Online Puja Services

పద్మిని విద్య అంటే ఏమిటి?

3.144.127.232

పద్మిని విద్య అంటే ఏమిటి?*

పద్మినీ అనేది విధులను సూచించే విద్య . ఆ విద్యకు అధిదేవత లక్ష్మీదేవి . ఆమె నివసించే పద్మము అధారము గా దీనికి మహపద్మ పద్మినీ విద్య అనే పేరు వచ్చింది . దీనిలోని ఎనిమిది ఉపవిభాగాలే అష్టవిధులుగా పేరు పొందాయి . అవి ... 

* పద్మ ,
* మహాపద్మ ,
* మకర ,
* కచ్చన ,
* ముకుంద ,
* నందక ,
* నీల ,
* శంఖలు . 

మానవులకు సంపద మూడు విధాలుగా ప్రాప్తిస్తుంది .


* దేవతా ప్రసాదము ,
* సాధుజన సేవ ,
* స్వయం కృషి . 

వీటిలో మొదటినానినే మనము ''అదృష్టము'' అనే పేరుతో పిలుస్తాము . రెండోది దానిని ''సుకృతం '' అని అంటాము . ఇక మూడోదాన్ని " తెలివితేటలు " అని అంటాము . అదృష్టమున్నవాడు కష్టము లేకుండా సంపదలు పోగుచేస్తాడు . సుకృతం ఉన్నవాడే సాధుజన సేవ చేయగలుగుతాడు . అలాగే తెలివితేటలు ఉన్నప్పుడే వయం కృషితో సంపదలు సిద్ధిస్తాయి.

 
- రాజేంద్ర ప్రసాద్ తాళ్లూరి 

Quote of the day

The life of an uneducated man is as useless as the tail of a dog which neither covers its rear end, nor protects it from the bites of insects.…

__________Chanakya