Online Puja Services

ఆడవాళ్లు చేయకూడని పనులు

3.141.244.153

ఆడవాళ్లు చేయకూడని పనులు

మీ భర్త పిల్లలు మంగళ వారము నాడు క్షవరము గడ్డము గీసుకోవడము చేయనీయ వద్దు. ఈ ప్రక్రియ దరిద్రాన్ని సంభవింప చేయును.

మంచి పనులను శుక్ల పక్షము నందే అంటే అమావాస్య నుండి పౌర్ణమి వరకే చేయ వలెను.

మీరు మీ పిల్లలు దిండు పైన కూర్చో వద్దు 

స్త్రీలు రాత్రి సమయమున గాజులు కమ్మలు తీయరాదు.

దుఃఖము విచారణ చేయ వచ్చిన వారిని ఆహ్వానించ కూడదు. అలాగే వారు పోయేటప్పుడు వెళ్ళి వస్తానని చెప్ప కూడదు.
ఈ మధ్య కాలంలో దుఃఖము విచారించ వచ్చిన వారిని రండి రండి అంటూ సాదరముగా ఆహ్వానించి స్థలము ఇచ్చి కూర్చోపెట్టి కాపీలు ఇచ్చి చాల అతిథి మర్యాదలు చేస్తారు .అపరోక్షముగా మనము అశుభములను కోరుకోవడానికి ఇది నాంది అవుతుంది.

కొత్త వస్త్రములను ధరించే ముందు దానికి కొంత పసుపు ఏదైనా ఒక మూల రాయాలి, పసుపు క్రిమినాశిని.

ఒకరు ధరించిన పూలను మరొకరు పెట్టుకోకూడదు 

నలుపు రంగు వస్తువులు బట్టలు ధరించ కండి. ఈ మధ్య కాలంలో సువాసిని స్త్రీలుకుడా నలుపు రంగు వస్తువులు ధరించడం ఎక్కువై పోయింది.

ఉప్పు మిరప చింతపండు వీటిని ఎవరికి ఇచ్చిన, చేతితో ఇవ్వకూడదు. కింద పెట్టండి వాళ్ళే తీసుకొంటారు .

ప్రతి రోజు భోజనమునకు ముందు కాకికి అన్నము పెట్టండి, ఇది పితృ దేవతలకు ప్రీతి .కాకికి మనము భోజనము చేయుటకు ముందు, కుక్కకు మనము తిన్న తర్వాత పెట్టాలి.
అయితే కుక్కలను ఎల్లప్ప్పుడు కన్న సంతానానికంటే ఎక్కువగా లాలిస్తూ దాని నోటికి ఆకులోంచి అందిస్తూ భోజనము చేయడము ఎక్కువై పోయింది.

టెంకాయ చిప్ప తాంబూలం ఇచ్చేటప్పుడు మూడు కండ్లు వుండే భాగము మీరు ఉంచుకొని మిగత భాగము ఇతరులకు ఇవ్వవలెను.

స్త్రీలు ఎప్పుడు జుట్టు విరపోసుకొని ఉండకూడదు .ఇది జ్యేష్టాదేవి స్వరూపము. ఇంటిలో మంగళము జరుగుటకు విఘ్న కారణమవుతుంది. 

శుక్రవారమునాడు గాని ,జీతము రాగానే గాని ఆ డబ్బుతో మొట్ట మొదటి సారి ఉప్పు కొనండి ఈ చర్య పై పై డబ్బులు చేరటానికి అవకాశము ఎక్కువ.

కాలిపైకాలు వేసుకొని కుర్చోవడము, కాళ్లాడిస్తూ కూచోవడం, ఒంటి కాలితో నిలవడం, స్తిరముగా నిలవక ఉగుతుండడం లాంటి పనులు చేయకూడదు. ఇందువల్ల ఒకటి దారిద్ర హేతువు, మరియొకటి ఆ ప్రదేశములు బలహీనమై త్వరగా విరుగుటకు అవకాశములు ఎక్కువ.

ఎల్లప్పుడు ఇచ్చి పుచ్చుకోవడానికి కుడి చేతిని అలవాటు చేయాలి ,ఎడమ చేతిని ఉపయోగించ కూడదు.

సుమంగళి స్త్రీలు రాత్రి వేళలందు అలిగి ,ఆహారము తినకుండా నిద్రించ కూడదు.

స్త్రీలు బహిష్టు సమయమందు పూలు తలలో పెట్టుకోరాదు. పూలు వాకిట్లో అమ్మడానికి వస్తే నాకు వద్దు అని చెప్పు రాదు ,రేపు తీసుకుంటాను అని అనవలెను.

ఎప్పుడు మన నోటినుండి పీడ ,దరిద్రం, శని పీనుగా, కష్టము, అనే పదములను ఎప్పుడు ఉపయోగించ కూడదు.

ఇంటిలో దుమ్ము ధూళి, సాలెగూడు కట్టడం లాంటివి దారిద్ర హేతువులు. పదిరోజులకు ఒకమారు మంగళ శుక్ర వారములు కాకుండా దులిపి శుభ్రము చేయవలెను.

శ్రాద్ధ దినమందు ఇంటి ముందు ముగ్గు శ్రాద్ధము అయ్యేవరకు వేయకూడదు, శ్రాద్ధానంతరము ముగ్గు వేసి తర్వాత ఇంటిలోని వారు భోజనము చేయవలెను.

Quote of the day

Just as a candle cannot burn without fire, men cannot live without a spiritual life.…

__________Gautam Buddha