Online Puja Services

శ్రీ విద్యా ఉపాసన -2

18.191.223.123
శ్రీ విద్యా ఉపాసన -2  

జనన – మరణ – జనన వృత్తములో కొట్టుమిట్టాడు మనిషికి రకరకాలయిన తగులములు పీడుస్తూ ఉంటాయి. ఆత్మసాక్షాత్కారమునకు పిమ్మట పరమాత్మతో అయిక్యమగుటకు ఈ సంచితకర్మలను దగ్ధముచేయుట ఆవశ్యకము. (సక్రిద్విభాతో అయం ఆత్మా--ఛాందోగ్యోపనిషద్ 8.4.2).
మహాత్రిపురసుందరి మీద ధ్యానము చేసిన అమ్మ దయ ఆశ్చర్యకరముగా మరియు యాదృచ్ఛికముగా కానవస్తుంది.

జగత్తు యొక్క ఉపరితలములోని మూడు గుణములు సమానముగా కలిసినప్పుడు మూడు దివ్యమయిన మార్మిక రూపములుగా దర్శనమిస్తుంది. అప్పుడు దివ్యమాత వ్యక్తీకరించును. మూడు మార్మిక రూపములు కలిసిన రీతిగా దర్శనమిచ్చును. ఆ దివ్యమాత మూడు మార్మిక రూపములకు అతీతురాలు. ఆ నాలుగవది, మరియు అన్నిటికీ అతీతమయిన ఆ అమ్మ మానవ గ్రహింపుకు, మరియు భావనకు, అతీతురాలు. ఆ అమ్మ రూప రహితురాలు. అన్నిటికీ అతీతురాలు ఆ అమ్మ. 

‘అయిం’ మంత్రమును లలాటములో పరిపూర్ణమయిన ఏకాగ్రతతో స్థిరముగా ఉచ్చారణ చేయవలయును. దానివలన ఆ అమ్మ మహాత్రిపుర సుందరి అపారదయతో దర్శనము ఇస్తుంది. ఆ అమ్మ ప్రకాశరూప దర్శనము దానికి నిదర్శనము.
మంత్రోద్ధార విధిలోని తంత్ర పధ్ధతి ప్రకారము (మంత్రోద్ధార విధిర్విశేషసహితా సత్సంప్రదాయాన్వితః) ఉచ్ఛరించుట చేస్తాడు సాధకుడు. అమ్మ శ్రీదేవి ద్వైతమునుండి సాధకుడ్ని విముక్తి చేస్తుంది. సృష్టి, స్థితి, మరియు లయ మూడూ ఒకటే అయిన రూపముగా సాధకుడు దర్శనము ఇస్తాడు. సాధికారత, సాక్ష్యం, మరియు సిద్ధాంతము –ద్వైతముయొక్క వివిధ కోణములు. ఈ మూడు కోణములు పరబ్రహ్మ పరమశివలో కరిగిపోతాయి. శ్రేష్ఠతమ సౌందర్యముయొక్క నిత్యస్థితి ఇదియే. ఇది శ్రీదేవి మాత యొక్క దయతోనే సాధ్యము.

సాధకుని ఆత్మయే శివ. అది శక్తిద్వారా గుర్తించబడుతుంది. (శైవముఖమిహోచ్యతే – విజ్ఞానభైరవ 20).

‘య ర ల వ’ అను అక్షరములను అంతస్థ అంటారు. ఇవి సాధనను ఉన్నత స్థానమునకు తీసికెల్తాయి.
‘శ ష స హ’ అక్షరములను యుష్మా అక్షరములు అంటారు. వీటిని శక్తివంతముగా ఉచ్ఛారణ చేయవలయును. ఇవి ఉష్ణము మరియు ఆత్రత కలుగచేయునవి. 
‘హ’ అక్షరము నిశ్చయమునకు ప్రతీక. ‘అ’ శివకు, ‘హ’ శక్తికి ప్రతీక.  
‘అ’ మరియు ‘హ’ కు బిందువు జోడిస్తే ‘అహం’ అగును. పరబ్రహ్మకు మరియు పరాశక్తికి ప్రతీక. ‘అహం బ్రహ్మాస్మి, శివోహం, అహం బ్రహ్మస్వరూపి ని’– ఈ మహావాక్యములు నేనే పరమాత్మను అనే విషయమును సూచిస్తాయి. ఈ వాక్యము(లే) నిత్యసత్యములు. 
పరమాత్మ (పరా) యొక్క వికసించే మొదటి బీజము(sprouting seed) పశ్యంతి. స్వయంప్రకాశమయిన సదాశివతత్వములో, అమ్మ జ్ఞానము ద్వారా వ్యాప్తిచెందుతుంది. అమ్మ అతి సూక్ష్మమయినది. అతి దయాళు. ‘అయిం’
అక్షరం దీనికి ప్రతీక. త్రపుసి మొక్క అంకురము యొక్క కాండము కుండలినీ మాదిరి అతి సూక్ష్మము. యునాని వైద్యుడు కొన్ని రుగ్మతలకు ఈ మూలిక(herb) ను ఉపయోగిస్తారు. 

కాశ్మీర్ వాతావరణములో ఈ మూలిక ఎక్కువగా పెరుగుతుంది. ఇక్కడ కుండలినీని ఊర్ధ్వ కుండలినీ అంటారు. శరీరమునకు కావలసిన ప్రాణశక్తికి మూలకారణము కనుక దీనినే ప్రాణ కుండలినీ అనికూడా అంటారు. ఇక్కడ కుండలినీ స్థూల అవస్థలో పనిచేస్తుంది. తద్వారా సాధారణ జీవనమును స్థితివంతము(maintaining normal life) చేయుటకు శరీరమునకు కావలసిన ప్రాణశక్తిని ఇది కలగజేస్తుంది. కుండలినీ జాగృతి చెందినప్పుడు శరీరము ప్రకాశవంతమవుతుంది. అది సాధకునియొక్క లలాటములో తెలుస్తుంది. ఎంత ఎక్కువగాజాగృతిచెందుతే అంత ఎక్కువగా సాధకుని లలాటము తేజోవంతమవుతుంది, మరియు అంత ఎక్కువగా శక్తితో శరీరము విరాజిల్లుతుంది. ఈ రహస్యం తెలిసిన సాధకుడు జన్మ- మరణం – జన్మ వృత్తములో పడడు.
సాధకులకు తీవ్రమయిన సాధన చేసినయడల కుండలినీ జ్ఞానముగురించి తెలుసుకోగలుగుతారు. కుండలినీ జ్ఞానముగురించి కొంతమంది మాత్రమె తెలుసుకోగలుగుతారు. అందువలన దానిని రహస్యం అంటారు. మోక్షము అనేది భోగఫలము. 
జీవన్ముక్తులు మాత్రమె మోక్షముయొక్క భోగఫలమును అనుభవిస్తారు. కాని ఈ స్థితి చాలా కష్టముగానే లభ్యమవుతుంది. ఎన్నిజన్మలు ఎత్తినా శ్రీ పరాభట్టారిక దయలేనిది మోక్షము లభ్యమవదు.

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha