ఒక మంచి విషయం

3.236.98.25
ఒక మంచి విషయం
 
నిజమైన కష్టం వచ్చి నప్పుడు కళ్ళు తుడిచే వాడే, నిజమైన ఆత్మీయుడు. దైవ సమానుడు.
మనం సమాజం లో ఈ రోజు పేరు కోసమో, గొప్ప తనం చూపించు కొనే అందుకో, ప్రగల్భాలు పలికే మనుషుల ఎక్కువ అయిపోయారు.
 
మాట కాదు, చేత ఫలితం ఇస్తుంది అని గమనించాలి.నిజమైన లేమి కలవాళ్లు ఆ మనుషుల మాటలు నమ్మటం జరుగుతూ ఉంది. నిరాశ పొందటం జరుగుతూ ఉంటుంది.
నమ్మిన వారి మానసిక ఆవేదన, ఇస్తాము అనే వారికి కీడు కలిగిస్తూ ఉంటుంది.
 
అదే విధంగా, అవసరం లేని వారు సహాయం కోసం ఎగబడటం వలన, నిజము గా అందవలసిన వారికి సరైన సమయం లో సహకారం అందదు.సహాయం పొందే వారు కూడా ఈ ఆలోచన చేయాలి.
తిరిగి ఇచ్చిన వారికి ఋణ పడతారు అనేది గ్రహించాలి.లేని మాటలు చెప్పటం, నమ్మించడం, ఆనవాయితీ గా మారింది
.
ఈ ప్రవర్తన ఖచ్చితం గా మాట చెప్పిన వారికి, వేరే రూపం లో హాని కలిగిస్తుంది.
అది రాజకీయం అయినా, వ్యక్తి గతంగా అయినా సరే.మన నుండి సేవ పొందుతూ ఉన్నారు అంటే, మన యొక్క కర్మ పరిపక్వం పొందుతోంది అని అర్థం.దైవ సంకల్పం అని భావించాలి.అలాగే మన ఇంటికి వచ్చి భోజనం చేస్తా, అని ఎవరైనా అంటే, మనం మానుకొని అయినా, వచ్చిన అతిథి యొక్క ఆత్మారాముడిని శాంతింప చేసి పంపించాలి.
 
వచ్చి అడిగిన అతిథి శత్రువు అయినా సరే , కడుపు నింప వలసిన యజమానికి కి బాధ్యత అవుతుంది.అతిధి కి పెట్టిన ఫలితం, మన జీవితం లో ఎదుగుదల కి దోహద పడుతుంది, అని ప్రతీ ఒక్కరూ గ్రహించాలి.
వచ్చిన వ్యక్తి అతిథి అయినా, మన సహాయం అర్ధించిన వచ్చిన వ్యక్తి ని అయినా, దైవ సమానం గా భావించి, ఎవరైతే సహాయాన్ని అందిస్తారో, వారు దైవత్వాన్ని పొందుతారు.
 
అందుకే మన పూర్వీకులు దేహి అన్న వారికి, మనకి చేత నైన సహాయాన్ని అందించమని చెప్పారు.అది మనకు తోచినంత ఇవ్వాలి అని అన్నారు. ఉత్తి చేతులతో పంప వద్దు అని చెప్పేవారు.దైవ నామం స్మరిస్తూ ఇచ్చేవారు ఇవ్వాలి.తీసుకొనే వారు కూడా భగవత్ సంకల్పం గా భావించి తీసుకోవాలి.
 
ఇచ్చిన వారి యొక్క మంచిని కోరుకోవాలి పుచ్చుకున్న వారు.పుచ్చు కున్న వారు ఇచ్చిన వారి చెడు కోరుకో కూడదు, అలా కోరుకొనే వారికి కూడా హాని సంప్రాప్తి అవుతుంది.
ఇచ్చేవారు, తీసుకొనే వారికి ఎప్పుడో అంటే ముందు జన్మ లో ఋణ పడిన వారు అయి ఉంటారు. అలాగే తీసుకొనే వారు కూడా.
అదే కార్యాకారణ సంబంధం.
 
అక్కడితో ఇద్దరి మధ్య బంధం ముగుస్తుంది.
అందుకే వీలు అయినంత వరకూ పుచ్చు కోకూడదు. పుచ్చు కొనే వారు కూడా గమనించాలి.అదే విధంగా, మనతో ఎవరైనా అన్నార్తి తో ఉన్నారు అనిపిస్తే, మన దగ్గర ఉన్న తిను బండారాలు వారికి కూడా ఇచ్చి మనం తినాలి.అంతే కానీ ఒక్కరే తిన కూడదు.
 
ప్రతీ బియ్యపు గింజ మీద తినే వారి పేరు రాసి ఉంటుంది అంటారు.మన దగ్గర ఏది ఉన్నా మనతో రాదు. అన్ని ఇక్కడ వదిలి వెళ్ళాలి, అన్న స్పృహ తో ప్రతీ ఒక్కరూ మెలగాలి
 
బి. సునీత శివయ్య

Quote of the day

Never make friends with people who are above or below you in status. Such friendships will never give you any happiness.…

__________Chanakya