు ధరించారు . ముఖ్యంగా హిందువులు పసుపు లేకుండా ఎలాంటి శుభకార్యాలు ప్రారంబించరు... *పసుపులో ఫైటిన్ ఫాస్పరస్ , విటమిన్లు, లవణాలతో పాటు కర్క్యూమిన్ అనే పదార్థం ఉంటుంది* *కర్క్యూమిన్ గురించి ఎందుకు చెప్పుకుంటామంటే , పసుపులో బంగారు రంగులో ఉండే పధార్థం ఇదే* దీని వల్ల ఈ పసుపుకు ఆ కలర్ వచ్చింది . అంతేకాదు ... *కర్క్యూమిన్ అనే పదార్థమే యాంటీ బయోటిక్ , యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్నాయి* క్యాన్సర్ నిరోధక లక్షణాలు , ఇన్ఫ్లమేషన్ ని నిరోధించే లక్షణాలు అన్నీ ఉన్నాయి ... అంటే మనపై , మన శరీరంపై దాడి చేసే అన్నీ ఎక్స్టర్నల్ నెగిటివ్ ఫోర్సెస్ ని ఈ పసుపు స్థంభింపజేస్తుంది ... ఇప్పుడు ఈ కర్క్యూమిన్ పధార్థం పైనే విదేశాల్లో తెగ పరిశోధన చేస్తున్నారు. కానీ , మనవాళ్ళు వేల సంవత్సరాల క్రితమే సోకాల్డ్ సైన్స్ పేరు చెప్పకుండానే పసుపును మన లైఫ్ లో అంతర్భాగం చేశారు . ఇప్పుడు ప్రపంచంలో మనిషికి అత్యంత ప్రమాదర శత్రువుగా మారిన క్యాన్సర్ కణాలను తుదముట్టించే శక్తి ఈ *కర్క్రూమిన్* కి ఉన్నట్లు గుర్తించారు. దీని పేటెంట్ కోసం అమెరికా సహా వివిధ దేశాల్లో తేగ ప్రయత్నం చేస్తున్నాయి ... 

 

ఇక బగళాముఖిలోని ... వ ..గళ పేరు .. మన గొంతులో నుంచి ఉద్భవించే వాక్కు . ఈ వాక్కును స్తంభింపజేసే శక్తి అని అర్థం . ఈ దేవి రూపంలోనే ఇది స్పష్టంగా కనిపిస్తుంది. శత్రువు నాలుక బయటకు లాగి , తల పై గదతో మోదుతుంది .. అంటే అతని వాక్కును అడ్డుకుని , మేధస్సును పనిచేయకుండా చేయడం . ఒకరి వాక్కును స్తంబింపంజేయడం అంటే వారి నాలుక పట్టుకుని లాగాలా ! హెతువాదులు రూపాన్ని చూసి లాగే అడ్డగోలు వాదనల్లో ఒక వికృత వాదన ఇది . మన ప్రత్యర్థిని వాదనలో ఓడించాలంటే , ఆ ప్రత్యర్థి కంటే మనలో ఎక్కువ శక్తి ఉండాలి ... మనలో వాదనాపటిమ ఎంత బలంగా ఉంటే మన ప్రత్యర్థి వాదులాడలేక , మాట్లాడలేక మూగవాడైపోతాడు . ఆదిశంకరుల వారి నుంచి అనేక మంది ఈ దేశంలో విద్యాపాండిత్య సభల్లో మహామహుల్ని తమ వాక్ఫిటిమతో ఓడించి జయకేతనం ఎగుర వేశారని మనం విన్నాం ... ఇప్పుడు శాసనసభల్లో , పార్లమెంటు లో వాదోపవాదాలు చూస్తున్నాం .. సాధారణ స్థాయి నుంచి అతి తీవ్ర స్థాయి వరకు ఈ వాదోపవాదాలు జరుగుతాయి.. న్యాయస్థానంలో వాదప్రతివాదాలను మనలో చాలా మంది చూసిన వారమే ... ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీల మధ్య ఇదే రకమైన వాగ్యుద్ధం జరుగుతుంది.. అగ్రరాజ్యం అమెరికా లో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇద్దరు అభ్యర్థుల మధ్య మూడు సార్లు ముఖాముఖి చర్చాకార్యక్రం జరుగుతుంది.. మనలోని మాటకారితనమే మన విజయానికి కారణం అవుతుంది.. ఆ మాటకారితనానికి అంటే వాక్కుకు బగళాముఖి అధిపతి . ఇక్కడ మరో విషయం ఏంటంటే .. గళంలోని వాక్కును స్తంబింపజేస్తుంది కాబట్టి భగళాముఖి అన్నారు.. ఇంకో విషయం ఏమిటంటే *శత్రువు వాక్కును, మేధస్సును పనిచేయకుండా స్తంబింపజేయడం కాదు* *మనలోని వివిధ అవయవాలను స్తంబింపజేయడం మరో అంశం* స్తంబింపజేయటం అనే పవర్ కి ఫిజికల్ సైన్స్ కి మధ్య ఉన్న లింక్ ఏంటి ? ఫిజిక్స్ లో మనకు చలనగతి సిద్దాంతం ఒకటి ఉంది... ఉదృతంగా ప్రవహించే నీటిని అడ్డుకట్ట వేస్తే ఏం జరుగుతుంది.!? ఆ నీరు సుడులు తిరుగుతూ మరోవైపు మళ్ళేందుకు ప్రయత్నిస్థుంది . అంటే చలించే దాన్ని అడ్డుకోవాడానికి ప్రయత్నిస్తున్ననుకోండి . .. ఆ చలించే వస్తువుపై ఒత్తిడి పెరుగుతుంది.. ఆ ఒత్తిడి వల్ల వేగం మరింత పెరుగుతుంది... అనూహ్యంగా శక్తి పెరుగుతుంది. సాధారణ స్థాయిలో మచ్చుకు కూడా కనీపించని శక్తి దాన్ని బంధించేందుకు ప్రయత్నించినప్పుడు బాగా పెరుగుతుంది.. ఈ సూత్రం ఆధారంగానే మనకు *యోగా లో హఠ, రాజ యోగాలు ఉన్నాయి* హీందూ ఆధ్యాత్మిక సాధనలో బగళాముఖి ని గురించి చర్చ చేసినప్పుడు ఈమెను బ్రహ్మాస్త్ర విద్యగా భావిస్తారు. మన పురాణాలు చెప్తున్నట్లు బ్రహ్మాస్త్రం అంటే తిరుగులేనిది.. అంటే తిరుగులేని వెపన్ ... ఆయుధం .. ఈ విద్యను ఉపాసించిన వారికి ఎలాంటి ఆడ్డంకులూ ఉండవు .. వామాచార ఉపాసనలో శత్రువులపై తంత్ర ప్రయోగం చేసేందుకు ఈ బగళాముఖి ఉపాసన చేస్తారు ... శత్రువులను , మనలోని అంతశ్శత్రువును అంతం చేసే మహాశక్తి ఈ బగళాముఖి . ఈమె ఉపాసన వల్ల ఓటమి అన్నదే ఎరుగని విజయం వరిస్తుంది. 

 

ఈమె త్రిలోక స్తంభనం చేయగల సామర్థ్యం శక్తి ఇస్తుంది ... శత్రువులను మరియు తనకు కలిగించే వారిని అదుపు చేయగల శక్తి వస్తుంది... చట్టపరమైన వాదనలు , యుద్ధాలలో బగళాముఖి దేవి యొక్క శక్తి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ బగళాముఖి తన ప్రబావములను అన్ని కూడా *కుజ* గ్రహ రూపంలో చూపిస్తుంది... పోలిస్, మిలటరి , సెక్యూరిటీ, గూఢచారి, వస్తాదులు , లాయర్లు , జడ్జిలు , మొదలైన వారు బగళాముఖి యొక్క ఆధిపత్యము లో ఉంటారు.. జన్మ కుండలిలో కుజుడు నీచం పొందిన వారు , కుజుడు శని కలిసి ఉన్న జాతకులు , కుజుడు రాహువు కలీసి ఉన్న జాతకులు పసుపు రంగు దుస్తులు ధరించి పసుపు రంగు పుష్పాలతో బగళాముఖిని గురుముఖతః తీసుకుని సాధన చేయాలి .. కాలేయం , జీర్ణవ్యవస్థ, క్లోమం, కడుపు , కుటుంబం లోని జేష్ట సంతానం వీరందరికీ బగళాముఖి ఆధిపత్యం వహిస్తుంది ... 

 

ఆలిస్టార్ క్రౌలీ 
 

 

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya