Online Puja Services

శబ్ద బ్రహ్మము

3.133.147.252

శబ్ద బ్రహ్మము

శబ్దాల ధ్వని ప్రభావం అల్పమైనది కాదు. శబ్ద విద్య తెలిసిన ఆచార్యులకు, శబ్దము ఎంత శక్తివంతమైనదో తెలుసు. ఆ శక్తి యొక్క గమనం ద్వారా ఎలాంటి పరిణామం సంభవిస్తుందో వారికి తెలుసు. శబ్దాన్ని "శబ్ద బ్రహ్మం" అంటారు. శబ్ద బ్రహ్మ స్పురణం "ప్రకంపాలను " సృష్టిస్తుంది. ఓంకార ధ్వని, సృష్టిని నడిపించే గమనాన్ని సృష్టిస్తుంది. కొంత దూరం ఆ ప్రవాహం సాగి "హ్రీం", "శ్రీం", "క్లీం"...అను మూడు....సత్వ,రజస్,తమములైన మూడు పాయలుగా పారుతుంది. తరువాత అవి అనేక బీజ మంత్రాలుగా మారి, ఆయా నామాలతో పిలువబడతాయి. ఆయా బీజాక్షరాల నుండి వెలువడ్డ ధ్వనులు, తమ తమ క్షేత్రాలలో సృష్టి కార్యం నడిపిస్తాయి. కావున ఈ సృష్టి కార్య నిర్వహణం " శబ్ద తత్వం" ద్వారానే జరుగుతుంది. అటువంటి శక్తి అల్పమైనది కాదు.

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha