Online Puja Services

శ్రీ విద్యా ఉపాసన రహస్యం -5

3.141.244.201

శ్రీ విద్యా ఉపాసన రహస్యం -5 

సృతి ప్రకారము ప్రకాశము అంటే బ్రహ్మ అని అర్థము. అది వివిధ రకములుగా ప్రకాశిస్తుంది. (తమేవ భాంతం అనుభాతి సర్వం---కఠ ఉపనిషద్ II.ii.15).
విమర్శ అనేది బ్రహ్మకు వివిధములయిన అంతర్గత ప్రకాశము ద్వారా స్వభావ సిద్ధము. (తస్య భాషా సర్వమిదం విభాతి).  

ఆగమాల ప్రకారం జ్ఞానము మరియు క్రియల మేళవింపే చేతన (సంవిత్, చిత్ లేక పరమశివ).  
జ్ఞానము మరియు క్రియ, శివ మరియు శక్తి, మరియు ప్రకాశము క్రియ విమర్శ అనేది ఒక్కటే. అందువలన కాంతి మరియు మెరుపు రెండూ అమ్మే. మంత్రము శివ శక్త్యాత్మిక అనేది శ్రీవిద్య అమ్మవారి మంత్రము. మరియొక మంత్రము పరమశివ కామేశ్వర అని శ్రీవిద్య అమ్మవారి మంత్రము ఉచ్ఛరించవలసిన అవసరము లేదు. ఎందుకంటే శ్రీవిద్య అమ్మవారు శివ మరియు శక్తి స్వరూపిణి అగుటయే దీనికి కారణము.  

అమ్మ శ్రీవిద్య స్థితి సదాశివ లేక అర్ధనారీశ్వర స్థితికి అతీతమయినది.
శివుడు శక్తి రెండు ఒక్కటే. శక్తి తనయొక్క క్రియాశీలకత తెలుస్తుంది, మరియు తెలియ బరుస్తుంది. శివ ఒక్క ఆకారములో మాత్రమె ఉండి తన క్రియాశీలకత తెలియబర్చడు. శివ సూక్ష్మ చైతన్యరూపములో ఉంటాడు.
నిత్యమయిన శక్తి రూపసహితము అవు
తుంది. వివిధరూపములను తీసికుంటుంది.
శివుడు క్రింద వెల్లికిలా పడుకొని ఉన్నట్లుగాను, ఆయనమీద కాళ్ళుబెట్టి కాళికా దేవి రూపములో నుంచున్నట్లుగా చూపించటము వెనకాల ఉన్న ఆంతర్యము అమ్మ తనయొక్క శక్తిని ప్రదర్శించటమే. నిద్రాణమై ఉన్న సదాశివునిలోనుంచి శ్రీ మహాత్రిపురసుందరి బ్రహ్మ, విష్ణు, రుద్రా, మరియు ఈశ్వర అనే తన నలుగురు దేవతలతోను ఉద్భవించింది.
ఆవిడ నాలుగు భుజములు/చేతులు నివృత్తి, ప్రతిష్ఠ, విద్య, మరియు శాంత అనే సృజనాత్మకశక్తికి ప్రతీక. అమ్మ నేత్రములు సూర్యుడు, చంద్రుడు, మరియు అగ్నికి. ఇవి జ్ఞానము (ప్రమాణ), జ్ఞేయము(ప్రమేయము), మరియు అనుభావిక ప్రయోగం/జ్ఞాత (ప్రమత)లకు ప్రతీకలు. అమ్మ స్థనములు అవగాహనా హెచ్చరికలకు ప్రతీకలయిన కాంతి మరియు శబ్దము లేదా ప్రకాశ మరియు విమర్శ. ఆవిడ వంగిన కటిప్రదేశము వ్యక్తీకరణకు గుర్తు. వీటిని మనము ఈ గుర్తులను అర్థము(decode )చేసికుంటే మనకు శ్రీ చక్రము యొక్క ఆవరణలు (enclosures) అర్థము అవుతాయి. 

అవి:

1.వలీత్రయా నికితాతనమ్ – మూలాదారచక్ర – భూపుర త్రైలోక్యమోహనచక్ర

2. మధ్యే నిమ్న – స్వాధిష్ఠానచక్ర – షోడశదళ పద్మ – సర్వశపరిపూరకచక్ర

3. ఆపినోట్టు –నిగాస్తినం – మణిపూరచక్ర – అష్టదల పద్మ- సర్వసంక్షోభణచక్ర

4.త్రినయనం – అనహతచక్ర- చతుర్దశర – సర్వసౌభాగ్యదాయకచక్ర

5. చతుర్భుజం – విశుద్ధచక్ర – బహిర్దశర సర్వార్ధసాధకచక్ర 

6. ప్రేతాసనధ్యాసినీం – ఆజ్ఞాచక్ర – అంతర్దశర – సర్వరక్షాకరచక్ర  

7. బందూకప్రసవారుణాంబరధరాం – మానసచక్ర – అష్ట సర్వరోగహరచక్ర

8.న్రిమున్దస్రజం – సోమచక్ర – త్రికోణ సర్వసిద్ధిప్రదచక్ర

9. శశిఖండమందితజటాజుతాం – సహస్రా – బిందు సర్వానందమయచక్ర

దీనిని దక్షిణామ్మూర్తి సంప్రదాయము ప్రకారము సంహారక్రమము అంటారు. 

శక్తిపాతము ఇచ్చుటకు షరతులు ఉండవు. శ్రీ సంవిదాంబ తన భక్తులయడల ఎల్లప్పుడూ దయగలదే. ఆ అమ్మ కి బీదా బిక్కీ అనే తారతమ్యము లేదు. భక్తిహీనులయడల ఆ అమ్మ, శ్రీ లలితా మహాత్రిపురసుందరి, దయచూపదు.
అజ్ఞానములో కూరుకొనిపోయిన ప్రజలు మాత్రమె ఈ మాయ లోకముయొక్క బాధ సంతోషములకు లోనవుతారు. ఈ అనంతమయిన లోకము ఎక్కడి నుండి వ్యక్తీకరిస్తున్నది? అమ్మ ఎవరు? అనే ఇంగితజ్ఞానము కొరకై తరచి చూచుటకు వారికి సమయము లేదు. అంతర్గత అవయవముల (అంతఃకరణ) శుద్దీకరణ అసలు సత్యము ఏమిటో తెలియ బరుస్తుంది. ఆవిడ భక్తుడు/ భక్తురాలు ఆవిడ దయవలన ఆవిడే అవుతుంది.
త్రిపుర, శ్రీదేవి అమ్మయొక్క అద్భుతమయిన నామము. ఆ నామము గురించి చాలా చర్చించాము. ఆ వ్యష్టిలోని మూడు పురములకు, (భూః - భూమి, భువః – ఆకాశము, స్వః – అంతరిక్షము), ఆవిడయే రాణి. వీటినే
విశ్వ – విరాట్, 
తైజస – హిరణ్యగర్భ, 
ప్రాజ్ఞ – ఈశ్వర అంటారు వేదాంతములో. శ్రీదేవిని, అపారమయిన తురీయ అంటారు. అది నాలుగవ స్థితి. 

మూడు వేదములు ఉన్నవి. ప్రాథమికముగా మూడు గుణములు ఉన్నవి. అవి సత్వ రజో మరియు తమో గుణములు. ఆ గుణముల ప్రకారమే వారి భక్తిభావములు, ప్రార్థనలు, ధ్యానములు ఉండును. శ్రీ భగవద్గీతలో కూడా ఇదే పొందుపరచబడినది. ఆర్తుడు, జిజ్ఞాసువు, మరియు ధనాపేక్ష గలవాడు అని. వీరు ముగ్గిరికీ అతీతముగా ఉన్న నాలుగవవాడు జ్ఞాని. వాడు శ్రీదేవి అమ్మకు తన నిత్యమయిన నమ్మకమయిన ఒకే విధము అయిన భక్తిని ప్రదర్శిస్తాడు.

నవారణపూజలో బ్రాహ్మణుడు పాలు బెల్లములతో మాత్రమె తొమ్మిది ఆవరణలకు తర్పణములను ఇవ్వాలి. మిగిలిన దినుసులతో ఇవ్వకూడదని ఆగమశాస్త్రములు చెప్తున్నాయి. నెయ్యి, మరియు తేనె మిగిలిన రెండు వర్గములవారికి చెప్పబడినవి. దీపకనాథ సిద్ధ తన ‘శ్రీవిద్యా సుద్ధోదయ’ ఈ విషయమై ఇంకా విపులముగా తెలియబరచారు. శుభాగామ పంచకం లోకూడా దీని ప్రస్తావన ఉన్నది.
పాలు, నెయ్యి, మరియు మధు సత్వగుణముకోవకు చెందినవారు.

రజో మరియు తమో గుణముల కోవకు చెందినవారల చైతన్య స్థాయిలు వేరే ఇదిగా ఉండును. (సశేషం)

Quote of the day

Even if a snake is not poisonous, it should pretend to be venomous…

__________Chanakya