Online Puja Services

గురువు

18.117.152.251
మంత్రం ఉపదేశం కి ఐదువేలు అడిగారట, సిద్ది పొందిన గురువులు ధనానికి మంత్రాన్ని అమ్ముకోరు, అటువంటివి నమ్మకండి.మీమల్ని మీరు ఎగతాళి చేసుకోకండి. మంత్రోపదేశం అనేది వారి శ్రద్ధను బట్టి అనుగ్రహిస్తారు గురువు అనుగ్రహించి ఇచ్చిన అది సాధన చేసే పద్దతిలో లోపం లేకుండా చేస్తే తర్వాత ఆ మంత్రాది దేవత ముందుకు నడిపిస్తుంది..

మంత్రం సిద్ది పొందడం అంటే ఏమిటి ఆ వ్యక్తిలో ఆ మంత్రం యొక్క ప్రభావం ఉంటుంది మంత్రాది దేవత వారి లోనే కొలువై ఉంటుంది అట్టివారిలో ధనాపేక్ష ఉండదు.. ఎలా చేయాలో మటుకే తెలిసి అది నేర్పడానికి డబ్బు తీసుకుంటారు చాలా మంది అది ఉపదేశం పొంది నట్టు కాదు గురువు స్వచందంగా మంత్రాన్ని అనుగ్రహించాలి తీసుకునే వారు గురువు పట్ల నమ్మకంతో ఉండాలి ఎందుకంటే గురువు అనే స్థానాన్ని మీరు నమస్కారం చేసినప్పుడు అది ముక్కోటి దేవతలకు చెందుతుంది గురు స్థానం అంత గొప్పది.. మంత్రం ఉపదేశం ఇచ్చిన వారు మటుకే గురువులు, విద్య నేర్పిన వారు ఉపాధ్యాయులు, కులవృత్తి నేర్పే వారు ఆచార్యులు, ఒక్క మంత్రోపదేశం ఇచ్చిన వారే గురువు అనాలి వారు దక్షణామూర్తి స్వరూపం ఎందుకంటే కర్మ బంధాల నుండి విముక్తి పొందే విద్య జరామరణ చక్రాల నుండి తొలగించే విద్య, నిన్ను నువ్వు తెలుసుకునే విద్య నీలో పరమాత్మను మీకు పరిచయం చేసే విద్య నిన్ను ఉపాసకుడిగా సాధన వైపుకి నడిపే విద్యను నీకు ఉపదేశం చేసే వారు సద్గురువులు... అట్టి గురువులను నిందించడం ద్వేషించడం అవమానించడం మహా పాతకం అవుతుంది వారి మనసు మీ వల్ల కష్టపడిన చేసిన సాధన వృధా అయిపోతుంది ఎందుకంటే ఆ మంత్రాన్ని మీకు అనుగ్రహించే టప్పుడు మీ కోసం సంకల్పమ్ చేస్తారు ఆ ఉపాసనా శక్తిని ధానం చేస్తారు..ఉపదేశం ఇచ్చే టప్పుడు ప్రాణం పోసిన తల్లితో సమానం ఆ గురువు..రక్షణ కలిగించే తండ్రితో సమానం, నిన్ను నువ్వు తెలుసుకునప్పుడు ఆ గురువే నీకు దైవం...

గురువు ఉపదేశం స్వప్నం లో కూడా జరగవచ్చు , లేదా వివరంగా మీకు ఇక్కడ చెప్తునట్టు కూడా చెప్పవచ్చు మార్గనిద్దేశం చేయవచ్చు. మీరు ఆ మంత్రాన్ని దక్షణామూర్తి దగ్గర ఉంచి వారికి గురు వందనం చేసి మీకు మంత్రానికి ఋషి నామం ఉన్నవాటికి ఋషిని స్మరించు జపం మొదలు పెట్టవచ్చు.. కొన్ని ఆన్లైన్లో ఇవ్వకూడానివి నేను అడిగినా ఇవ్వను ఒక పరిమితి వరకు ఇవ్వగలిగినవి మీకు మార్గనిర్దేశం చేస్తున్నాను... అమ్మవారిని అనుమతి కోరండి దక్షణామూర్తి నే గురువుగా భావంచి సాధన మొదలు పెట్టండి.

అడ్డదారిలో డబ్బు సంపాదించాలి అని నన్ను ఏవేవో విద్యలు అడుగుతూ ఉంటారు ఇక్కడ అటువంటివి ఏవి చెప్పడం జరగదు..మీ పైన మీకు ముందు నమ్మకం కలగాలి దైవం పట్ల నమ్మకంతో సాధన చేయాలి సనాతన ధర్మం యొక్క విలువ తెలుసుకుని మీద్వారా ఎందరికో మార్గనిర్దేశం కావాలి అంతే కాని తక్కువ సమయంలో గొప్పవాళ్ళు కావాలి అని అడగడానికి మీరు ఏమైనా ప్రదర్శనలు చేయాలా విద్యను.. ఒక్క సాధన సంపూర్ణంగా చేసి ఆత్మ చైత్యన్య మార్గంలో పయనిస్తే మీలో మార్పు మీకే అర్తం అవుతుంది.. స్వార్ధం నశించి పోతుంది అహంకారం ఉండదు, లోభం ఉండదు, ద్వేషం పగ ప్రతికర చేష్టలు ఉండదు, శరీరం దుర్వాసన ఉండదు.. అంతులేని ప్రశాంతత మీ మనసు పొందుతుంది ఎన్ని సమస్యలు ఉన్నా అవి బాహ్యనికే నీ మనసులో ఉన్న దైవం వరకు ఏది చేరదు...

ఎంతో విలువైన గొప్ప సాధన మొదలు పెట్టించే ముందు మీలో మీకు ఒక నమ్మకం శ్రద్ద అవగాహన కలిగించాలి.. సాధనకు తగ్గట్టుగా మీమల్ని మీరు మలచుకోవాలి అంటే వేసుకునే వస్త్రధారణ కాదు మనసుకి కషాయం కట్టండి దేహానికి వేసే వేషాలు మనకు వద్దు మంత్రగాళము అన్నట్టు దండలు దిగేసుకోవద్దు మీరు మీ ధర్మం మీ కర్తవ్యం నిర్వహణ చేస్తూ క్రమబద్ధమైన జీవితం గడుపుతూ సాధన కొనసాగించాలి అందరూ ఉద్యోగుల, కార్యనిర్వాహన లో ఉన్నవారు అందరి పరిస్థితి తగట్టుగా నే ప్రణాలికను చేద్దాము.. ప్రతి సాధనలో ఒక విషయం తరచుగా అడుగుతున్నారు మన హిందూ స్త్రీలు సాధనలో ఆటంకం సమయంలో ఏమి చేయాలి అని హిందువులుగా కనీస ధర్మం మనకు తెలిసి ఉండాలమ్మ ఆ సమయంలో ఆపి శుద్ధి అయ్యాక కొనసాగించాలి అని ప్రతి సాధనలో చెప్పాల్సి వస్తుంది ఇటువంటివి కూడా నేర్పాల్సి వస్తే ఇంక ఉత్తమ సాధనలో ఎప్పుడు ముందుకు వెళ్తారు. సృష్టిలో స్త్రీలకు తల్లి స్థానమే ఆమె ఎవరైనా కావచ్చు.. ముందు స్త్రీలు కనీస హిందూ ధర్మం యొక్క పద్దతులు తెలుసుకొని ఉండాలి పాపటిలో కుంకుమ గడపకు, పసుపుకుంకుమా, ఇల్లు శుభ్రంగా ఉంచడం, మీరు శుభ్రంగా ఉండటం ఇవన్నీ ఒకరి నుండి తెలుసుకోవాల్సిన పనిలేదు అది మన బాధ్యత.. 

వండటానికి ముందు పాత్ర శుద్ధి, ఉపదేసానికి ముందు ఆత్మ శుద్ధి పొందే విధంగా భక్తి అనే భావనతో ఆలోచనా విధానాన్ని మార్చుకుని ఆత్మ శుద్దిని పొందుదాము..
 
సేకరణ: భానుమతి అక్కిశెట్టి 

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore