సమస్యలకు పరిష్కారం

3.236.253.192
ఒక పెద్దాయన తన పొలంలో ఉన్న గడ్డిమేటు దగ్గర తన వాచీని పోగొట్టుకున్నాడు. ఎంత వెతికినా కనపడలేదు. తన కొడుకు మొదటి సంపాదనతో కొన్న వాచీ కాబట్టి ఆయనకు అదంటే చాలా చాలా ఇష్టం. వెతికి వెతికి వేసారిపొయాడు. అక్కడ ఆడుకుంటున్న పిల్లల గుంపును చూసి, తన వాచీ వెదికి తీసుకొస్తే ఒక బహుమతి ఇస్తా అని ఆశ పెట్టి వాచీ కోసం వెతికించాడు. ఎవ్వరికీ దొరకలేదు. 
 
ఒక పిల్లవాడు మాత్రం గడ్డివాము దగ్గరే కూర్చున్నాదు. కొంత సేపటి తరువాత వాచీతో తిరిగి వచ్చాడు. వాచీ ఎలా దొరికింది? ఏమి చేసావు? అని అడిగాడు పెద్దాయన. "నేనేమి చేయలేదు. నిశ్శబ్దంగా దృష్టి కేంద్రీకరించి చెవులు రిక్కించి విన్నాను. గడియారం యొక్క టిక్ టిక్ శబ్దం ఎటువైపు నుంచి వస్తోందో గమనించి అక్కడ వెతికితే కనబడింది" అని బదులిచ్చాడు కుర్రాడు. 
 
సమస్యలకు పరిష్కారం మెదడు ప్రశాంతంగా ఉన్నప్పుడు అలోచిస్తేనె దొరుకుతుంది. బాగా అలసిపోయిన మెదడుతో సమస్యలను పరిష్కరించలేము. అసలు సమస్య ఏమిటో, ఏ దిశగా ఆలోచిస్తే పరిష్కారం అవుతుందో ఒక నిర్ధారణకు రావాలి అంటే, ప్రశాంతత చాలా ముఖ్యం. ఎక్కువ ఆలోచించిన కొద్దీ, ఒక్కోసారి సమస్య ఇంకా జటిలం అయిపోతూ ఉంటుంది. నిదానంగా ఆలోచిస్తే, సమస్యను పరిష్కరించడానికి సరి అయిన తోవ దొరుకుతుంది.....!!
 
సర్వేజనా సుఖినోభవంతు
 
- సేకరణ 

Quote of the day

Buddhas don't practice nonsense.…

__________Bodhidharma