వ్యత్యాసం వయస్సు మాత్రమే

3.236.51.151

వ్యత్యాసం వయస్సు మాత్రమే ...

35 సం.ల క్రితం నేను స్కూల్ కి వెళ్లే సమయంలో మా ఆచార్యుడు నన్ను ఒక ప్రశ్న అడిగారు...
కృష్ణుడికి, కన్నయ్యకి వ్యత్యాసం ఏమిటి..? 

దానికి నేను చెప్పిన సమాధానం రెండిటికి వ్యత్యాసం వయస్సు మాత్రమే ...

ఒక చిన్న ఉదాహరణ.., నేను ఒక రోజు నా మొఖం మొత్తం సోప్ రుద్దుకొని స్నానం చేస్తున్నాను. ప్రక్కన ఉన్న నీళ్లు కనిపించలేదు. నా రెండు చేతులతో అక్కడ మొత్తం అంత వెతికినా చెంబు కనిపించలేదు.

అప్పుడు నాకు నా కూతురు నవ్వు వినిపించింది. అప్పుడు నాకు అర్ధం అయింది, చెంబు తన దగ్గర ఉంది అని.. నాకు కళ్ళు మంట పుడుతున్నాయి అని తనకి తెలియదు.., నేను చెంబు వెతుకుతూ ఉండటం తనకు ఆనందం.

 అది చిన్న పిల్లలు చేసే పిల్ల చేష్టలు. ఇప్పుడు నా కూతురు పెద్దది అయింది.. ఇప్పుడు  నా కళ్ళలో చిన్న దుమ్ము పడినా తనకి చాలా బాధ కలుగుతుంది..

రెండిటికి వ్యత్యాసం వయస్సు మాత్రమే..

మహాభారతంలో శ్రీ కృష్ణుడు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు గోపికల చీరలు దాచిపెట్టి ఆనందపడ్డాడు.. అదే కన్నయ్య పెద్దవాడు అయ్యాక ద్రౌపదికి చీరెలు ఇచ్చి కాపాడాడు. 

రెండిటికి వ్యత్యాసం వయస్సు మాత్రమే..

కృష్ణుడు చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు ప్రక్క ఇళ్ళలో వెన్న దొంగతనం చేసి తినేవాడు. అమ్మ అడిగినప్పుడు దొంగతనం చేయలేదు అని అబద్దం  చెప్పాడు.. అదే కన్నయ్య పెద్దవాడు అయ్యాక దొంగతనం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు అని గీతోపదేశం చేసాడు. 

రెండిటికి వ్యత్యాసం వయస్సు మాత్రమే..

వయస్సు కి తగట్టు మనల్ని మనం మార్చుకోని మంచి దారిలో వెళ్ళాలి. 
అదే వయసుకు తగ్గట్టుగా వ్యవహరించడం...

కృష్ణం వందే జగద్గురుమ్...

- పాత మహేష్

Quote of the day

It is the habit of every aggressor nation to claim that it is acting on the defensive.…

__________Jawaharlal Nehru