మన చుట్టూ ఉన్న ఏడు అద్భుతాలు.

54.165.57.161

ఓం నమఃశ్శివాయ నమః శివాయ

శ్రీ మాత్రే నమః శ్రీ గణపతిని నమః 

ఆలోచిస్తే.....ఆచరిస్తే.... అద్భుతమే......
మన చుట్టూ అద్భుతాలతో పయనిస్తూ...  ఇంకెక్కడో ప్రాణం లేని వాటిని చూసి.. ఇది చాలా అద్భుతమని  ఆశ్చర్యపోతుంటాం!! 

మన చుట్టూ ఉన్న ఏడు అద్భుతాలు.

1 . తల్లి 
మనల్ని ఈలోకానికి  పరిచయం చేసిన వ్యక్తి... మనకు జననం ఇవ్వడానికి మరణం దాకా వెళ్లివచ్చిన...  తల్లి మొదటి అద్భుతం. 

 2 . తండ్రి 
మన కళ్ళల్లో  ఆనందాన్ని చూడాలని  తన కన్నీళ్లను దాచేస్తాడు  
మన పెదవులపై  చిరునవ్వును చూడాలని తన కష్టాలను దాచేస్తాడు 
దుఃఖాన్ని  తాను అనుభవిస్తూ.. సంతోషాన్ని  మాత్రమే మనకు ఇచ్చే తండ్రి రెండో అద్భుతం. 
 

3 . తోడబుట్టిన వాళ్ళు 
మన తప్పులను వెనుకెసుకురావాడానికి...  
మనతో పోట్లాడడానికి...  మనకు నేను ఉన్నా అనే ధైర్యం ఇవ్వడానికి వచ్చే బంధమే వీళ్ళు... 
తోడబుట్టినవాళ్లు మూడో అద్భుతం 

4. స్నేహితులు  
మన భావాలను పంచుకోడానికి..  
మంచిచెడు అర్థం అయ్యేలా చెప్పడానికి...
ఏది ఆశించకుండా..  మనకు దొరికిన స్నేహితులు  నాలుగో  అద్భుతం. 

5. భార్య / భర్త 

ఈ ఒక్క బంధం కోసం అన్ని బంధాలను... ఎదిరించేలా  చేస్తుంది 
కలకాలం తోడు ఉంటూ... ఇన్నిరోజులు తోడు ఉన్న అన్ని బంధాలకంటే...  ఈ బంధం ఇంకా గొప్పదని నిరూపిస్తుంది  
భార్య/భర్త అర్థం చేసుకునేవారు దొరికితే  ఐదో అద్భుతం మన సొంతం .

6. పిల్లలు 
మనలో స్వార్థం మొదలవుతుంది..  
మన పిల్లలు బావుండాలని పదే పదే మనసు ఆరాటపడుతుంది...  
వారి ఆలోచనలే  ఎప్పుడూ చుట్టూ ఉంటాయి..  
వారికోసం మాత్రమే గుండె  కొట్టుకుంటూ  ఉంటుంది.. 
వారి కోసం ఏదో ఒకటి త్యాగం చేయని... తల్లి తండ్రులు  అసలు ఉండరు...  
పిల్లలు ఆరో అద్భుతం 
అన్ని అయిపోయాయి ఇంకా 7 అద్భుతం ఏంటా అని అనుకుంటున్నారా?

7. మనవళ్లు / మనవరాళ్లు  
వీరికోసం ఇంకా కొన్నిరోజులు  బతకాలనే  ఆశపుడుతుంది.. 
వీరితో కలిసి ఆడుకోవడానికి వయసును మరిచి, అద్భుతం 
మళ్ళీ పసిపిల్లలం... అయిపోతాం  
వీరు మన జీవితానికి  దొరికిన.. ఏడో అద్భుతం 

ఇలా అద్భుతాలన్నీ  మన చుట్టూ ఉంటె అక్కడెక్కడో వెళ్లి వెతుకుతుంటాం... 
కాసింత ప్రేమ చాలు... ఇంకెన్నో అద్భుతాలు  మన సొంతం అవుతాయి  
చిన్న పలకరింపు  చాలు...

 అందరూ బాగుండాలి 

- రాజేంద్రప్రసాద్ తాళ్లూరి 

Quote of the day

Do not dwell in the past; do not dream of the future, concentrate the mind on the present moment.…

__________Gouthama Budda