దురాచారాల మీద తిరుగుబాటు

3.236.222.124
దురాచారాల మీద తిరుగుబాటు
 
పీత్వా పునః పీత్వా, యావత్పతతి భూతలే
పురుత్థాయవై పీత్వా, పునర్జన్మ న విద్యతే
 
‘మద్యం తాగండి, ఇంకా తాగండి, నేలమీద పడిపోయేంత వరకు మరలా తాగండి, స్పృహ వచ్చాక లేచి మళ్లీ తాగి పూజ చేయండి. దీంతో మీకు పునర్జన్మ అనేదే ఉండదు...’ 
 
శంకర భగవత్పాదుల వారు జన్మించే నాటికి వామాచారులు అనుసరిస్తున్న అవైదిక పూజా విధానమిది.
 
 శైవం, వైష్ణవం, సౌరం, గాణాపత్యం, శాక్తేయం, స్కాందం... వీటిని షణ్మతాలంటారు. ఇవన్నీ వైదిక మార్గానికి చెందిన సంప్రదాయాలే. 
 
కానీ కాలాంతరంలో వీటిలోకి వేద విరుద్ధమైన, జుగుప్సాకరమైన ఆచార, వ్యవహారాలు ప్రవేశించాయి.  రామసేతువులో మద్యపానం చేసి దేవీ పూజ చేసే శాక్తులున్నారు. కాంచీపురంలో తాంత్రికులున్నారు. విదర్భలో భైరవోపాసకులున్నారు. కర్ణాటకలో కాపాలికులున్నారు.  సౌరాష్ట్ర, ద్వారకవంటి చోట్ల పాషండులు, కణాదులు, సాంఖ్యులు, పాంచరాత్రులు వంటివారున్నారు. దురాచారాలతో అశాంతి సృష్టిస్తున్న  వీరిని ఎదుర్కోవడం అంటే ఆ రోజుల్లో మామూలు విషయం కాదు. 
 
 శంకరాచార్యులు అనితర సాధ్యమైన ప్రయత్నం చేసి వాటిలో పాతుకుపోయిన కుసంప్రదాయాలను తొలగించారు. అన్నిటినీ వైదిక మార్గంలోకి మళ్లించారు
 
- డా.. పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore