Online Puja Services

గురువు ఎలా ఉండాలి?

3.128.205.109

గురువు (ఉపాధ్యాయుడు) ఎలా ఉండాలి?
ఒక గురువు ఎలా ఉండాలో భారతీయ సనాతన ధర్మం స్పష్టంగా సూచించింది. గురువుకు ఉండాల్సిన లక్షణాలు, గురువు గొప్పదనం గురించి స్కాంద పురాణంలో వివరించారు. ఈ పురాణంలోని ఉమామహేశ్వర సంవాదం 'గురుగీత'గా ప్రసిద్ధి పొందింది. ఇందులో గురువు అని ఎవరిని పిలవాలి? ఆయన అవసరం ఏమిటి? శిష్యుడు ఎలా ఉండాలి? తదితర ఎన్నో విషయాల్ని పరమేశ్వరుడు పార్వతీదేవికి స్వయంగా వివరిస్తాడు.

గురువు శాంతంగా ఉండాలి. మంచి వేషం (డ్రెస్సింగ్) ధరించాలి. సదాచారం (ప్రవర్తన) పాటించాలి. మంచి బుద్ధి, మంత్రతంత్రాల (పాఠ్యాంశాలుగా చెప్పుకోవచ్చు)పై చక్కని అభినివేశం 
ఉండాలి. నిగ్రహ, అనుగ్రహ సామర్థ్యాలు కలిగి ఉండాలి. ఈ లక్షణాలన్నీ గురువుకు ఉండాలని పరమేశ్వరుడు చెబుతాడు.
ప్రస్తుత సమాజానికి నిజంగా కావాల్సిన గురువు ఇలాంటి వాడే.

చాణక్యుడు చేతిలో రూపుదిద్దుకున్న శిల్పం చంద్రగుప్తమౌర్యుడు. సమర్థ రామదాసు తయారుచేసిన వీరఖడ్గం శివాజీ. రామకృష్ణ పరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరం వివేకానందుడు. భారతీయ గురుశిష్య శక్తికి వీళ్లు ఉదాహరణలు మాత్రమే. ఆదిదేవుడితో మొదలైన గురుపరంపర వేదవ్యాసుడితో సుసంపన్నమైంది. భారతీయ సంస్కృతిలో నేటికీ అది కొనసాగుతూనే ఉంది.

సనాతన ధర్మాన్ని పరంపరాగతంగా పరిరక్షిస్తున్న ఆ గురుదేవులను స్మరించుకుంటూ.. నేటి పిల్లలను పావన నవజీవన బృందావన నిర్మాతలుగా, 
రాబోవు తరం దూతలుగా తీర్చిదిద్దడానికి ఘనమైన అడుగులు వేద్దాం..

Quote of the day

You can't cross the sea merely by standing and staring at the water.…

__________Rabindranath Tagore