Online Puja Services

వేములవాడ ధర్మగుండ మహత్యం తెలుసా

18.118.254.94
వేములవాడ ధర్మగుండ మహత్యం తెలుసా ?
 
రాజరాజనరేంద్రుడు అను చక్రవర్తి తనకు వచ్చిన కుష్టు వ్యాధి నివారణ కోసం ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ చివరకు వేములవాడ ప్రాంతం చేరుకొన్నాడు.   ఇప్పుడు నేలకొని ఉన్న దక్షిణామూర్తి ప్రాంతము లో ఒక మహా బోధి వృక్షం ఉండేది.  దాని ప్రక్కనే ఒక కోనేరు ఉంది.  ఇక్కడ బస చేయడానికి అనువైన ప్రాంతము గాఉందని బోధి చెట్టు క్రింద సేద తీర్చుకొన్నాడు.  
 
ఉదయమునే స్నానమాచరించుటకు ప్రక్కనే ఉన్న కోనేరు లో దిగగానే ఒక్కసారి గా తన శరీరాన్ని ఏదో బలమైన శక్తి కోనేరు అడుగునకు లాగినది. చక్రవర్తి కోనేరు అడుగు భాగం నుండి కొంత సమయములో సంపూర్ణ ఆరోగ్యం తో తన వ్యాధి నయం అయి బయటకు వచ్చాడు. అంతే ఆ రాజు బోధి వృక్షం క్రింద గల దక్షిణామూర్తి ( శివలింగం ) కు పుజ ఒనరించి,  నమ్మలేని నిజాన్ని చూసి నివ్వర పోతు, ఏమి ఆ కోనేటి మహత్యం అంటూ ఆలోచిస్తూ  చెట్టు క్రింద వాలి పోయాడు . 
 
కొద్ది సేపటి తరువాత జనం అలజడికి మేల్కొని చూడగా అక్కడ ఒక మహాముని కూర్చుండి. వ్యాధి గ్రస్తులయిన వారికీ కోనేటి నీటితో వైద్యం చేస్తూ కనిపించాడు. ఆ మహాముని కి ప్రణమిల్లి అయ్యా నేను రాజరాజనరేంద్రుడు అను చక్రవర్తి ని.  నాకు అతిబయంకర కుష్టు వ్యాధి వఛ్చినది.  ఎన్నో ప్రదేశాలు తిరిగా, ఎన్నో పుణ్యనదులలో స్నానమాచరించా.   కానీ ఈ కోనేటి లో మునగాగానే నా వ్యాధి దూరమైంది ఎలా? నా సందేహ నివృతి చేయండి స్వామి అంటూ ప్రాధేయ పడ్డాడు. అప్పుడు ఆ మహాముని ఈ విధముగా చెప్పాడు.  ఈ కోనేటి అడుగు భాగమున అష్టదిక్కుల కాలబైరవ జ్వలముఖి  బహుముఖి  ...... దేవత లు కొలువు తీరి ఉన్నారు.  అందుకే ఈ కోనేటి కి కలియుగాంతం  వరకు దాని మహిమ అలానే ఉంటుందని చెప్పాడు. 
 
ఓ.కే నా నమ్మలేదు కదా.  ఇప్పటి కి గుండం లో నీరు తిసి వేస్తే మనకు ఆ విగ్రహాలు కనిపిస్తాయి మిత్రులారా ..... ఇకనుంచి ఈ  చరిత్ర నలుగురి తో పంచుకుని ఆధారాలతో కనిపించే పుష్కరణి పవిత్రతను కాపాడుతారని ఆశిస్తూ................
 
సేకరణ. 

Quote of the day

Do not dwell in the past; do not dream of the future, concentrate the mind on the present moment.…

__________Gautama Buddha